Thursday, 1 October 2026

Tag: జగ్గంపేట

తూర్పు గోదావరి

మామిడాడ లో వినాయక చవితి సంబరాలు

జగ్గంపేట మండలం, మామిడాడ, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 14 జగ్గంపేట మండలం పరిసర ప్రాంతాల్లో ఈరోజు గణపతి నవరాత్రులు పురస్కరించుకొని పలుచోట్ల విగ్రహాలను ప్రతిష్టించడం జరిగింది మామిడాడ గ్రామంలో శ్రీ బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సంబరాలు ప్రారంభమయ్యాయి వినాయక విగ్రహాన్ని ch. శ్రీను ఫ్యామిలీ మెంబర్స్ 16 వేల రూపాయల తొమ్మిది అడుగుల విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది ఉదయం 10 గంటలకు వేదమంత్రాలతో వినాయకుని ప్రతిష్ట చేయడం జరిగింది భక్తులు వినాయకుని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకొని చాలా కోలాహారంగా ఈరోజు విగ్రహ ప్రతిష్ట జరిగింది ప్రతిరోజు భజన కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ అన్నారు

తూర్పు గోదావరి

జగ్గంపేటలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 14: జగ్గంపేట రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ ను జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ నిర్వహించారు. ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.పెన్షన్ల విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ ను మొదటి తేదీనే ఇంటి వద్దకే అందిస్తున్నామని, పెన్షన్ కోసం ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరు సచివాలయంలో నమోదు చేయించుకోవాలని అన్నారు. ఇళ్ల స్థలాలు, హౌసింగ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ప్రజా దర్బార్ లో వచ్చిన ప్రతి వినతిని పరిశీలించి వెంటనే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ధ్యేయమని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు జీనుమణి బాబు, మాజీ వైస్ ఎంపీపీ మారిశెట్టి భద్రం, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, జగ్గంపేట టౌన్ టిడిపి అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు, జిల్లావక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ ఎస్ ఏ గపూర్, గోకవరం టౌన్ టిడిపి అధ్యక్షులు పైలా శ్రీనివాస రావు, టౌన్ టిడిపి సెక్రెటరీ కోడూరి రమేష్ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భక్తులకు స్వయంగా అన్న ప్రసాదం వడ్డించిన జ్యోతుల నవీన్

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 10 : జగ్గంపేటలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలు వడ్డించి, శ్రీకృష్ణ భగవానుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులతో కలిసిపోయి ఆప్యాయంగా పలకరించడంతో కార్యక్రమం సందడిగా మారింది.ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు.యాదవ సంఘం ప్రతి ఏటా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం. జగ్గంపేట అభివృద్ధి కోసం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్తాం. ధర్మాన్ని, సేవా భావాన్ని చాటిన శ్రీకృష్ణుడి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, దేవరపల్లి మూర్తి, కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, వైభోగుల కొండబాబు యాదవ్, యాదవ సంఘం అధ్యక్షుడు ఎం రాజు, కొండ్రోతు శ్రీను, నేదురి గణేష్, రీస్ రమణ, దుర్గపు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

జనసేన సైనికుడికి అరుదైన గౌరవం

కాకినాడ , కిర్లంపూడి,జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 7: జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన ఉలిసి అయిరాజు కాకినాడ పార్లమెంట్ పరిధిలో స్థానిక ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ సభ్యుడిగా ఎన్నిక కావడం పట్ల జనసేన శ్రేణుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గోనెడ గ్రామంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అయిరాజుకు ఘనంగా సన్మానం చేశారు. గోనెడ గ్రామం మొత్తం జనసేన జెండాలు, నినాదాలతో కోలాహలంగా మారింది.పార్టీని నమ్ముకుని, జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి నిబద్ధతతో పనిచేసిన సామాన్య కార్యకర్తకు అరుదైన గౌరవం దక్కిందని పలువురు రాజకీయ నేతలు అభినందించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తికి కేంద్ర కార్యాలయం నుంచి ఇంతటి పెద్ద బాధ్యత ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు.కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలను గుర్తించి బాధ్యతలు అప్పగించడం జనసేనలోనే సాధ్యమని, ఇది పవన్ కళ్యాణ్ నాయకత్వ ప్రత్యేకతకు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు.రాబోయే మున్సిపాలిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి స్ఫూర్తిని కొనసాగిస్తూ జనసేన తరఫున యువత పెద్ద ఎత్తున పోటీ చేసి వంద శాతం విజయం సాధించేలా కమిటీ కృషి చేయాలని పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ కాన్ఫరెన్స్ కాల్ లో దిశానిర్దేశం చేశారని అయిరాజు తెలిపారు.తనపై ఉంచిన బాధ్యతను నిబద్ధతతో, చిత్తశుద్ధితో, నిజాయితీగా నిర్వహిస్తానని, తనకు ఈ గౌరవం, గుర్తింపు ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు, జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి, తన 12 ఏళ్ల ప్రయాణంలో తోడుగా నిలిచిన నియోజకవర్గ, మండల, గ్రామ జనసైనికులకు ధన్యవాదాలు తెలిపారు.

తూర్పు గోదావరి

స్థానిక సంస్థ ఎన్నికల సన్నాహంపై కీలక చర్చ మంగళగిరి

*మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం లీడర్ షిప్ కాన్క్లేవ్ – రెండో రోజు ఉత్సాహంగా కొనసాగింపురెండు రోజుల కార్యక్రమం పాల్గొన్న కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, జగ్గంపేట ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ* జగంపేట,మంగళగిరి, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 8: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగుదేశం లీడర్ షిప్ కాన్క్లేవ్ 7, 8 తేదీల్లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ రెండు రోజుల శిక్షణ తరగతులు రెండో రోజు మరింత ఉత్సాహంగా కొనసాగాయి.రెండు రోజుల కార్యక్రమంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జగ్గంపేట శాసనసభ్యులు , పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. పార్టీ నాయకత్వం, భవిష్యత్ కార్యాచరణపై జరిగిన చర్చల్లో చురుకుగా పాల్గొన్నారు.రెండో రోజు ముఖ్యాంశాలు: సెషన్ 6 – సుస్థిర అభివృద్ధి:* ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నమూనాలు, పీపీపీ విధానం, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, హైదరాబాద్, అమరావతి అభివృద్ధి నమూనాలపై లోతైన చర్చ జరిగింది. సెషన్ 7 – ప్రజలకు ప్రభుత్వ సేవలు, పాలనా విధానం:* స్వర్ణాంధ్ర 2047 విజన్ కు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పై వివరణ. సెషన్ 8 – రాజకీయ సమాచార ప్రచారం, ప్రజలతో అనుసంధానం:* ప్రజలతో ఓపిగ్గా, స్పష్టతతో మెలగడం, మై టీడీపీ, సోషల్ మీడియా వినియోగం, కంటెంట్ తయారీలో క్యాడర్ భాగస్వామ్యంపై శిక్షణ. సెషన్ 9 – ఎల్ నినో అవగాహన:* వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయం, రిజర్వాయర్లు, భూగర్భ జలాలపై ప్రభావం, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల వారీగా పంటలపై ప్రభావంపై అధ్యయనం.సెషన్ 10 – స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహం:* డీలిమిటేషన్ నుంచి పోలింగ్ వరకు ఎన్నికల ప్రక్రియ, ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక, మిత్రపక్షాలతో సమన్వయం, ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టడం, పోలింగ్ రోజు సన్నద్ధతపై దిశానిర్దేశం.చివరగా ఐటీ శాఖ మంత్రి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ముగింపు సందేశంతో కాన్క్లేవ్ విజయవంతంగా ముగిసింది.

తూర్పు గోదావరి

తాళ్లూరు లిఫ్ట్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ –

– ఈనెల 20 లోపు మొదటి పైప్ లైన్ ప్రారంభించేందుకు చర్యలు… ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ* కాకినాడ , గండేపల్లి, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 6 :* గండేపల్లి మండలం తాళ్లూరులోని పుష్కర లిఫ్ట్ పనుల ప్రగతిని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలవరం ఈఈ రాజేశ్వరరావు, ఎలక్ట్రికల్ ఈఈ వీరభద్రరావు, మెగా కంపెనీ ప్రతినిధి సతీష్ తో కలిసి తాళ్లూరు లిఫ్ట్ నుండి సీతారాంపురం డెలివరీ పాయింట్ వరకు జరిగిన పనులను సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తాళ్లూరు లిఫ్ట్ మొదటి పైప్ లైన్ పనులు పూర్తి కావస్తున్నాయని, సెప్టెంబర్ 15 నుండి 20 లోపు మొదటి పైప్ లైన్ ప్రారంభించేందుకు ఎలక్ట్రికల్ అధికారులతో చర్చించామని అన్నారు. రేపు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పనుల సమగ్ర నివేదిక అందిస్తామని తెలిపారు. 20వ తేదీలోపు మొదటి పైప్ లైన్ ప్రారంభించి ముందుగా చెరువులు, ఆరుతడి పంటలకు నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి షెడ్యూల్ ను బట్టి ముఖ్యమంత్రి ప్రారంభిస్తారా లేక ఎవరు ప్రారంభిస్తారని అనేది రేపు అమరావతిలో చర్చించిన తర్వాత తెలుస్తుందని స్పష్టం చేశారు. జగ్గంపేట నియోజకవర్గ రైతుల చిరకాల సాగునీటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఇరిగేషన్ అధికారులు, ఎలక్ట్రికల్ అధికారులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన కరాటే యోధులు మన కాట్రావులపల్లి యువకుల అరుదైన ఘనత

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 6 : ఘనంగా సత్కరించిన ముసిరెడ్డి నాగేశ్వరరావు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అరుదైన ఘనత సాధించారు. గిన్నిస్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకుని గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచారు. కె. లావరాజు – బ్లాక్ బెల్ట్ మూడవ డాన్ :* 2005లో ఒకే నవ మార్షల్ ఆర్ట్స్ సంస్థ నుండి కరాటే శిక్షణ ప్రారంభించి, 2008లో బ్లాక్ బెల్ట్ మొదటి డాన్, 2017లో రెండవ డాన్, 2026లో ప్రతిష్టాత్మక మూడవ డాన్ సాధించాడు. ప్రస్తుతం ఎంతోమందికి కరాటే శిక్షణ ఇస్తూ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆడపిల్లలకు ఆత్మరక్షణ శిక్షణ అందిస్తున్నాడు. వై. శ్రీను – బ్లాక్ బెల్ట్ మొదటి డాన్ :* 2008లో ఒకే నవ మార్షల్ ఆర్ట్స్ సంస్థలో కరాటే శిక్షణ ప్రారంభించి, 2017లో బ్లాక్ బెల్ట్ మొదటి డాన్ సాధించాడు. ప్రైవేట్ పాఠశాలలకే పరిమితం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోని ఆడపిల్లలకు ఉచితంగా ఆత్మరక్షణ తరగతులు నిర్వహిస్తూ సేవ చేస్తున్నాడు.వీరిద్దరినీ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూకాట్రావులపల్లి గ్రామం నుండి ఇద్దరు యువకులు గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించడం మనందరికీ గర్వకారణం. – లావరాజు, శ్రీను చిన్న వయసు నుండే కరాటే పై మక్కువతో సాధన చేసి బ్లాక్ బెల్టులు సాధించి నేడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని ఆడపిల్లలకు ఆత్మరక్షణ నేర్పిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపడం అభినందనీయం.ఇలాంటి యువకులను కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది. వీరు మరిన్ని రికార్డులు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలి.

తూర్పు గోదావరి

కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 5: జగ్గంపేట మండలం గొల్లలగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతినే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, ఆయన గొప్ప తత్వవేత్త, ఉపాధ్యాయుడు, దేశానికి రెండవ రాష్ట్రపతిగా సేవలందించారని అన్నారు. నా పుట్టినరోజును వ్యక్తిగతంగా జరుపుకోకుండా ఉపాధ్యాయులందరినీ గౌరవించాలని ఆయన ఇచ్చిన పిలుపు ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గొప్పతనాన్ని చాటుతుందన్నారు.గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదని, విద్యార్థి జీవితానికి దారి చూపే దీపమని, తల్లి జన్మనిస్తే గురువు జీవితాన్ని ఇస్తాడని అన్నారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులని, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సంక్షేమానికి, విద్యా వ్యవస్థ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలోకలిదిండి రాజశేఖర్, కొలుకులులూరి కృష్ణంరాజు, చిత్రపు బాబు,పెద్ద మురళి రాజు, రాయుడు వీరబాబు, రేగళ్ల రమణ, సూర్యచంద్ర, పిల్లి శ్రీ ను, శ్రీరాములు కూటమి నాయకులు

తూర్పు గోదావరి

ఉపాధ్యాయులను సన్మానించిన తుమ్మలపల్లి రమేష్

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 5:- ఘనముగా ఉపాధ్యాయ దినోత్సవం జనసేన పార్టీ ఇన్చార్జ్ తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తుమ్మలపల్లి రమేష్ జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించినారు.నేడు సెప్టెంబర్ 5. మనందరికీ ఎంతో పవిత్రమైన రోజు భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయన గొప్ప తత్వవేత్త, ఉపాధ్యాయుడు, భారతదేశ రెండవ రాష్ట్రపతి. “నా పుట్టినరోజును వ్యక్తిగతంగా కాకుండా ఉపాధ్యాయులందరిని గౌరవించు కోవాలని ” ఆయన అన్నారు .గురువు అంటే కేవలం పాఠాలు చెప్పేవారు కాదు. మన జీవితానికి దారి చూపే దీపం. తల్లి జన్మనిస్తే, గురువు జీవితాన్నిస్తాడు ఒక డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్,ఒకనాయకుడువీరందరివెనుకఒకగురువుఉంటారు.గురువులేనవిజయంలేదు.ఉపాధ్యాయులు అక్షరాలు మాత్రమే కాదు, క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం నేర్పిస్తున్నారు. తప్పు చేస్తే దండిస్తారు, ఒప్పు చేస్తే ఆశీర్వదిస్తారు. అదే నిజమైన ప్రేమ. గురువులందరికీ పాదాభివందనం చేసుకొని దీవెనలు పొందాలని అన్నారు . ఉపాధ్యాయులు చూపిన మార్గంలో నడుస్తూ వారి, పేరు నిలబెట్టాలని, .పుస్తకాలు మనకు జ్ఞానాన్ని ఇస్తాయి, కానీ గురువు మనకు ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలో నేర్పిస్తారు అని అన్నారు నియోజకవర్గంలో రెండు వందమంది ఉపాధ్యాయులను సాల్వ పూలదండ్లతో సన్మానించి స్వీట్ బాక్స్ లు పంచినారు ఈ కార్యక్రమంలో ఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు పులి ప్రసాద్, కొయ్యన లక్ష్మి,, పాపన్న దొర, చిన్న తదితరులు పాల్గొన్నారు

తూర్పు గోదావరి

సహకార సంఘాల్లో అవినీతికి పాల్పడ్డ దోషులను వెంటనే శిక్షించాలి

జగ్గంపేట, రంగవల్లి నగర్, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 5, జిల్లాలో సహకార పరపతి సంఘాల జరుగుతున్న అవినీతి అక్రమాలకు కూటమి పాలకులే నైతిక బాధ్యత వహించాలని శనివారం నాడు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామపంచాయతీ రంగవల్లి నగర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ రాజపూడి, గండేపల్లి, కిర్లంపూడి తదితర సంఘాల్లో నేటి వరకు సుమారు 150 కోట్ల అవినీతి జరిగిన బాధ్యులను శిక్షించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జిల్లాలో, రాష్ట్రంలో ప్రతి వ్యవస్థలో దోపిడీ చేస్తూ వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అలాగే జిల్లాలో ఎక్కడ చూసినా పోలవరం కాలువ, కొండలు, గుట్టలను వదలకుండా మైనింగ్ మాఫియా అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, ఈ విషయంపై అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కనీసం స్పందించకపోవడం చూస్తుంటే జిల్లా యంత్రాంగం కూడా మామూళ్లమత్తులోమునిగిపోయిందనితేటతెల్లమవుతుందని ఆయన తెలిపారు. కావున రాజపూడి, గండేపల్లి సహకార సంఘాల్లో జరిగిన అవినీతి పై తక్షణమే న్యాయ విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించే విధంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో రంగవల్లి నగర్ నాయకులు డాన్ శీను , కొండేపూడి మంగయమ్మ, కరుణ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.