శ్రీ కాళహస్తి, మే 17 (పున్నమి టెంపుల్ న్యూస్): ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతలను మరింత బలోపేతం చేసే దిశగా శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేట శీతలాంబ ఆలయం సమీపంలో నూతనంగా నిర్మించిన రెండో పట్టణ (టూటౌన్) పోలీస్ స్టేషన్ భవనాన్ని నేడు ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నరసింహమూర్తి వివరాలు వెల్లడించారు. శ్రీకాళహస్తి పట్టణ జనాభా, విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు వేగవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు అత్యాధునిక వసతులతో ఈ భవనాన్ని ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభంతో ఫిర్యాదుల స్వీకరణ, స్పందన మరింత వేగంగా ఉండటంతో పాటు నేరాల నియంత్రణలో కూడా సమర్థవంతమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని డీఎస్పీ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వన్‌టౌన్ సీఐ నాగరాజు తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

రాష్ట్ర హోంమంత్రిచే నేడు టూటౌన్ పోలీస్ స్టేషన్ ప్రారంభం