అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ పరిణామాలు పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇరాన్ సైన్యం తమ దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, ఇజ్రాయెల్ నుంచి మరిన్ని దాడులు జరిగితే తీవ్ర ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ కూడా హెజ్బొల్లాపై చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఇరాన్‌లో కనీసం 15 మంది గాయపడినట్లు సమాచారం. పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనవసర ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించింది. తాజా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కూడా పెరిగాయి.

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. పరస్పర దాడులు