కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 5:
జగ్గంపేట మండలం గొల్లలగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతినే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, ఆయన గొప్ప తత్వవేత్త, ఉపాధ్యాయుడు, దేశానికి రెండవ రాష్ట్రపతిగా సేవలందించారని అన్నారు. నా పుట్టినరోజును వ్యక్తిగతంగా జరుపుకోకుండా ఉపాధ్యాయులందరినీ గౌరవించాలని ఆయన ఇచ్చిన పిలుపు ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గొప్పతనాన్ని చాటుతుందన్నారు.గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదని, విద్యార్థి జీవితానికి దారి చూపే దీపమని, తల్లి జన్మనిస్తే గురువు జీవితాన్ని ఇస్తాడని అన్నారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులని, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సంక్షేమానికి, విద్యా వ్యవస్థ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలోకలిదిండి రాజశేఖర్, కొలుకులులూరి కృష్ణంరాజు, చిత్రపు బాబు,పెద్ద మురళి రాజు, రాయుడు వీరబాబు, రేగళ్ల రమణ, సూర్యచంద్ర, పిల్లి శ్రీ ను, శ్రీరాములు కూటమి నాయకులు

