ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కార్యాలయాలు, నేషనల్ కెరీర్ సర్వీస్ సంయుక్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ, డిప్లొమా, ఐటీఐ విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాలను వినియోగించుకోవచ్చు. ఉద్యోగాల సమాచారం పొందేందుకు జిల్లా ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్హతల సర్టిఫికెట్లతో నేరుగా నమోదు చేసుకోవడంతో పాటు, ఆన్‌లైన్‌లో ncs.gov.in, nypunyam.ap.gov.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న అభ్యర్థుల మొబైల్ నంబర్లు, ఈ-మెయిల్‌కు జాబ్ మేళాల సమాచారం పంపిస్తారు. అలాగే employment.ap.gov.inలోనూ వివరాలు అందుబాటులో ఉంటాయి. ప్రతి నెలా నిర్వహించే జాబ్ మేళాల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు తమ వివరాలు, అదనపు అర్హతలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు.

ఏపీలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.. వెంటనే పేర్లు నమోదు చేసుకోండి