2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ప్రస్తుతం 24.15 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దక్కిందని బీసీ లకు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారంలో స్వర్ణ యుగం ప్రారంభమైందని కల్లుగీత కార్మిక ఆర్థిక సంస్థ రాష్ట్రమాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య అన్నారు. ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 24.15 శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్లను 34 శాతం కు పెంచుతూ రాష్ట్ర శాసనసభలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పై మరింత విశ్వాసం పెరిగిందని నరసయ్య అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల్లో 34 శాతానికి అలాగే పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికలకు సంబంధించిన 33. 13 శాతానికి రిజర్వేషన్లను పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోందని అన్నారు. ఇకపోతే స్థానిక ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఒక సంచలన నిర్ణయంగా మారిందన్నారు. బీసీలు మహిళల పట్ల తమకున్న చిత్తశుద్ధిని కూటమి ప్రభుత్వం మాటల్లో కాక చేతల్లో చూపించి తమ చిత్తశుద్ధిని చాటుకుందని వెంకట నరసయ్య ప్రశంసించారు. సామాన్యులైన బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తూ బీసీల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు తెలుగుదేశం పార్టీ గడిచిన 43 సంవత్సరాలుగా దృడ సంకల్పంతో పనిచేస్తుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గొడ్డలి పార్టీ బీసీలు మహిళల పట్ల తమ విధానాలను సరి చేసుకోవాలని సలహా ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు మూకుమ్మడిగా కూటమి ప్రభుత్వానికి అండగా నిలుస్తారని ఆయన ఆశ భావాన్ని వ్యక్తం చేశారు.


