Thursday, 1 October 2026

Tag: జగ్గంపేట

తూర్పు గోదావరి

ప్రజా దర్బార్లో ప్రజా సమస్య లకు సత్కర్ పరిష్కారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 22 :ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని నిన్న కొన్ని అనివార్య కారణాలవల్ల శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగ్గంపేట రావులమ్మ నగర్ లోని క్యాంప్ ఆఫీసులో శనివారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు పెన్షన్లు, హౌసింగ్ లోన్లు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు.ముఖ్యంగా కాట్రావులపల్లి గ్రామ టిడిపి అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు కాట్రావులపల్లి గ్రామ త్రాగునీటి అవసరాల కోసం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో భావారం నుండి వచ్చే ఫిల్టర్ నీరు కాట్రావులపల్లి గ్రామ హై స్కూల్ ఎదురుగా నీటి సంపు కట్టించి శుక్రవారం ట్రయల్ రన్ కూడా పూర్తి చేసామని ఈ సంపు వద్ద ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేసి 24 గంటల విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. ఆయన వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మిగిలిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పిల్లా చంటిబాబు, రేఖ బుల్లి రాజు, సుంకవిల్లి రాజు, దాసరి సీతారామకృష్ణ, పురం శెట్టి శివాజీ, వేములకొండ జోగారావు, సత్తి సదాశివరెడ్డి, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

గోనేడ వద్ద బెడ్ రెగ్యులేటర్ నిర్మించాలి, అసెంబ్లీలో జ్యోతుల నెహ్రూ డిమాండ్

*గోనేడ వద్ద బెడ్ రెగ్యులేటర్ నిర్మించాలి – ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అసెంబ్లీలో డిమాండ్* జగ్గంపేట,అమరావతి, పున్నమి ప్రతినిధి,ఆగస్టు 19: అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానం తరువాత ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మంత్రి ఈమధ్య మా ప్రాంతమంతా పర్యటించారని ఆయన వాస్తవాలు అన్ని చూశారని అన్నారు. 1972 ఏలేరు నిర్మాణం జరిగింది అని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఈ కాలువకు సాగునీరు, వరద నీరు పోవడానికి ఒకే కాలువ ఉందని అన్నారు. పూర్వం రిజర్వాయర్ నిర్మాణానికి ముందు తిమ్మాపురం బెడ్ రెగ్యులేటర్ ద్వారా ఆ రోజుల్లో 65 వేల ఎకరాలకు వంతుల వారి నీళ్లు ఇచ్చే అవకాశం ఉండేదని రిజర్వాయర్ నిర్మాణం తర్వాత 53 వేల ఎకరాలకే నీలిచ్చే పరిస్థితి ఉందని అన్నారు. ఎందుకంటే కొంత ఆయకట్టు తీసుకెళ్లి గోదావరి లోకి కలపడం జరిగిందని అన్నారు. 53 వేల ఎకరాలకు కూడా డి సి ఆర్ మెయిన్ లూయిస్ 600 క్యూసెక్కుల కెపాసిటీతో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 1800 క్యూసెక్కుల నీరు కిందకి వదిలితేనే కానీ ఈ ఆయకట్టు కు నీరు అందే పరిస్థితి లేదని అన్నారు. ఈ పరిస్థితి ఎక్కడ లేదని సిల్వే నుంచే నీరు వదలడం జరుగుతుందని అన్నారు. దీనికి ఫేజ్ వన్ ఆధునికరణ అని గత ప్రభుత్వాలుచాలా డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. ఒక రైతుగా నా దృష్టిలో ఒక్క రూపాయి కూడా ఉపయోగ పడలేదని నా అభిప్రాయమని దాని జోలికి ఇప్పుడు పోదలుచుకోలేదని అన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణంగా 12 సంవత్సరాలలో రెండు సంవత్సరాల 24 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఏలేరు నిండుతుందని మిగతా అన్ని సంవత్సరాలు 50% రిజర్వాయర్ నీటితో ఉంటుందని మా అందరి అభ్యర్థన మేరకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పురుషోత్తపట్నం పేజ్ 2 ద్వారా 1800 కోట్ల రూపాయల ఖర్చుతో 1400 క్యూసెక్కుల నీటిని పోలవరం కాలవ నుండి ఏలేరు జలాశయంలోకి లిఫ్ట్ చేయడం జరుగుతుందని ఇది వాస్తవమని అన్నారు.వీటన్నిటికంటే నీటిని పొదుపుగా వాడుకోవాలని సూత్రికరణతో 53 వేల ఎకరాలకు 600 క్యూసెక్కుల నీటిని వదిలితే రైతులు రెండు పంటలు పండించుకోవచ్చని అంతేకాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి విశాఖపట్నం త్రాగునీరు అవసరాలకు ఎల్ఎంసీ కాలువ ద్వారా నీటిని అందించవచ్చని అన్నారు. ముఖ్యంగా నేను కోరేది ఏమిటంటే 53 వేల ఎకరాలకు 600 క్యూసెక్కుల నీటి తోటి పంటలు పండించుకోవడానికి కాలువలు పరిరక్షించుకోవడానికి మంత్రి గారిని నేను కోరేది ఏమిటంటే గోనేడ వద్ద బెడ్ రెగ్యులేటర్ నిర్మాణం చేసుకోవాలని మూడు కిలోమీటర్లు సాయిల్ చాలా గట్టిగా ఉంటుందని కింద ఆయకట్టు రైతులకు నష్టం ఏమీ ఉండదని కాబట్టి పేజ్ వన్ నిధులతో ఆటోమేటిక్ గేట్లతో గోనేడ వద్ద ఒక రెగ్యులేటర్ నిర్మిస్తే 600 క్యూసెక్కుల ఆయికట్టుకు వెళ్లి రైతులకు నీరు అందుతుందని అన్నారు. ఫేజె్ వన్ ఆధునీకరణ నిధులతో ఈ నిర్మాణం చేపట్టి తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండే విధంగా దీనిపై ఇరిగేషన్ శాఖ మంత్రి యాక్షన్ తీసుకోవాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అసెంబ్లీలో ప్రస్తావించారు.

తూర్పు గోదావరి

డొక్కా సీతమ్మ ఆదర్శంతో ప్రతి మంగళవారం జగ్గంపేటలో తుమ్మలపల్లి రమేష్ 500 మందికి అన్నదానం

*డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతీ మంగళవారం తుమ్మలపల్లి రమేష్ 500 మందికి అన్నదానం* *జనసేనాని పవన్ కళ్యాణ్ గారే స్ఫూర్తి గా తుమ్మలపల్లి రమేష్ సొంత డబ్బుల తో నిర్వహణ* కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,ఆగష్టు 18 జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 500 మందికి ఉచితంగా భోజనం అందించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సేవా స్ఫూర్తితో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. పేదలు, కూలీలు, వృద్ధులు, ఆపదలో ఉన్న వారికి భోజనం అందించడం ద్వారా వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు.అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు తుమ్మలపల్లి రమేష్ స్వయంగా భోజనం వడ్డించారు. భోజనం చేస్తున్న వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో ,జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ఐటిఐ అడ్మిషన్లు గడువు ముగింపు

జగ్గంపేట మండలం, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 18 ఐటిఐ అడ్మిషన్ గడువు ముగుస్తున్నందున యువత తమ కాలవ్యవధిని వృధా చేసుకోవద్దని మనవి జగ్గంపేట మండలం జగ్గంపేట లో ఉన్న స్కిల్ ఇండియా ద్వారా నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర ఐటిఐ గోకవరం రోడ్డులో పోలవరం కాలువ వద్ద ఐటిఐ ఎలక్ట్రిషన్ పిట్టర్ కోర్సులు నిర్వహించబడుతున్నది ప్రతి విద్యార్థికి ఆర్టీసీ వారి స్టూడెంట్ బస్ పాస్ పొందు సౌకర్యం కలదు అర్హులైన విద్యార్థులందరికీ ప్రభుత్వం వారు అందించే స్కాలర్షిప్ పొందు సౌకర్యం కలదు అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థి తప్పక ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందే విధంగా కెరీర్ గైడెన్స్ ఇవ్వబడును అని ప్రిన్సిపల్ అన్నారు

తూర్పు గోదావరి

అడ్డ కొండ భూములు పేదలకు పట్టాలు ఇవ్వాలి

జగ్గంపేట మండలం, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 17 *పేదలకు పట్టాలు ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి తగదు*. *అడ్డకొండ భూములు పేదలకు పంచే వరకు పోరాటం ఆగదు*. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం. గత మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న మల్లిసాల అడ్డకొండ భూములపై తమకు తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నాడు కాకినాడజిల్లా ,జగ్గంపేట మండలం, మల్లిసాల, గోపాలపురం గ్రామాలకు చెందిన దళిత, గిరిజన, బిసి, ఇతర నిరుపేదలు సోమవారం నాడు జగ్గంపేట ప్రధాన రోడ్డులో నిరసన ర్యాలి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఆర్ సి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ మల్లిసాల అడ్డ కొండ భూములపై గత మూడు దశాబ్దాలుగా మల్లిసాల ,గోపాలపురం గ్రామాలకు చెందిన ఎస్సీ, బీసీ,ఎస్టీ మరియు ఇతర నిరుపేదలు అనేకమంది పోరాడుతున్నారని, అనేక వేయ ప్రయాసలతో 30 ఏళ్ల క్రితం భూమి చదును చేసి మామిడి, జీడి మామిడి మొక్కలను నాటి, భూస్వాముల గుండాల దాడులను, పోలీస్ నిర్బంధాలను ఎదుర్కొని పోరాడారన్నారు. అధికారుల సహకారంతో భూస్వాములు కోర్టుకు వెళ్లిన కోర్టు భూస్వాములకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రతిపక్షంలో ఉండగా పోరాటంలో ఉన్న ప్రజలందరికీ కష్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొని పోరాడుతున్నటువంటి ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా, ఇండస్ట్రియల్ పార్క్ పెడతామని అనడం దారుణం అన్నారు. గత మామిడికాయ సీజన్లో రైతులు మామిడికాయ కోసుకుంటుంటే అధికారులు జోక్యం చేసుకుని ఆ భూములను సర్వే చేయించి పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. కానీ హామీ అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. జ్యోతుల నెహ్రూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారి విచారణ చేపట్టి మూడు దశాబ్దాలుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పోరాడుతున్న మల్లిసాల, గోపాలపురం గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ ఎస్టీ ఇతర పేదలకు ఆ భూములను పంచాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్ సి ఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్, ఏఐఎఫ్ టు యు జిల్లా కార్యదర్శి కుంచే అంజిబాబు, పి.డి.ఎస్.యు(వి)రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ఏపీ ఆర్ సి ఎస్ జిల్లా నాయకులు కే రామలింగేశ్వరరావు, జాను, గ్రామ కమిటీ నాయకులు బోడకుర్తి అబ్బులు, పోసమ్మ తదితరులు నాయకత్వం వహించారు.

తూర్పు గోదావరి

భవిత దివ్యాంగుల పాఠశాలకు కిరాణా వర్తక సంఘం విరాళం

*జగ్గంపేట భవిత దివ్యాంగుల పాఠశాలకు కిరాణా వర్తక సంఘం విరాళం* *20 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ ఫైల్ ఫోల్డర్లు, ఫలహారాలు పంపిణీ* *కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి , ఆగస్టు 17:* జగ్గంపేట మండలం భవిత ప్రత్యేక పాఠశాలలోని దివ్యాంగ విద్యార్థులకు జగ్గంపేట కిరాణా వర్తక సంఘం సహాయం అందించింది. సంఘం సభ్యులు 20 మంది దివ్యాంగ బాలబాలికలకు యాపిల్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యా, వైద్య, దివ్యాంగ ధ్రువపత్రాలను భద్రపరచుకునేందుకు సర్టిఫికెట్ ఫైల్ ఫోల్డర్లను విరాళంగా అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు అప్పాన పెద్దకాపు, తిత్తి చిన్నబాబు మాట్లాడుతూ దాతల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమైన పత్రాల భద్రతకు ఈ ఫైల్ ఫోల్డర్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పాఠశాలలో ప్రస్తుతం 100 మంది దివ్యాంగ విద్యార్థులు ఉన్నారు. వారందరికీ సర్టిఫికెట్ ఫైల్ ఫోల్డర్లు అవసరం ఉన్నాయి. అలాగే తరగతి గదులకు కుర్చీలు, ఫ్యాన్లు అవసరం. వరండాలో పిల్లలు భోజనం చేసే సమయంలో కోతుల బెడద ఉండడంతో వరండాకు ఐరన్ మెష్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు తెలిపారు.ఈ అవసరాలను తీర్చేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సేవాభావం ఉన్నవారు ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు, కిరాణా వర్తక సంఘం నాయకులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

డీఎస్సీ పై ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ఖండించిన జగ్గంపేట డిఎస్సీ అభ్యర్థులు

*డీఎస్సీపై ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ఖండించిన జగ్గంపేట డీఎస్సీ అభ్యర్థులు* *ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు వినతి పత్రం అందజేత* కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 16: గోకవరం రోడ్డులో ఉన్న కాపు సామాజిక భవనంలో ఆదివారం డీఎస్సీ అభ్యర్థుల సంఘీభావ సమావేశం ఘనంగా జరిగింది. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు ఉన్నాయి అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను అభ్యర్థులు ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడం సరికాదని, ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న డీఎస్సీ ప్రక్రియకు తమ పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేశారు.కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన డీఎస్సీ అభ్యర్థులు మరియు నిరుద్యోగ యువత స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు డీఎస్సీ విద్యార్థులు మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సంవత్సరాల తరబడి డీఎస్సీ నోటిఫికేషన్లు రాకపోవడంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకంతో 16500 మందికి డీఎస్సీలో అవకాశం కల్పించారని అన్నారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రస్తుత డీఎస్సీ నియామక ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. విద్యార్థుల అవసరాలు మరియు ఉపాధ్యాయ ఖాళీలను దృష్టిలో ఉంచుకుని తదుపరి డీఎస్సీ నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అత్యంత కీలకమైన అంశంగా వయోపరిమితి దాటిన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారి జీవనోపాధి కోసం ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థలు, సంస్థల్లో కనీసం 50% రిజర్వేషన్ కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక విధానం తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రతిపక్షం చేస్తున్న అనవసర రాద్ధాంతం పై ఒక సమావేశం నిర్వహించుకుని డీఎస్సీ విద్యార్థులు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారని ఈ వినతులన్నింటినీ నిషితింగా పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి, రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రస్తావించి ప్రైవేటు పాఠశాలల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించి 35 వేలకు తగ్గకుండా జీతాలు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదిస్తానని అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.

తూర్పు గోదావరి

జిల్లా సమగ్ర అభివృద్ధిపై సమీక్షలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పలు సమస్యల ప్రస్తావన

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,ఆగస్టు 14* జిల్లా సమగ్రాభివృద్ధిపై సమీక్షా సమావేశం (డిఆర్‌సి) కాకినాడ కలెక్టరేట్‌లోని వివేకానంద హాల్‌లో జిల్లా కలెక్టర్ హరింద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. *ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రధానంగా లేవనెత్తిన అంశాలు:* 1. *గృహ నిర్మాణం:* 2014 నుంచి నిర్మాణం పూర్తి చేసుకుని అకౌంట్లో రూపాయి పడి ఆన్‌లైన్ అయిన లబ్ధిదారులకు హౌసింగ్ రుణాలు అందించాలని, అలాగే గత రెండేళ్లలో ఇళ్లు పూర్తి చేసుకున్న వారికి హౌసింగ్ రుణాలను ఇప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. 2. *ఇళ్ల స్థలాలు:* పోలవరం కాలువపై ఉన్న సాయిల్ బ్యాంక్‌ను ఖాళీ చేసి పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 3. *పారిశ్రామిక అభివృద్ధి:* మల్లిశాలలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 4. *వైద్య సౌకర్యాలు:* జాతీయ రహదారిపై జగ్గంపేట వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతున్నందున, అక్కడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఆర్థోపెడిక్ డాక్టర్‌ను, ఆక్సిజన్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. 5. *రైతులకు అవగాహన:* సూపర్ ఎలినో ప్రభావం నేపథ్యంలో రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అభ్యర్థించారు.సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ప్రభుత్వ విప్ యనమల దివ్య, ఎమ్మెల్యేలు చిన్నరాజప్ప, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం పైమాన్ కమిటీ సభ్యుడు పెండెం దొరబాబు, జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.జిల్లా సమగ్రాభివృద్ధికి అందరూ సమన్వయంతో పని చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.