కాకినాడ , జగంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 26:
సభ్యులందరూ స్నేహపూర్వకమైన వాతావరణంలో ముందుకు సాగాలని గోకవరం ప్రెస్ క్లబ్ సభ్యులకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించారు. గోకవరం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పడిన నేపథ్యంలో శనివారం నాడు ది. గోకవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంగరపు రాజు, ప్రధాన కార్యదర్శి కర్రి శివరామకృష్ణ అధ్యక్షతన సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మర్యాదపూర్వకంగా జగ్గంపేట రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు అందించారు. గోకవరం మండల పెద్దలతో ప్రెస్ క్లబ్ అభివృద్ధికి పలు సూచనలను ఎమ్మెల్యేకే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ జర్నలిజం వృత్తిలో ప్రతి ఒక్కరు రాణించాలని, నియోజవర్గ స్థాయిలో ఉన్న రిపోర్టర్లు జిల్లా స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. నాయకులు, పెద్దలు మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు అభ్యర్థుల మేరకు ప్రెస్ క్లబ్ అభివృద్ధికి సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపి కార్యదర్శి కన్నబాబు, జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్ కుమార్,టీడీపీ రాష్ట్ర నాయకులు ఎస్ వి ఎస్ అప్పలరాజు, రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు,మాజీ సొసైటీ చైర్మన్ దాసరి తమ్మన్న దొర, జగ్గంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జనపరెడ్డి బాబు,మాజీ జడ్పీటీసీ పాలూరి బోసుబాబు, తంటికొండ దేవస్థానం చైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్న దొర, మండల టీడీపీ నాయకులు దాసరి సీతారామకృష్ణ, మండిగ గంగాధర్,నాగం వెంకటపతి, బొట్టా రామకృష్ణ,చింతల నాగు తదితరులు పాల్గొన్నారు.


