Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

శాస్త్రీయ సాగు పద్ధతులతో పత్తిలో అధిక దిగుబడి కపాస్‌ కాంతి పథకంలో రైతులకు అవగాహన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శాస్త్రీయ సాగు పద్ధతులతో పత్తిలో అధిక దిగుబడి కపాస్‌ కాంతి పథకంలో రైతులకు అవగాహన

(పున్నమి ప్రతినిధి)
వేముల: మండలంలోని చాగలేరు గ్రామంలో కపాస్‌ కాంతి పథకంలో భాగంగా పత్తి పంటలో అధిక దిగుబడి సాధించే లక్ష్యంతో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి.పి. ఓబులేసు పాల్గొని పత్తి సాగులో పాటించాల్సిన ఆధునిక యాజమాన్య పద్ధతులు, ఎరువుల వినియోగం, సూక్ష్మపోషకాల ప్రాధాన్యతను వివరించారు.

భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించాలని, నత్రజని, భాస్వరం, పొటాష్‌ వంటి ప్రధాన పోషకాలను సమతుల్యంగా అందించాలని సూచించారు. అధికంగా యూరియా వాడటం వల్ల మొక్కలు ఏపుగా పెరిగి చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వ్యవసాయ శాఖ సిఫార్సు చేసిన మోతాదులోనే ఎరువులు వినియోగించాలన్నారు.

పత్తి మొక్కల్లో సూక్ష్మపోషకాల లోపాలను గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా మెగ్నీషియం లోపం వల్ల ఆకుల ఈనెల మధ్య పసుపు రంగు కనిపిస్తే వ్యవసాయ అధికారుల సలహా మేరకు తగిన చర్యలు తీసుకోవాలని వివరించారు. శాస్త్రీయ సాగు పద్ధతులు పాటిస్తూ పంట ఎదుగుదలను నిరంతరం పరిశీలించడం ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్ర సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.

శాస్త్రీయ సాగు పద్ధతులతో పత్తిలో అధిక దిగుబడి కపాస్‌ కాంతి పథకంలో రైతులకు అవగాహన

శాస్త్రీయ సాగు పద్ధతులతో పత్తిలో అధిక దిగుబడి కపాస్‌ కాంతి పథకంలో రైతులకు అవగాహన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *