వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో నివాళులర్పించిన ఆదివాసీ కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ వీరనారి, సామాజిక విప్లవ ప్రతీక చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్.ఎస్.యు.ఐ (NSUI) ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షుడు బండిరాల కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ కూరాకుల మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కూరాకుల మల్లికార్జున్ మాట్లాడుతూ… “నా భూమి.. నా పంట.. నా హక్కు” అంటూ నాటి దొరలు, నిజాం రజాకార్ల అరాచకాలపై ఎదురొడ్డి నిలిచిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె ప్రదర్శించిన సాహసం, ధైర్యం నేటి సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకమని పేర్కొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం కేవలం ఒక వర్గానికి మాత్రమే కాకుండా, అణచివేతకు గురైన యావత్ ప్రజానీకానికి చైతన్య దీప్తిగా నిలిచిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షుడు పోలేపాక అంజయ్య, శ్రీనివాస్, లింగం, మల్లేష్, రమేష్, రహీముద్దీన్, కాంతారావు, గణేష్, కృష్ణ నాయక్, భాను, కృష్ణ, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట పటిమ సమాజానికి మార్గదర్శకం: కూరాకుల మల్లికార్జున్
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో నివాళులర్పించిన ఆదివాసీ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ వీరనారి, సామాజిక విప్లవ ప్రతీక చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్.ఎస్.యు.ఐ (NSUI) ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షుడు బండిరాల కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ కూరాకుల మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కూరాకుల మల్లికార్జున్ మాట్లాడుతూ… “నా భూమి.. నా పంట.. నా హక్కు” అంటూ నాటి దొరలు, నిజాం రజాకార్ల అరాచకాలపై ఎదురొడ్డి నిలిచిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె ప్రదర్శించిన సాహసం, ధైర్యం నేటి సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకమని పేర్కొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం కేవలం ఒక వర్గానికి మాత్రమే కాకుండా, అణచివేతకు గురైన యావత్ ప్రజానీకానికి చైతన్య దీప్తిగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షుడు పోలేపాక అంజయ్య, శ్రీనివాస్, లింగం, మల్లేష్, రమేష్, రహీముద్దీన్, కాంతారావు, గణేష్, కృష్ణ నాయక్, భాను, కృష్ణ, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

