విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన భారీ పేలుడులో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ద్రవీభవించిన ఉక్కును తరలిస్తున్న లాడిల్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనంతరం భారీ అగ్నిప్రమాదం సంభవించి వందల టన్నుల కరిగిన ఉక్కు బయటకు చెల్లాచెదురైంది. గాయపడిన వారిని విశాఖలోని కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఘటనపై సమీక్ష నిర్వహించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి