Thursday, 1 October 2026

Tag: జగ్గంపేట

తూర్పు గోదావరి

చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహిణ – ఇరిపాక శివకేశవుల క్షేత్రంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు

కాకినాడ జిల్లాజగ్గంపేట, సెప్టెంబర్ 4 త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని జగ్గంపేట మండలం ఇర్రిపాక శివ కేశవుల క్షేత్రంలో శ్రీరామ హృదయం కార్యక్రమం ఘనంగా జరిగింది. వికాస తరంగిణి సెంట్రల్ కమిటీ సభ్యులు మానేపల్లి బంగార్రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టిటిడి బోర్డు సభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ చిన్న జీయర్ స్వామి చేస్తున్న ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం.ధర్మాన్ని, భక్తిని, మానవత్వాన్ని చాటుతూ స్వామివారు చేస్తున్న కృషి అభినందనీయం. 70వ తిరునక్షత్రం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం సంతోషంగా ఉంది.ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు యువతలో భక్తి భావాన్ని, సేవా దృక్పథాన్ని పెంపొందిస్తాయి.మానేపల్లి బంగార్రాజు మాట్లాడుతూచిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉంది.స్వామివారి ఆశీస్సులతో ఇర్రిపాక శివ కేశవుల క్షేత్రంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు, భక్తులకు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసిన మానేపల్లి బంగార్రాజు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు తదితరులు పాల్గొన్నారు

తూర్పు గోదావరి

ఇరుపాక శివకేశవుల క్షేత్రంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతుల ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముడు ఆలయానికి కంబాల శ్రీనివాసరావు దంపతులచే ఘనంగా శంకుస్థాపన

రామ మందిర నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం అందజేసిన కంబాల శ్రీనివాసరావు* కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 5 :* జగ్గంపేట మండలం ఇర్రిపాక ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శివ కేశవుల క్షేత్రంలో అయోధ్య బాలరాముడి రామ మందిర నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల మణి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశ్వహిందూ రామసేన అధ్యక్షులు, బిజెపి నాయకులు కంబాల శ్రీనివాసరావు దంపతులు హాజరై పీటలపై కూర్చుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కంబాల శ్రీనివాసరావు దంపతుల చేతుల మీదుగా శంకుస్థాపన ఘనంగా జరిగింది. అనంతరం కంబాల దంపతులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలు అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు, రామ మందిర నిర్మాణానికి తన వంతు సహాయంగా రూ.5 లక్షల చెక్కును కంబాల శ్రీనివాసరావు జ్యోతుల నెహ్రూ దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మ ప్రచారం కోసం నిరంతరం కష్టపడుతున్న వ్యక్తి కంబాల శ్రీనివాసరావు. శివ కేశవుల క్షేత్రానికి ఇప్పటివరకు ఎప్పుడూ విరాళాలు వసూలు చేయలేదు. మొట్టమొదటిసారి రామ మందిర నిర్మాణం కోసం కంబాల శ్రీనివాసరావు రూ.5 లక్షలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది.ఇలాంటి దాతల సహకారంతో ఈ క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుంది అని అన్నారు .కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూప్రతి ఒక్కరిలో దేశభక్తి, దైవభక్తి ఉండాలి. హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ ప్రచారం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.మహిళలకు పట్టుచీరలు, బంగారు రూపులను అందిస్తున్నాము. అందులో భాగంగా ఇర్రిపాక శివ కేశవుల క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నాము. – జ్యోతుల నెహ్రూ తెలియజేయడంతో 200 మందికి పట్టుచీరలు పంపిణీ చేయాలని వచ్చాము. పట్టుచీరలతో పాటు బంగారు రూపులు కూడా ఇవ్వడం జరిగింది. – జ్యోతుల నెహ్రూ దంపతుల ఆధ్వర్యంలో ఈ శివ కేశవుల క్షేత్రం ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందుతుంది. ఈ రామ మందిర నిర్మాణానికి తన వంతు సహాయం ఇంకా అందిస్తూనే ఉంటాను అని కంబాల అన్నారు .ఈ కార్యక్రమంలో జ్యోతుల లక్ష్మీదేవి, ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, కుంచే రాజా, పాలచర్ల నాగేంద్ర చౌదరి, జంపన రవి వర్మ,తులా రాము, మానేపల్లి బంగార్రాజు, పెద్దాడ వెంకన్న దొర,గ్రామ పెద్దలు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

పేద రైతుల భూముల్లో చేస్తున్న వర్కును వెంటనే ఆపాలి పాటoశెట్టి సూర్యచంద్ర

జగ్గంపేట, జై కొత్తూరు, పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4, పేద రైతుల 40 ఏళ్ల కష్టాన్ని ప్రోక్లైనర్లతో నాశనం చేస్తారా?జటాద్రికొండ రైతుల జీడిమామిడి చెట్లను తొలగించడం వెంటనే ఆపాలి 40 సంవత్సరాలుగా నిరుపేద రైతులు పెంచుకున్న ఆశలను,ఆ కుటుంబాల జీవనాధారాన్ని ప్రోక్లైన్‌తో తొక్కేస్తున్న బాధాకరమైన దుస్థితి. జగ్గంపేట మండలం జే.కొత్తూరు సమీపంలోని జటాద్రికొండపై భూమిలేని నిరుపేద కుటుంబాలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను పారిశ్రామికవేత్తకు ఇవ్వడానికి నిరుపేద రైతుల పొట్ట కొట్టడం దుర్మార్గమని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు ఒకప్పుడు రాళ్లు,తుప్పలు,డొంకలతో ఉన్న ఈ ప్రాంతాన్ని తమ రక్తం,చెమటతో సాగుకు అనుకూలంగా మార్చుకున్నారని కావిడలతో నీళ్లు మోసి మొక్కలకు నీళ్లు పోశారని.ఎండకు ఎండి వానకు తడిసి40 సంవత్సరాలు కష్టపడి జీడిమామిడి చెట్లను పిల్లలలా పెంచుకున్నారన్నారు.ఇప్పుడు ఆ చెట్లు ఫలసాయాన్నిస్తున్న సమయంలో “ఈ భూమి మీది కాదు, ప్రభుత్వం భూమి” అని చెప్పి పేద రైతులను బయటకు పంపించి, చెట్లను ప్రోక్లైన్లతో తొలగించడం ఎంతవరకు న్యాయమని ప్రభుత్వాన్ని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రశ్నించారు?* ప్రభుత్వ భూమి అయితే పేద రైతు 40 ఏళ్ల కష్టం కూడా ప్రభుత్వానిదేనా?*ఆ చెట్లను పెంచింది ప్రభుత్వం కాదు.* *ఆ చెట్లకు నీళ్లు పోసింది ప్రభుత్వం కాదు* *ఎరువులు వేసింది ప్రభుత్వం కాదు40 సంవత్సరాలు వాటిని కాపాడింది ప్రభుత్వం కాదు* *తమ కుటుంబాలను పస్తులతో పెట్టుకుని ఆ తోటలను పెంచింది నిరుపేద రైతులుఈరోజు రైతన్నల కష్టాన్ని ప్రోక్లైన్లతో నేలమట్టం చేసే అధికారం ఎవరికుంది?అభివృద్ధి అంటే పేదవాడి పొట్ట కొట్టి పారిశ్రామికవేత్తకు లాభం చేకూర్చడమా?*వన సంరక్షణ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం చెట్లు పెంచుతోంది.మరి ఇక్కడ 40 సంవత్సరాలుగా పేద రైతులు పెంచుకున్న ఫలసాయాన్నిచ్చే చెట్లను ఎందుకు తొలగిస్తున్నారు అధికారులు, ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి?ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారికి విజ్ఞప్తి*ఇది రాజకీయ సమస్యగా చూడవద్దు మన రైతుల కన్నీటి ఆవేదనను వారి రక్తాన్ని చెమట రూపంగా మార్చి 40 సంవత్సరాలు పెంచిన చెట్లను మీ కళ్ళతో చూడాలని అధికారులతో మాట్లాడి వెంటనే చెట్ల తొలగింపును ఆపించి బాధిత నిరుపేద రైతులకు శాశ్వత భూమి హక్కు పత్రాలను ఇప్పించి ఆదుకోవాలని బాధిత రైతుల పక్షాన కోరుచున్నాము*

తూర్పు గోదావరి

మామిడాడ సత్తమ్మ తల్లికి శాఖంబరిగా అలంకరణ

జగ్గంపేట, మామిడాడ, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 4 జగ్గంపేట మండలం మామిడాడ విలేజ్ లో కొత్తగా రూపుదిద్దు కొన్న సత్తెమ్మ తల్లి ఆలయంలో శ్రావణమాసం లాస్ట్ శుక్రవారం కావడంతో అమ్మవారికి అనేక రకాల కూరగాయలు ఆకుకూరలతో శాకంబరీ అమ్మవారి అలంకరణ చాలా కనులు పండుగ చేయడం జరిగింది అలాగే ఆలయ కమిటీ వారు యూత్ కుర్రాళ్ళు మహిళలు అందరూ తెల్లవారులు అమ్మవారిని అలంకరించడంలో చాలా ఆనందం వ్యక్తం చేశారు అలాగే భక్తులు కూడా భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు

తూర్పు గోదావరి

ఇరుపాకలో అష్టలక్ష్మి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు

*హాజరైన కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు* కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 4: జగ్గంపేట మండలం ఇర్రిపాక శివకేశవుల క్షేత్రంలో అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణుడు ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు, టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల మణెమ్మ దంపతులు పీటలపై కూర్చుని ఈ శంకుస్థాపన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 40 లక్షల రూపాయలు అష్టలక్ష్మి గుడికి, అదేవిధంగా రేపు అయోధ్య రామ మందిరం పోలిన రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహిస్తున్నామని ఆ రామాలయానికి 40 లక్షలు అందించడం జరిగిందని ఈ రెండు దేవాలయాలను భక్తుల సహకారంతో అత్యంత సుందరంగా నిర్మిస్తామని అన్నారు.ఇర్రిపాక క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, అష్టలక్ష్మి ఆలయంతో క్షేత్రానికి మరింత విశిష్టత వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, టిడిపి, జనసేన, బిజెపి కూటమి నాయకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

పేదల పొట్ట కొట్టొద్దు

జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 3, జగ్గంపేట, మండలం జటాద్రి కొండ సర్వేనెంబర్ 24 లో గత నలభై సంవత్సరాల నుంచి భూమిలేని నిరుపేద రైతులు మామిడి,జీడి మామిడి వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ చెట్లను రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా టిడ్కో కంపెనీ వారికి సోలార్ సిస్టం పెట్టుకోవడానికి పేద రైతులు పండించిన పంటను జెసిబి లతో నరికి వేయడం సరైన పద్ధతి కాదని గురువారం నాడు పేద రైతులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు జగ్గంపేట ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేయడం జరిగింది . ఈ సందర్భంగా కర్ణాకుల మాట్లాడుతూ బడా కంపెనీలకు కూటమి ప్రభుత్వ నాయకులు, రెవెన్యూ అధికారులు తొత్తులుగా మారి పేదల పొట్ట కొడుతూన్నారని,వారి బ్రతుకులను రోడ్డున పడేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి విషయాల్లో రెవిన్యూ అధికారులు కాకుండా పోలీస్ అధికారులు రావడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రైతులపై పోలీసు వారు చేసిన పనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.తక్షణమే పేదల భూముల్లో పనులను ఆపాలని, ప్రోక్లైన్లను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు పట్ల, కూలీల పట్ల, పేద ప్రజల పట్ల మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం అన్నివేళలా వారికి అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర, కొత్తూరు గ్రామ నాయకులు నకిరెడ్డి నాగేశ్వరరావు, పెద్దకాపు, రైతులు నూకరాజు, శ్రీనివాసరావు, నాని బాబు, నాగేంద్ర, గంగరాజు,ధర్మరాజు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ ఇంటింటికి వెళ్లి పరామర్శించి చెక్కులు అందజేసిన జ్యోతుల నవీన్

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 3:* జగ్గంపేట టౌన్ లో ముఖ్యమంత్రి సహాయనిధి కింద 10 మందికి 7 లక్షల 84 వేల 639 రూపాయల విలువైన చెక్కులను గురువారం మోటారు బైక్ పై ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ హాజరై 10 మంది ఇళ్లకు స్వయంగా వెళ్లి ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు.అలాగే సింహాద్రిపురం గ్రామానికి చెందిన సోడిశెట్టి సత్యనారాయణకి బ్రెయిన్ ఆపరేషన్ నిమిత్తం 2 లక్షల 74వేల రూపాయల ఎల్ఓసి ముందస్తు లెటర్ ను రావులమ్మ నగర్ లోని పార్టీ కార్యాలయంలో వారికి అందజేశారు.ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ… అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు వరంగా మారాయని అన్నారు.జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ కులం, మతం, పార్టీల భేదాలు లేకుండా అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందిస్తున్నామని తెలిపారు.గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుకే పరిమితమైందని, పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చొరవతో సీఎం సహాయనిధి ద్వారా నేరుగా లబ్ధి చేకూరుస్తున్నామని అన్నారు.ప్రజలకు అండగా ఉండటమే జ్యోతుల నెహ్రూ లక్ష్యమని, ఎవరూ అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్లి మరీ చెక్కులు అందిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, వేములకొండ జోగారావు, ఎస్ ఏ గఫూర్, రాయి సాయి, పీలా మహేష్, వైబోగుల కొండబాబు యాదవ్, నేదూరి గణేష్, దుర్గపు ప్రకాష్, సాంబతుల చంద్రశేఖర్, నలమాటి ఆనంద్, చెలికాని హరి గోపాల్, ఎండి కాజా, డేగల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం

జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 2 : . *దివంగత నేత మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, కాకినాడ జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం జగ్గంపేట మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి వైయస్సార్ నిలువెత్తు విగ్రహానికి రాష్ట్ర విద్యార్థి విభాగం జోన్ 2 వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీ రాంజీ చేతుల మీదుగా జలాభి షేకం చేయడం, మరణం లేని మహానేత, స్వర్గీయ డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు*. శ్రీ తోట నరసింహం ప్రసంగం ప్రజా సంక్షేమ పథకాలు: వైఎస్సార్ పాదయాత్ర చేసి పేద, మధ్యతరగతి ప్రజల కష్టాలు తెలుసుకొని వారి కోసం పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ₹2 లకే కిలో బియ్యం ప్రజలకు అందించారని కొనియాడారు.ఆరోగ్యం & వ్యవసాయం: ఎవరూ కూడా అనారోగ్యంతో బాధపడకూడదని ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలని తెచ్చారని; రైతుల సంక్షేమం కోసం జలయజ్ఞం కార్యక్రమం ప్రారంభించి అనేక ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు, త్రాగునీరు అందించిన ఘనత ఆయనదేనన్నారు.విద్యా రంగం: ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టి కొన్ని లక్షల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేసారన్నారు.చెరగని ముద్ర: అలాంటి మహనీయుడు మన మధ్య నుంచి భౌతికంగా దూరమై 17 సంవత్సరాలు అయినప్పటికీ మన అందరి మనసులలో ఎప్పటికి మరపురాని మహానేతగా, చెరగని ముద్రగా మిగిలిపోయారని తెలిపారు. దివంగత రాజశేఖర్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 84 సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడిగా పేరు తెచ్చుకోవడం రైతుల పాలిట భగీరథుడుగా, ఆపద్బాంధవుడిగా అనేక సంస్కరణలు చేసినటువంటి వ్యక్తిగ ఎప్పటికీ ప్రజల మనసులలో స్థిరస్థాయిగా ఉండే ఏకైక నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి దివంగత రాజశేఖర్ రెడ్డి ఈ రోజున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, వివిధ అనుబంధ కమిటీల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

భూపతిపాలెంలో విద్యా విప్లవానికి శ్రీకారం, ఎడ్యుకేషనల్ హబ్ కు అత్యంత అనుకూలమే ప్రశంస

– భూపతిపాలెంలో ఐదు వందల ఎకరాల్లో జాతీయస్థాయి విద్యా కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు* కంచి పీఠం ప్రతినిధుల స్థల పరిశీలన *కాకినాడ , జగ్గంపేట, గోకవరం, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 2:* జగ్గంపేట నియోజకవర్గ చరిత్రలో సువర్ణ అధ్యాయానికి నాంది పలికేలా గోకవరం మండలం భూపతిపాలెం రెసిడెన్షియల్ పాఠశాల పరిసరాల్లో ఐదు వందల ఎకరాల విశాల స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత విద్యా కేంద్రం ఏర్పాటు కానుంది.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం కంచి కామకోటి పీఠం నుండి పరిశీలకులుగా విచ్చేసిన విశ్రాంత ఇస్రో శాస్త్రవేత్త ప్రొఫెసర్ మూర్తి, శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి విశ్వ మహా విద్యాలయం సీఈఓ అరుణ్ సుబ్రహ్మణ్యం ఈరోజు జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూతో కలిసి భూపతిపాలెం ప్రాంతంలో పర్యటించి స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ప్రతినిధి బృందం మాట్లాడుతూ ఈ ప్రాంతం చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంతో, పుష్కలంగా నీటి వసతితో, పక్కనే ఏలేరు నది ఉండడంతో విద్యా కేంద్రం ఏర్పాటుకు అత్యంత అనుకూలంగా ఉందని, ఇక్కడ విద్యా కేంద్రం ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మొదట ఈ విద్యా కేంద్రం ఆలోచనను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లానని, ఇది చాలా బాగుందని ఆయన ప్రశంసించినప్పటికీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వెంటనే కార్యరూపం దాల్చడం కష్టమని తెలియజేశారని అన్నారు.ఆ తర్వాత తిరుపతిలో కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీని దర్శించుకున్న సందర్భంలో ఈ విషయాన్ని వారికి తెలియజేయగా, వారు కంచి వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమని తెలియజేయగా మేము వెళ్లి వారికి విషయాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేయడం వారికి ఎంతో నచ్చి వారి ఆలోచన కూడా ఆంధ్రాలో ట్రస్టు ద్వారా విశ్వవిద్యాలయం ఏర్పాటు చెయ్యాలని ఒక కమిటీని వేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ప్రతినిధులను వచ్చి స్థల పరిశీలన చేయడం జరిగిందని అన్నారు.ఈ విద్యా కేంద్రం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు కేజీ నుండి పీజీ వరకు ఒకే చోట విద్యతో పాటు వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలల ద్వారా వైద్య సేవలు అందుతాయని, ఇది కేవలం కళాశాలల నిర్మాణం మాత్రమే కాదు, తరతరాల భవిష్యత్తుకు వేసే పునాది అని, వేలాదిమంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనోపాధి పొందుతారని ఈ ప్రాంతం రాష్ట్రంలోనే ఆదర్శ విద్యా కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. ఈ పర్యటనలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, పిల్ల చంటిబాబు, మారిశెట్టి భద్రం, పాలచర్ల నాగేంద్ర చౌదరి, తోట రామారావు, దాసరి సీతారామకృష్ణ, ఉంగరాల గణేష్, యిడుదల అర్జునరావు, స్కూల్ చైర్మన్, వైస్ చైర్మన్ గల్లా రాము, రాజీవ్, కమ్మిల వెంకటేశ్వరరావు, పాలాడి శ్రీను, చింత అరుణ్ కుమార్ శర్మ, భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ కంచి మఠం ప్రతినిధులు, విద్యావేత్తలు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

గీన్నీస్ వరల్డ్ రికార్డ్ పొందిన కరాటే మాస్టర్ కి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 2 : జగ్గంపేట,స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కరాటే లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన డాక్టర్ తాండ్రోతు వీర వెంకటరమణ ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ 2026 ఏప్రిల్ 26 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది అని ఖమ్మం కలెక్టర్ దివాకర్ చేతుల మీదుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తీసుకోవడం జరిగినది అదే కాకుండా గౌరవ డాక్టరేట్ 2025 నవంబర్ నెలలో రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆశీస్సులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. 1986 నుండి కరాటే మాస్టర్ గా సేవలు అందిస్తూ గవర్నమెంట్ హై స్కూల్ నుండి అన్ని స్కూల్లో నేర్పిస్తూ జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి జాతీయ స్తాయి కరాటే పోటీలలో కొన్ని వేల మెడల్స్ సాధించే విధంగా ట్రైనింగ్ ఇచ్చియున్నాము2017 నుండి ఇన్చార్జిగా కాకినాడ జిల్లా కోనసీమ ఈస్ట్ గోదావరి జిల్లాలలోగవర్నమెంట్ హైస్కూల్లో ఆడపిల్లలకుసెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ మాస్టర్ ద్వారా ఇప్పించడం జరుగుచున్నది 2001 నుండి జిమ్ కోచ్ గా పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ డీ ఫిట్నెస్ జిమ్ నుండి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి జాతీయస్థాయి పోటీలకు విద్యార్థులను పంపించుచున్నాము 2004 నుండి జూడో ఒలంపిక్ గేమ్ కోచింగ్ ఇస్తూ జిల్లాస్థాయి రాస్తాయి జాతీయస్థాయి పోటీలకు స్టూడెంట్స్ ని ప్రతి సంవత్సరం 100 పైగా జూడో పోటీలకు స్టూడెంట్స్ ని పంపిస్తున్నాం మరి ఎన్నో మెడల్స్ సాధించారు రాష్ట్రస్థాయి టీం ఛాంపియన్షిప్ ప్రతి సంవత్సరం జూనియర్ సీనియర్లు టీం ఛాంపియన్ మన జిల్లాకు రావడం గర్వకారణం ఆంధ్ర యూనివర్సిటీ జెఎన్టియు యూనివర్సిటీ నన్నయ యూనివర్సిటీ జూడో బోర్డు నెంబర్ గా సేవలు అందిస్తున్నాం స్పోర్ట్స్ అథారిటీ ద్వారా డి ఫిట్నెస్ జిమ్ము ద్వారా కరాటి కోచింగ్ ద్వారా ఫిట్నెస్ ద్వారా100 మంది పైగా గవర్నమెంట్ ఉద్యోగాలు మా స్టూడెంట్స్ సాధించారు అంతేకాకుండా నా స్టూడెంట్స్ 28 మంది బ్లాక్ బెల్ట్ నా ద్వారా తీసుకున్నారు 40 సంవత్సరాల నుండి ఉచిత కోచింగ్ గవర్నమెంట్ హై స్కూల్ జగ్గంపేట కరాటి జూడో కోచింగ్ డీ ఫిట్నెస్ జిమ్ నందు వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ కోచింగ్ ఇస్తూ ఉన్నాం అని వెంకటరమణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.