శ్రీ కాళహస్తి, మే 17 (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తి పట్టణ వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ సీనియర్ నాయకుడు గయాజ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆదివారం పట్టణంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గయాజ్ సేవలను స్మరించుకుంటూ పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె కాటంరెడ్డి పవిత్ర రెడ్డి హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గయాజ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గయాజ్ ప్రజాసేవ, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత చిరస్మరణీయమని పేర్కొన్నారు. అన్నదాన కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు, మైనార్టీ నాయకులు పాల్గొని భక్తులకు, పేదలకు భోజనాలు పంపిణీ చేశారు. గయాజ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారని పలువురు నాయకులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాషా, మైనార్టీ సెల్ అధ్యక్షుడు పఠాన్ ఫరీద్, ఫజల్, మునిరెడ్డి, రామచంద్రారెడ్డి, లీల, పెరుమాళ్ చౌదరి, జబ్బార్, ఆరిఫ్, అబ్బాస్, ఫయాజ్, అస్లాం, రెహమాన్, కామీ వెంకటేశ్వర్లు, మురళి యాదవ్, మున్నా రాయల్ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్సీపీ నేత ప్రథమ వర్ధంతిలో పాల్గొన్న కాటంరెడ్డి పవిత్ర రెడ్డి