ఐపీఎస్ క్యాడర్‌కు పదోన్నతి పొందిన జనగామ డీసీపీ రాజా మహేంద్రనాయక్ ను ఘనంగా సన్మానించిన విద్యుత్ అధికారులు
———————————————————————-
జనగామ, సెప్టెంబర్ 3,పున్నమి జిల్లా ప్రతినిధి :
జనగామ డీసీపీ రాజా మహేంద్రనాయక్ ఐపీఎస్ క్యాడర్‌కు పదోన్నతి పొందిన సందర్భంగా ఎస్ఈ/ఎలక్ట్రికల్ సిహెచ్ . సంపత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా డీసీపీ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్ సేవా ప్రస్థానం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈ ఎం. లక్ష్మీనారాయణ రెడ్డి, ఏడీఈ డి. వేణుగోపాల్, ఏఈ బి. సౌమ్యతో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొని డీసీపీ కు శుభాకాంక్షలు తెలిపారు


