వింజమూరు పట్టణంలోని జాగిరివనం సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఉదయగిరి నుంచి వింజమూరు వైపు వస్తున్న ఆటో జాగిరివనం వద్దకు చేరుకోగానే అదుపుతప్పింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక పీహెచ్సీకి తరలించగా, వైద్యుడు డాక్టర్ మధుసూదన్రెడ్డి చికిత్స అందించారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా సమాచారం.

జాగిరివనం వద్ద ఆటో బోల్తా.. ప్రమాదంలో 10 మంది