Thursday, 1 October 2026

Tag: జగ్గంపేట

తూర్పు గోదావరి

రామవరం లో మెయిన్ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 30: జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో జాతీయ రహదారి నుండి ముత్యాలమ్మ చెరువు వరకు నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.కిలోమీటర్ మేర కాలినడకన రోడ్డు వెంబడి నడుస్తూ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్డు నాణ్యత, కొలతలు, మెటీరియల్ వినియోగంపై అధికారులను ప్రశ్నించారు.గ్రామస్తుల నుంచి వచ్చిన అభ్యర్థనలు , సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్ అండ్ బి డీఈ కేఎస్ రాఘవరావు, కాంట్రాక్టర్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రజాధనంతో చేసే పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని, అంచనాలకు తగ్గట్టుగా పకడ్బందీగా రోడ్డు పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, రామవరం రోడ్డును త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, మాజీ సర్పంచ్ మండపాక చిన్న, జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర, సీనియర్ వార్డు సభ్యులు మండపాక వెంకటేశ్వరరావు( మణికంఠ), జనసేన మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ దొడ్డ శ్రీను టీడీపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

మామిడాడలో రైతులకు మినుములు పంపిణీ

జగ్గంపేట, మామిడాడ, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 30 జగంపేట మండలం మామిడాడ సచివాలయంలో రైతులకు మినుములు సబ్సిడీలో ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం వర్షాలు లేని కారణంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు సర్వేలో ఖాళీగా ఉన్న ల్యాండ్లు అలాగే వరి చేను వెయ్యని భూముల లో రైతులు అపరాలు జల్లుకొని ఆదాయం సమకూరుతుందని ప్రతి ఎకరానికి 8 కేజీలు విత్తనాలు చొప్పున ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా అపరాలు జల్లుకొని భూములు ఖాళీ లేకుండా పంటలు పండించుకుంటారని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సీతాదేవి తెలియజేశారు

తూర్పు గోదావరి

జగ్గంపేట పల్లె పండుగ 3.0 అభివృద్ధి కేరాఫ్ జ్యోతుల నెహ్రూ

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 29: జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు.మొదట శెట్టిబలిజిపేటలో భావారం ఫిల్టర్ వాటర్ స్కీం నుండి శుద్ధి చేసిన సురక్షితమైన తాగునీటిని ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన 3 జిఎల్ఆర్ ట్యాంకులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ ట్యాంకులతో ఆ ప్రాంత ప్రజల దీర్ఘకాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. అనంతరం గోకవరం రోడ్డులోని బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలకు మెయిన్ రోడ్డు నుండి 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. జగ్గంపేట పట్టణ ప్రముఖులు, దాత మంతెన నీలాద్రిరాజు గారి సేవలను గుర్తిస్తూ ఆ రోడ్డుకు *మంతెన నీలాద్రిరాజు మార్గము* గా నామకరణం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 11 వేల కోట్ల రూపాయలతో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి జాతర జరుగుతోందని అన్నారు. జగ్గంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామని, ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్, అడపా భరత్, రాష్ట్ర డైరెక్టర్లు పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, గెద్దాడ సత్యవేణి, ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, అడబాల భాస్కరరావు, ఉంగరాల రాము, మారిశెట్టి భద్రం, కన్నబాబు, కందుల చిట్టిబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి,పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, ఎస్ఏ గపూర్ కూటమి నాయకులు, పంచాయతీ ఇంజనీరింగ్ అధికారులు, మండల అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ఇరుపాకను ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ టిటిడి నిధులతో ఐదు ఆలయాల నిర్మాణం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, – సెప్టెంబర్ 28:* కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక శివ కేశవుల క్షేత్రంలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మాణం జరుగుతున్న అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ ఆలయం, అయోధ్య రామ మందిరాన్ని పోలిన బాల రాముడి ఆలయం పనులను వేగవంతం చేసేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతస్థాయి బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తో కలిసి దేవాదాయ శాఖ అధికారులు డి.ఎల్.వి. రమేష్ బాబు (డిప్యూటీ కమిషనర్), తోట దుర్గేష్ కుమార్ (సూపరింటెండింగ్ ఇంజనీర్), ఎన్. ఉదయ్ భాస్కర్ కుమార్ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ – స్థపతి), పి. సతీష్ (డిప్యూటీ స్థపతి), బల్లా శివ కుమార్ (అసిస్టెంట్ ఇంజనీర్ ఎల్.ఆర్.డి), చల్లా ఉదయ బాబు నాయుడు, గండేపల్లి గ్రూప్ టెంపుల్స్, తంటికొండ దేవస్థానం ఈవో, తిరుమల నుంచి శిల్పులు వచ్చి ఆలయాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి, నిర్మాణ ప్రణాళికపై కూలంకుషంగా చర్చించారు. పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం శివ కేశవుల ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల మణి అధ్యక్షతన బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధికి సంబంధించి మూడు కీలక తీర్మానాలు చేశారు.1. ఆలయ అభివృద్ధి కమిటీ రిజిస్ట్రేషన్2. ప్రతి నెల శ్రవణా నక్షత్రం సందర్భంగా భక్తుల చేతుల మీదుగా వెంకటేశ్వర స్వామికి అభిషేకం నిర్వహణ 3. నిర్మాణంలో ఉన్న ఆలయాలతో పాటు తలపెట్టిన మహా యజ్ఞం, కోటిలింగాలతో కోటిలింగేశ్వరుడి నిర్మాణంలో భక్తులందరూ భాగస్వాములు అయ్యే అవకాశం కల్పించడం ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఇర్రిపాకలో 5 ఆలయాలకు నిధులు మంజూరు అయ్యాయని, అందులో అష్టలక్ష్మీ, బాల రాముడి ఆలయాలకు ఇప్పటికే శంకుస్థాపన జరిగిందని తెలిపారు. వాయు ప్రతిష్ట చేసిన శివ కేశవుల ఆలయాలతో పాటు గ్రామంలోని గణపతి ఆలయానికి కూడా నిధులు రానున్నాయని, అలాగే తంటికొండ దేవస్థానానికి 6 కోట్ల రూపాయల శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు.దేవాదాయ శాఖ అధికారులు మాట్లాడుతూ సమర్థవంతమైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు టీటీడీ బోర్డు సభ్యుడిగా వెంకటేశ్వర స్వామి అవకాశం కల్పించడం వల్లనే ఈ ప్రాంతంలో ఆలయాలు ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, పురాతన ఆలయాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారని, ఇర్రిపాకను ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, కుంచెతాతాజీ, బదిరెడ్డి అచ్చన్న దొర, సత్తి సదాశివరెడ్డి, మలిరెడ్డి వెంకట శ్రీధర్, వై గోవిందు నాయుడు, బోదిరెడ్ల సుబ్బారావు ఇర్రిపాక శివకేశవుల క్షేత్రం అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

నైపుణ్యంతో విలేకరులు ముందుకు సాగాలన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ , జగంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 26: సభ్యులందరూ స్నేహపూర్వకమైన వాతావరణంలో ముందుకు సాగాలని గోకవరం ప్రెస్ క్లబ్ సభ్యులకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించారు. గోకవరం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పడిన నేపథ్యంలో శనివారం నాడు ది. గోకవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంగరపు రాజు, ప్రధాన కార్యదర్శి కర్రి శివరామకృష్ణ అధ్యక్షతన సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మర్యాదపూర్వకంగా జగ్గంపేట రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు అందించారు. గోకవరం మండల పెద్దలతో ప్రెస్ క్లబ్ అభివృద్ధికి పలు సూచనలను ఎమ్మెల్యేకే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ జర్నలిజం వృత్తిలో ప్రతి ఒక్కరు రాణించాలని, నియోజవర్గ స్థాయిలో ఉన్న రిపోర్టర్లు జిల్లా స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. నాయకులు, పెద్దలు మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు అభ్యర్థుల మేరకు ప్రెస్ క్లబ్ అభివృద్ధికి సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపి కార్యదర్శి కన్నబాబు, జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్ కుమార్,టీడీపీ రాష్ట్ర నాయకులు ఎస్ వి ఎస్ అప్పలరాజు, రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు,మాజీ సొసైటీ చైర్మన్ దాసరి తమ్మన్న దొర, జగ్గంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జనపరెడ్డి బాబు,మాజీ జడ్పీటీసీ పాలూరి బోసుబాబు, తంటికొండ దేవస్థానం చైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్న దొర, మండల టీడీపీ నాయకులు దాసరి సీతారామకృష్ణ, మండిగ గంగాధర్,నాగం వెంకటపతి, బొట్టా రామకృష్ణ,చింతల నాగు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

11వ రోజుకు చేరుకున్న విఆర్ఎ ల సమ్మె ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కి వినతి పత్రం అందజేత

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 26 : వీఆర్ఏ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి పిలుపు మేరకు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా 11 వ రోజు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, గోకవరం మండలాల వీఆర్ఏ లు సమ్మెను కొనసాగిస్తున్నారు. శనివారంకాకినాడ జిల్లా వి ఆర్ ఎ ల సంఘం అధ్యక్షులు నిడమర్తి సురేష్ఇశ్రాయేలు ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం లో గల నాలుగు మండలాలు జగ్గంపేట, గోకవరం, గండేపల్లి, కిర్లంపూడి మాడలాల వి ఆర్ ఎ లు జగ్గంపేట ఎమ్మార్వో కార్యాలయం నుండి రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించుకుంటూ వచ్చి జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో జగ్గంపేట మండలం అధ్యక్షులు ఇస్సాకు, గోకవరం అధ్యక్షులు సుబ్బారావు, గండేపల్లి అధ్యక్షులు శ్రీనివాస్, కిర్లంపూడి నుండి ప్రతాప్, దేవి, లక్ష్మి మరియు నియోజకవర్గం లో ఉన్న వి ఆర్ ఎ లు అందరూ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వీఆర్ఏ లు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా జీతం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వస్తున్న 10 వేల 500 రూపాయల జీతంతో నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో కుటుంబ పోషణ భారంగా మారిందని, అర్ధాకలితో పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. గత 10 రోజులుగా తహసిల్దార్ కార్యాలయాల వద్ద టెంట్లు వేసుకుని నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు.వారి ప్రధాన డిమాండ్లు: 1. వేతన సవరణ అమలు చేయాలి 2. నామినీ వీఆర్ఏ లను రెగ్యులర్ చేయాలి 3. అర్హత కలిగిన వీఆర్ఏ లకు పదోన్నతులు కల్పించాలి దీనిపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందిస్తూ మీ న్యాయమైన కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇస్సాకు, కార్యదర్శి మౌళి, పెద్దాపురం డివిజన్ ఉపాధ్యక్షులు చిట్టిబాబు, మండల జాయింట్ కార్యదర్శి ప్రభావతి, ఉపాధ్యక్షులు అర్జునుడు, మండల వీఆర్ఏ లు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

కష్టంలో ఉన్న కార్యకర్తలకు భరోసా జ్యోతుల నవీన్

కాకినాడ , కిర్లంపూడి,పున్నమి ప్రతినిధి , సెప్టెంబర్ 26: కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో పలు కుటుంబాలను కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ పరామర్శించారు.గ్రామంలో ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న గంధం ఫకీర్, అదేవిధంగా గుండె సర్జరీ చేయించుకున్న గంధం విష్ణు భార్యను కలిసి ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగాకోలుకోవాలనిఆకాంక్షించారు.ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలికి గాయమైన తుంగపల్లి శివను, లారీ ప్రమాదంలో కాళ్లకు తీవ్ర గాయాలై చికిత్స తీసుకుని ఇంటి వద్ద కోలుకుంటున్న టీడీపీ సీనియర్ కార్యకర్త ఎలుగుబంటి శ్రీనును పరామర్శించి ధైర్యం చెప్పారు. వైద్యానికి ఏ సహాయం కావాలన్నా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అనంతరం ఇటీవల భార్యను కోల్పోయిన అంకం గోవింద్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తామరాడ మాజీ సర్పంచ్, జగ్గంపేట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు అనుకూల శ్రీకాంత్, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి నీలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

జగ్గంపేటలో వరి రైతులకు భరోసా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 26: స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు వీటి రామారావు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిశారు. జగ్గంపేట మండలంలో వరదల వల్ల నీట మునిగిన పంట పొలాల పరిస్థితిపై ఇద్దరూ చర్చించారు.అనంతరం జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు వీటి రామారావు, మండల వ్యవసాయ అధికారి ఎస్ నరసింహంతో కలిసి కాట్రావులపల్లి, సీతానగరం, జగ్గంపేట గ్రామాల్లో నీట మునిగిన వరి పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతులకు కీలక సూచనలు చేశారు.నీరు తగ్గిన వెంటనే వరి పొలాల్లో ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని లేదా పొటాషియం స్ప్రే చేస్తే పంటను కొంతవరకు కాపాడుకోవచ్చు. మునిగిన వరి వెంటనే తేరుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని, రైతులు ఆలస్యం చేయకుండా పిచికారీ చేయాలని సూచించారు. పూర్తిగా దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, పంట నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.దీనికోసం రెండు మూడు రోజుల్లో ప్రత్యేక కమిటీలను వేసి, క్షేత్ర స్థాయిలో పూర్తి సర్వే చేసి, తుది జాబితాను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు.ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ*, వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని, అధికారులతో సమన్వయం చేసుకుని నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని, రైతులు అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు.ఇప్పటివరకు మండలంలో 2360 ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగి ఉన్నట్లు అంచనా వేసినట్లు మండల వ్యవసాయ అధికారి తెలిపారు.ఈ కార్యక్రమంలో జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భారత్, ఏఈఓ చంద్రమౌళి, ఏఈఓ బలరాం, గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

జగ్గంపేటలో కూటమికి మరింత బలం

కాకినాడ, జగ్గంపేట పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 26: రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జనసేన నాయకుడు జోకా శ్రీనివాస్ విజయ్ కుమార్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను, కాకినాడ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది జోకా శ్రీనివాస్ విజయ్ కుమార్ ఇటీవల పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ అంశాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి మరింత బలోపేతం కావాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగరాలని, ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని విజయ్ కుమార్ కు సూచించారు.జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ, రాజుపాలెం లాంటి గ్రామాల నుండి విద్యావంతులు, న్యాయవాదులు జనసేన, తెలుగుదేశం కూటమిలోకి రావడం శుభ పరిణామమని, కూటమి ఐక్యతతో ముందుకు వెళితే ఎన్ని ఎన్నికలైనా విజయం సాధించడం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజుపాలెం మాజీ సర్పంచ్ గంధం ఈశ్వరరావు, మాజీ ఎంపిటిసి, మండల తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి గోడే దొరబాబు, కణిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ఎన్నాళ్లీ కష్టాలు మురుగునీటితో ప్రయాణం

జగ్గంపేట మండలం, మామిడాడ, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 25 జగ్గంపేట మండలం మామిడాడు విలేజ్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది ఎక్కడ చూసినా మురిగినీటితో కూలిపోయిన డ్రైనేజీలు ఒకచోట డ్రైనేజీ లేక ఇబ్బంది మరో చోట డ్రైనేజీ ఉండి ఇబ్బంది అలాగే డ్రైనేజీ ఉన్న పారని నీరు ఈగలు దోమలతో అంటువ్యాధులు సోకే విధంగా ఊర్లో ఉన్న డ్రైనేజీలు అలాగే మెయిన్ రోడ్డు పొడవునా పారుతున్న నీరు బురద నీట్లోంచి వీధుల్లోకి వెళ్తున్న జనం పట్టించుకోని ప్రత్యేక అధికారులు పంచాయతీ సిబ్బంది ఎన్నిసార్లు చెప్పినా వస్తారు చూస్తారు తప్ప ఈ మురుగునీరు పోయే ప్రయత్నం చేయరు ఎలాగైతే గ్రామ ప్రజలు రోగాల బాట పట్టవలసింది ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీలను అలాగే వీధి రోడ్లోకెళ్లే నీళ్లను శుభ్రం చేయిస్తారని ప్రజలు కోరుకుంటున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.