Thursday, 10 September 2026
  • Home  
  • ప్రకృతి వ్యవసాయమే భూమికి.. రైతుకు భరోసా
- తిరుపతి

ప్రకృతి వ్యవసాయమే భూమికి.. రైతుకు భరోసా

శ్రీ కాళహస్తి, జులై 25, (పున్నమి న్యూస్): కే.వీ.బీ.పురం మండలం ఆదవరం గ్రామంలో శనివారం ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సమష్టి డైరెక్టర్ వి. రమణ మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా రసాయనిక వ్యవసాయం విస్తరించడంతో భూసారం క్షీణించడమే కాకుండా ప్రజల ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. పూర్వీకులు అనుసరించిన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని, రైతులు క్రమంగా రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు. ద్రవ జీవామృతం భూమిలోని సూక్ష్మజీవుల అభివృద్ధికి దోహదపడుతూ పంటలకు ఉత్తమ సేంద్రీయ పోషకంగా పనిచేస్తుందని, ప్రతి రైతు దీనిని వినియోగించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. కే.వీ.బీ.పురం మండల టెక్నీషియన్ గాయత్రి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పొలాల్లో రాళ్లు ఏరి గట్లు నిర్మించుకునే అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్‌కు అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సంస్థ పి.సి.ఓ. వెంకటేష్ నాయక్, ఫీల్డ్ కోఆర్డినేటర్ ప్రభాకర్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు శేఖర్, కుమార్ రత్నం, ఏపీసీఎన్‌ఎఫ్ ప్రతినిధులు సిద్ధమ్మ, రేణుక, సరిత, ఫీల్డ్ అసిస్టెంట్ జనార్ధన్‌తో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.