Tuesday, 18 August 2026
  • Home  
  • డొక్కా సీతమ్మ ఆదర్శంతో ప్రతి మంగళవారం జగ్గంపేటలో తుమ్మలపల్లి రమేష్ 500 మందికి అన్నదానం
- తూర్పు గోదావరి

డొక్కా సీతమ్మ ఆదర్శంతో ప్రతి మంగళవారం జగ్గంపేటలో తుమ్మలపల్లి రమేష్ 500 మందికి అన్నదానం

*డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతీ మంగళవారం తుమ్మలపల్లి రమేష్ 500 మందికి అన్నదానం* *జనసేనాని పవన్ కళ్యాణ్ గారే స్ఫూర్తి గా తుమ్మలపల్లి రమేష్ సొంత డబ్బుల తో నిర్వహణ* కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,ఆగష్టు 18 జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 500 మందికి ఉచితంగా భోజనం అందించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సేవా స్ఫూర్తితో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. పేదలు, కూలీలు, వృద్ధులు, ఆపదలో ఉన్న వారికి భోజనం అందించడం ద్వారా వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు.అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు తుమ్మలపల్లి రమేష్ స్వయంగా భోజనం వడ్డించారు. భోజనం చేస్తున్న వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో ,జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

*డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతీ మంగళవారం తుమ్మలపల్లి రమేష్ 500 మందికి అన్నదానం*

*జనసేనాని పవన్ కళ్యాణ్ గారే స్ఫూర్తి గా తుమ్మలపల్లి రమేష్ సొంత డబ్బుల తో నిర్వహణ*

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,ఆగష్టు 18

జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 500 మందికి ఉచితంగా భోజనం అందించారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సేవా స్ఫూర్తితో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. పేదలు, కూలీలు, వృద్ధులు, ఆపదలో ఉన్న వారికి భోజనం అందించడం ద్వారా వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు.అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు తుమ్మలపల్లి రమేష్ స్వయంగా భోజనం వడ్డించారు. భోజనం చేస్తున్న వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమం లో ,జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.