Thursday, 3 September 2026
  • Home  
  • మెగా బ్రదర్స్ చిరంజీవి,పవన్ కళ్యాణ్ పుట్టినరోజుల సందర్భంగా పి మల్లవరంలో మెగా రక్తదాన శిబిరం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మెగా బ్రదర్స్ చిరంజీవి,పవన్ కళ్యాణ్ పుట్టినరోజుల సందర్భంగా పి మల్లవరంలో మెగా రక్తదాన శిబిరం

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పుట్టినరోజులను పురస్కరించుకుని తాళ్లరేవు మండల జనసేన పార్టీ నాయకులు, ఆర్ఎంపీ వైద్యులు వి.ఆర్.ఎన్.బి. ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలను నిర్వహించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ సభ్యులు,మాజీ లోక్ సభ స్పీకర్ గంటి మోహనచంద్ర బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధుర్ అన్నారు.తాళ్లరేవు మండలం పి.మల్లవరం గ్రామంలోని దూళిపూడి గొల్లబాబు కళ్యాణ మండపంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. మెగా రక్తదాన శిబిరాన్ని ముమ్మిడివరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్ పర్సన్ ఓగూరి భాగ్యశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గంటి హరీష్ మాధుర్ శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను అభినందించారు. మెగా బ్రదర్స్ పుట్టినరోజులను పురస్కరించుకుని ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సేవా దృక్పథంతో రక్తదాన శిబిరం నిర్వహిస్తూ, తలసేమియా బాధిత చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించేందుకు కృషి చేస్తున్న సీనియర్ ఆర్ఎంపీ వైద్యులు,సీనియర్ నాయకులు డాక్టర్ వీఆర్ఎన్ బి ప్రసాద్ సేవలను ఆయన ప్రశంసించారు.ఈ సందర్భంగా గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు తరచూ రక్తం అవసరమవుతుందని, అలాంటి వారికి రక్తదాతలు అందించే రక్తం ఎంతో విలువైనదని అన్నారు. పుట్టినరోజు వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, రక్తదానం వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఇతరులకు ఉపయోగపడేలా నిర్వహించడం,ప్రాణ దాతలుగా నిలవడం ఆదర్శనీయమన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 200 యూనిట్ల వరకు రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి అందించడం గొప్ప సేవా కార్యక్రమమని కొనియాడారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ కమిటీ చైర్మన్ వై డి రామారావు,జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను అభినందించారు. డాక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను వారు ప్రశంసించారు. యువతతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రక్తదానానికి ముందుకు రావడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు శిబిరంలో రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తాళ్ళరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, సీనియర్ నాయకులు గుద్దటి రమా కేశవ బాలకృష్ణ ( జమ్మి ), విల్లా విరా, సలాది రాజా, వెంటపల్లి సత్యవతి, లంకలపల్లి రాణి, బద్రి రామ, ధూళిపూడి గోపి, టీంకు, అబ్బిరెడ్డి భార్గవ్ సందీప్, దూడల స్వామి నాయుడు, పురుషోత్తం, అధిక సంఖ్యలో మెడికల్ రెప్రజెంటేటివ్ లు, మెగా అభిమానులు,జనసైనికులు,వీర మహిళలు పాల్గొన్నారు.

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పుట్టినరోజులను పురస్కరించుకుని తాళ్లరేవు మండల జనసేన పార్టీ నాయకులు, ఆర్ఎంపీ వైద్యులు వి.ఆర్.ఎన్.బి. ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలను నిర్వహించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ సభ్యులు,మాజీ లోక్ సభ స్పీకర్ గంటి మోహనచంద్ర బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధుర్ అన్నారు.తాళ్లరేవు మండలం పి.మల్లవరం గ్రామంలోని దూళిపూడి గొల్లబాబు కళ్యాణ మండపంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. మెగా రక్తదాన శిబిరాన్ని ముమ్మిడివరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్ పర్సన్ ఓగూరి భాగ్యశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గంటి హరీష్ మాధుర్ శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను అభినందించారు. మెగా బ్రదర్స్ పుట్టినరోజులను పురస్కరించుకుని ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సేవా దృక్పథంతో రక్తదాన శిబిరం నిర్వహిస్తూ, తలసేమియా బాధిత చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించేందుకు కృషి చేస్తున్న సీనియర్ ఆర్ఎంపీ వైద్యులు,సీనియర్ నాయకులు డాక్టర్ వీఆర్ఎన్ బి ప్రసాద్ సేవలను ఆయన ప్రశంసించారు.ఈ సందర్భంగా గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు తరచూ రక్తం అవసరమవుతుందని, అలాంటి వారికి రక్తదాతలు అందించే రక్తం ఎంతో విలువైనదని అన్నారు. పుట్టినరోజు వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, రక్తదానం వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఇతరులకు ఉపయోగపడేలా నిర్వహించడం,ప్రాణ దాతలుగా నిలవడం ఆదర్శనీయమన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 200 యూనిట్ల వరకు రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి అందించడం గొప్ప సేవా కార్యక్రమమని కొనియాడారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ కమిటీ చైర్మన్ వై డి రామారావు,జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను అభినందించారు. డాక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను వారు ప్రశంసించారు. యువతతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రక్తదానానికి ముందుకు రావడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు శిబిరంలో రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తాళ్ళరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, సీనియర్ నాయకులు గుద్దటి రమా కేశవ బాలకృష్ణ ( జమ్మి ), విల్లా విరా, సలాది రాజా, వెంటపల్లి సత్యవతి, లంకలపల్లి రాణి, బద్రి రామ, ధూళిపూడి గోపి, టీంకు,
అబ్బిరెడ్డి భార్గవ్ సందీప్, దూడల స్వామి నాయుడు, పురుషోత్తం, అధిక సంఖ్యలో మెడికల్ రెప్రజెంటేటివ్ లు, మెగా అభిమానులు,జనసైనికులు,వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.