ఇండియా కూటమి నేతలు సోమవారం న్యూఢిల్లీలో సమావేశమై ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి తమ అభ్యంతరాలను తెలియజేయాలని నిర్ణయించారు. ఓట్ల దోపిడీ జరిగిందనే ఆరోపణలను కూడా సమావేశంలో ప్రస్తావించారు. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్, సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. సమావేశంలో మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే తదితర నేతలు పాల్గొన్నారు. కూటమి మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించగా, తదుపరి సమావేశం హైదరాబాద్లో ఆగస్టులో జరగనుంది.

సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి ఫిర్యాదు.. ఎస్ఐఆర్పై ఆందోళన