Thursday, 3 September 2026
  • Home  
  • కాకినాడ AE కుటుంబం ఆత్మహత్య ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి
- అనకాపల్లి

కాకినాడ AE కుటుంబం ఆత్మహత్య ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి

యలమంచిలి, ఆగస్టు 26:(పున్నమి న్యూస్ – రిపోర్టర్ ఆనంద్) కాకినాడలో ఇటీవల జరిగిన AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ యలమంచిలి పట్టణ, గ్రామీణ విభాగాల ఆధ్వర్యంలో పోలీసులకు వినతిపత్రం అందజేశారు. సుమారు 50 మంది పార్టీ కార్యకర్తలతో యలమంచిలి సర్కిల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న నాయకులు, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం బీజేపీ యలమంచిలి మండల అధ్యక్షులు అగ్రహారపు కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం యలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్రకు మెమొరాండం అందజేశారు. ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ ఖాన్‌పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో కొల్లి సత్యనారాయణ, రాజన్న కాశీ, నగిరెడ్డి శ్రీనుబాబు, శివకోటి సతీష్, పి. రాజేష్, జక్క వరబాబు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

యలమంచిలి, ఆగస్టు 26:(పున్నమి న్యూస్ – రిపోర్టర్ ఆనంద్)

కాకినాడలో ఇటీవల జరిగిన AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ యలమంచిలి పట్టణ, గ్రామీణ విభాగాల ఆధ్వర్యంలో పోలీసులకు వినతిపత్రం అందజేశారు. సుమారు 50 మంది పార్టీ కార్యకర్తలతో యలమంచిలి సర్కిల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న నాయకులు, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమం బీజేపీ యలమంచిలి మండల అధ్యక్షులు అగ్రహారపు కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం యలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్రకు మెమొరాండం అందజేశారు. ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ ఖాన్‌పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు పోలీసులను కోరారు.
ఈ కార్యక్రమంలో కొల్లి సత్యనారాయణ, రాజన్న కాశీ, నగిరెడ్డి శ్రీనుబాబు, శివకోటి సతీష్, పి. రాజేష్, జక్క వరబాబు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.