Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

డీఎస్సీ అక్రమాలపై శాసన మండలిలో చర్చ పెట్టాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డీఎస్సీ అక్రమాలపై శాసన మండలిలో చర్చ పెట్టాలి

డీఎస్సీ అక్రమాలపై శాసన మండలిలో చర్చ పెట్టాలి

పున్నమి ప్రతినిధి – కడప:

డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై శాసన మండలిలో సమగ్రంగా చర్చించాలని వైఎస్సార్‌సీపీ స్టేట్ మహిళా ప్రధాన కార్యదర్శి యేకుల రాజేశ్వరి రెడ్డి డిమాండ్ చేశారు.

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు, నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థులకు న్యాయం జరిగేలా సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.

అయితే ఇప్పుడు చర్చ పెట్టారని, అది కూడా చివరి రోజు చర్చ పెట్టడం సరికాదని ఆమె విమర్శించారు. సమస్యపై ముందుగానే చర్చించి అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం చివరి రోజు చర్చ పెట్టి ముగించేందుకు ప్రయత్నించడం అన్యాయమన్నారు.

“తప్పు చేశారు కాబట్టే.. చర్చ పెట్టకుండా తొక్కి ముగించారు. డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలాడకూడదు. పారదర్శకంగా విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలి” అని యేకుల రాజేశ్వరి రెడ్డి డిమాండ్ చేశారు.

నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

యేకుల రాజేశ్వరి రెడ్డి
వైఎస్సార్‌సీపీ స్టేట్ మహిళా ప్రధాన కార్యదర్శి

డీఎస్సీ అక్రమాలపై శాసన మండలిలో చర్చ పెట్టాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *