Thursday, 1 October 2026

Tag: జగ్గంపేట

తూర్పు గోదావరి

ప్రజా దర్బార్ తో ప్రజాసంస్థలు పరిష్కారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 26: ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని జగ్గంపేట ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు, టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ తెలిపారు.జగ్గంపేట రావులమ్మ నగర్ లోని క్యాంప్ ఆఫీసులో శుక్రవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు పెన్షన్లు, హౌసింగ్ లోన్లు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యలపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామానికి చెందిన ఆడారి ఆదిలక్ష్మి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు వైద్యం చేయించుకుని ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు. సంబంధించిన ఫైల్స్ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీసుకొని వెళ్లడం జరుగుతుంది అన్నారు.కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మిగిలిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, ఏపీ స్టేట్ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, బుర్రి సత్తిబాబు, నీలం శ్రీను, రేఖ బుల్లి రాజు, పాండ్రంగి రాంబాబు, రాయి సాయి, మారిశెట్టి రాధా, సాంబత్తుల చంద్రశేఖర్, జనసేన ఎంపీటీసీ దొడ్డ శ్రీను, వేగి సత్తిబాబు, పోట్రు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

జగ్గంపేటలో వైభవంగా విష్ణు సహస్రనామ నక్షత్రమాల 27 సార్లు పారాయణం

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 23 *300 మంది మహిళలతో మారుమోగిన ఆర్యవైశ్య కళ్యాణ మండపం – భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహణ.. హాజరైన ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, ఎమ్మార్వో జేవియర్ రమేష్, ఎలక్ట్రికల్ ఈఈ వీరభద్ర రావు స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బుధవారం ఉదయం 8 గంటల నుండి విష్ణు సహస్రనామ పారాయణం నక్షత్రమాల – 27 కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.భక్తిశ్రద్ధలతో, శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో 300 మంది మహిళలచే 27 సార్లు విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. మొదలుపెట్టిన 300 మంది మహిళలు భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చివరి వరకు 27 సార్లు పూర్తిగా పారాయణంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు ( కొండబాబు ) హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విశిష్ట అతిథులుగా జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, ఎమ్మార్వో జేవియర్ రమేష్, ఎలక్ట్రికల్ ఈఈ వీరభద్రరావు, ఎంపీడీవో చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. వేద పండితులు, బ్రాహ్మణుల వేద మంత్రోచ్ఛారణ మధ్య కార్యక్రమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో మానేపల్లి బంగార్రాజు, కంచర్ల బాబు, వి నాగసత్య, బొండా వీర సత్య, బోండా నూకబాబు, దారా శ్రీనివాస్, మానేపల్లి వీర్రాజు గుప్తా, మహిళా సంఘం సభ్యులు కొత్త మాధురి రత్న ఆండాళ్, బోండా విజయ, మతంశెట్టి లావణ్య,మానేపల్లి రజిని,స్వాతి, ఇందిరా, రమాదేవి తదితరులు హాజరై పారాయణం నిర్వహించి ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోవాలని ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తూర్పు గోదావరి

తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి నెట్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

కాకినాడ, కిర్లంపూడి, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 16: జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో యువసేన యూత్ నైట్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. తుమ్మలపల్లి రమేష్ స్వయంగా టోర్నమెంట్‌ను ప్రారంభించి క్రీడాకారులను ప్రోత్సహించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.టోర్నమెంట్‌లో ప్రథమ బహుమతిగా రూ.15,000, ద్వితీయ బహుమతిగా రూ.10,000 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను తుమ్మలపల్లి రమేష్ అందించనున్నారు. ఈ సందర్భంగా రమేష్ క్రీడాకారులను అభినందించి, క్రీడా పోటీలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు యువసేన యూత్ సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు

తూర్పు గోదావరి

పలు కుటుంబాలను పరామర్శించిన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 16: జగ్గంపేట టౌన్ లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ పలు పరామర్శలు చేపట్టారు. జగ్గంపేట గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆయిల్ స్వామి అనారోగ్యంతో చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుసుకుని, బుధవారం నవీన్ నేరుగా వారి స్వగృహానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని, యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ప్రముఖ దైవజనులు పాస్టర్ సుదర్శన్ తల్లి రత్నం అనారోగ్యానికి గురై విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిసి, వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ప్రముఖ అడ్వకేట్ దారా శ్రీను తండ్రి ధారా రాజా ఇటీవల అనారోగ్యానికి గురి అయిన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని పరామర్శిసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.జగ్గంపేట గ్రామపంచాయతీ మాజీ వార్డు సభ్యులు కేసు బోయిన చిన్ని భార్య విజయ్ కుమారి అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని పలకరించి ఆరోగ్య విషయాలు యోగక్షమారి అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా టిడిపి ఎస్సీ సెల్ కార్యదర్శి తుమ్మల కిషోర్ సోదరులు తుమ్మల శ్యాంప్రసాద్ ఇటీవల మరణించడంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలియజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తల కష్టసుఖాల్లో, ప్రజల ఆపద సమయంలో అండగా నిలవడమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని, ఆ దిశగానే తాము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా నవీన్ పేర్కొన్నారు. ఆయన వెంట జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, బుర్రి సత్తిబాబు, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, రేఖ బుల్లిరాజు, పాండ్రంగి రాంబాబు, దాట్ల గోపిరాజు, నండ్ల చిరంజీవి, రాయి సాయి, వెలిశెట్టి బుజ్జి, వెలిశెట్టి రాంబాబు, కోడూరి రమేష్, బండారు నాని, హరి గోపాల్, సాంబత్తుల చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే విజయభేరి

గండేపల్లి మండల టిడిపి విస్తృత సమావేశంలో… గండేపల్లిమండల టిడిపి అధ్యక్షులు పో తుల మోహనరావు కాకినాడ , గండేపల్లి, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 16: గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహనరావు అధ్యక్షతన మండల స్థాయి విస్తృత సమావేశం గండేపల్లి మండల టిడిపి కార్యాలయంలో జరిగింది.సమావేశంలో మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చర్చించి పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. ఆమోదించిన తీర్మానాలు:రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి పార్టీలు విజయభేరి మోగించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తీర్మానించారు. ముఖ్యంగా పింఛన్లు ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తున్నారని అర్హులైన ప్రతి ఒక్కరు సచివాలయంలో నమోదు చేయించుకోవాలని అన్నారు. హౌసింగ్ లోన్లు, ఇళ్ల స్థలాల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు తక్షణమే అందించాలి., ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గ్రామంలో ప్రజలకు వివరించాలి అని తీర్మానించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం అటు రాష్ట్రంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ జోడెడ్ల బండిలా సాగుతున్నాయి. అమరావతి, పోలవరం, రోడ్లు, మౌలిక వసతులు, ఆర్థిక పెట్టుబడులు ఎలా అన్ని రకాలుగా రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని అని అన్నారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ జాస్తి వసంత్, యూనిట్ ఇంచార్జ్ ఇప్పర్ల సురేష్,గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొల్లంరెడ్డి రామకృష్ణ, గండేపల్లి మండల తెలుగుదేశంపార్టీ యువత అధ్యక్షులు సుంకవిల్లీ రమేష్, రామయ్యపాలెం గ్రామ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు మైలవరపు శ్రీనివాస్, కంటిపూడి రామయ్య, వెంపాటి రాజు, ఆళ్ల సత్తిబాబు, పైల వెంకన్న చిటికెల కన్నబాబు ముంగర విష్ణుమూర్తి ఉండవిల్లి రాధాకృష్ణ, వెంపాటి రాంబాబు, మాచిన బాబురావు, నాలం వీరబాబు, దార కాటయ్య, గరిగిపాటి రమణ, గుర్రం శేఖర్, పైల రమణ, గునిపెల్లి వీరబాబు, పెనుగాడి నాగరాజు, యాక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

పేదవాడి ఇంటికే సీఎం సాయం 1,28000 వేల చెక్కులు అందజేసిన జ్యోతుల నవీన్

కాకినాడ – గండేపల్లి – పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 16 : గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన సత్తి దుర్గా శ్రీనివాస్, పిల్లి గోవిందు, రామకుర్తి రాజమ్మల కు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 1,28,000 రూపాయల చెక్కుల ను కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ శనివారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు.ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ పేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో పేదవాడికి వైద్యం భారం కాకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన సీఎం సహాయనిధికి కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రాణం పోసిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి తక్షణ సాయం అందేలా చేస్తున్నామని తెలిపారు. ఉప్పలపాడు గ్రామంలో ముగ్గురు అనారోగ్యంతో దరఖాస్తు చేయగానే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చొరవతో వెంటనే చెక్కు మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. అనంతరం గ్రామంలో వినాయక మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన నవీన్.ఇంటి వద్దకే వచ్చి సహాయం అందించడం పట్ల లబ్ధిదారుల కుటుంబాలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే నెహ్రూ, జ్యోతుల నవీన్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడబాల భాస్కరరావు, అడబాల రామాంజనేయులు,జీను మణి బాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, జాస్తి వసంత్, బుర్రి సత్తిబాబు, రేఖ బుల్లి రాజు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, చెవా నరసింహమూర్తి, అడబాల సత్తిబాబు, మండల బిజెపి అధ్యక్షులు తోలాటి వెంకన్న, ఉప్పలపాడు జనసేన అధ్యక్షుడు తవటం నాగేంద్ర, తిరణాల శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

జగ్గంపేట మండలంలో ఇంటింటికి సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ – జ్యోతుల నవీన్

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 16: జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజలకు సీఎంఆర్ఎఫ్ పై అవగాహన కల్పించేందుకే మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నామని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తెలిపారు. జగ్గంపేట మండలంలో మన్యం వారి పాలెం ఇద్దరికీ, గోవిందపురం ఒక్కరికి, సీతానగరం ఒక్కరికి మొత్తం నలుగురికి జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ కృషితో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 1.80 లక్షల చెక్కులను నవీన్ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు.అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు రాజకీయాలకు అతీతంగా చేయూతనివ్వడమే లక్ష్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో ముందుకు సాగుతున్నామని, అందుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేస్తున్న కృషి ఎంతో ఉందని జ్యోతుల నవీన్ అన్నారు.జగంపేట మండలం మన్యం వారి పాలెం గ్రామంలో కరెంటు సమస్యపై మహిళలు జ్యోతుల నవీన్ కు వివరించగా ఆయన అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, బుర్రిసత్తిబాబు, దేవరపల్లి మూర్తి, పైడిపాల సూరిబాబు, రేఖ బుల్లి రాజు, పాండ్రంగి రాంబాబు, దాట్ల గోపిరాజు, రాయి సాయి, వె లిశెట్టి బుజ్జి,పోట్రూ రాముడు, పోట్రూ కృష్ణ, మీసాల సత్తిబాబు, బొడ్డు బుజ్జి, దేవర లోవప్రసాద్, కమ్మిల వెంకటేశ్వరరావు, నాని రాజు, కొల్లు రామకృష్ణ,పద్మనాభం, ముత్యాల సత్యనారాయణ, కోడూరి సత్యనారాయణ, గూడపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ఇంజనీర్స్ డే వేడుక ప్రముఖ ఇంజనీర్ ని సత్కరించిన కొత్తకొండ బాబు

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 15: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జగ్గంపేటలో ప్రముఖ ఇంజనీర్ సత్తి సదాశివరెడ్డిని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు ఘనంగా సత్కరించి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్తకొండ బాబు మాట్లాడుతూఇంజనీర్లే దేశానికి వెన్నెముక* అని అన్నారు. ఒక కలను కాగితంపై డిజైన్ గా మార్చి, దానిని క్షేత్రంలో అద్భుతమైన కట్టడంగా నిలబెట్టే నైపుణ్యం ఇంజనీర్ల సొంతమని కొనియాడారు.రోడ్లు, భవనాలు, డ్యాములు, బ్రిడ్జిలు, టెక్నాలజీ ఇలా దేశ అభివృద్ధిలో ప్రతి అడుగులో ఇంజనీర్ల పాత్ర మరువలేనిదని, వారి ఆలోచన, ఆవిష్కరణ, అంకితభావంతోనే సమాజం ముందుకు వెళుతోందని అన్నారు.సత్తి సదాశివరెడ్డి తన ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఎన్నో నిర్మాణాలకు తన ముద్ర వేశారని, అలాగే గణపతి నవరాత్రులు పురస్కరించుకుని వినాయక మండపాలకు విగ్రహాలు అందించడం, అన్నదానాలు నిర్వహించడం, పేదలకు దానాలు చేయటం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో యువ ఇంజనీర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

తూర్పు గోదావరి

జగ్గంపేట మండలంలో పలు వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్

జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 14 జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం లో జగ్గంపేట టౌన్ , కొత్తూరు తో తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, జగ్గంపేట నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు.వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న కార్యక్రమాలను రమేష్ అభినందించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలను ఆత్మీయంగా కలుసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రమేష్ పలు గ్రామాల్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో కురుమల్ల నాగేశ్వరావు, పాబోలు స్వామి, గవర సుధాకర్, శివారెడ్డి,జీను బాబ్జి,ఆంధ్రజ్యోతి నాయుడు, యర్రా సాయి,గుంటుక్కలా చిన్న, రేవూరి శ్రీను, కొలమూరు బుజ్జి,జనసేన,టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

తూర్పు గోదావరి

వినాయక మండపాల్లో భక్తులతో మమేకమైన జ్యోతుల నెహ్రూ

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 14: వినాయక చతుర్థి వేడుకల్లో భాగంగా జగ్గంపేటలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ దర్శించుకున్నారు.జేవియర్ అపార్ట్మెంట్, పద్మనాభ నగర్, సత్తి సదాశివరెడ్డి విగ్రహం, చెరువుగట్టు, శెట్టిబలిజిపేట, మర్రిమొక్క వీధి, రత్నాలపేట, గొల్లపేట, మార్కెట్ వీధి, మెయిన్ రోడ్డు, జయ హాస్పిటల్, అంబేద్కర్ కాలనీ, టాక్సీ స్టాండ్, మినీ గూడ్స్ వ్యాన్ స్టాండ్, జ్యోతుల కాలనీ, శ్రీరామ్ నగర్, నిలకుండీలపేట తదితర ప్రాంతాల్లోని అన్ని మండపాలను తిరిగి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడి ఆశీస్సులతో జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి విఘ్నాలు తొలగిపోవాలని ఆకాంక్షించారు. సూపర్ ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, వినాయకుడి కృపతో మంచి వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో, ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, సత్తి సదాశివరెడ్డి, ఎస్.ఏ.గఫూర్, పీలా మహేష్, నండ్ల చిరంజీవి, మారిశెట్టి గంగ, నేదురి గణేష్, సాంబత్తుల చంద్రశేఖర్, రిస్ రమణ, కూప్పా తాతారావు, ముక్కా పాలబాబు, పలివెల యేసురాజు, కోడూరి రమేష్, బండారు నాని, హరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.