Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

బిక్కవోలు మండల బీజేపీ అధ్యక్షుడిగా చిన్నం వీర రాఘవరెడ్డి.. సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నల్లమిల్లి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బిక్కవోలు మండల బీజేపీ అధ్యక్షుడిగా చిన్నం వీర రాఘవరెడ్డి.. సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నల్లమిల్లి

వార్త ముఖ్యాంశాలు

  • బిక్కవోలు, జూలై 1 ( పున్నమి ప్రతినిధి ): బిక్కవోలు మండల బీజేపీ అధ్యక్షుడిగా చిన్నం వీర రాఘవరెడ్డి నియమితులైన సందర్భంగా మంగళవారం పందలపాకలో జరిగిన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయనను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి నూతన మండల అధ్యక్షుడు సమర్థవంతంగా పనిచేసి, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
  • చిన్నం వీర రాఘవరెడ్డికి అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని అభినందనలు తెలిపారు.

బిక్కవోలు, జూలై 1 ( పున్నమి ప్రతినిధి ): బిక్కవోలు మండల బీజేపీ అధ్యక్షుడిగా చిన్నం వీర రాఘవరెడ్డి నియమితులైన సందర్భంగా మంగళవారం పందలపాకలో జరిగిన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయనను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి నూతన మండల అధ్యక్షుడు సమర్థవంతంగా పనిచేసి, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. చిన్నం వీర రాఘవరెడ్డికి అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్.కె. రాజు, అనపర్తి నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి రజని, బిక్కవోలు మండల బీజేపీ ఇన్‌చార్జి హేమ తులసి, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గిరాడ గంగా భవాని, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి హెచ్‌డీఎస్ సభ్యుడు రవిశంకర్, బిక్కవోలు మండల కూటమి నాయకులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొని నూతన మండల అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు.

బిక్కవోలు మండల బీజేపీ అధ్యక్షుడిగా చిన్నం వీర రాఘవరెడ్డి.. సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నల్లమిల్లి

బిక్కవోలు మండల బీజేపీ అధ్యక్షుడిగా చిన్నం వీర రాఘవరెడ్డి.. సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నల్లమిల్లి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *