Thursday, 6 August 2026
  • Home  
  • గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు నిధులు కోరిన ఎమ్మెల్యే ముప్పిడి
- తూర్పు గోదావరి

గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు నిధులు కోరిన ఎమ్మెల్యే ముప్పిడి

పున్నమి ప్రతినిధి – తాళ్లపూడి ఆగష్టు 6: రానున్న గోదావరి పుష్కరాలు–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు కొవ్వూరు నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను త్వరితగతిన మంజూరు చేయాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి N. Chandrababu Naiduను ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పుష్కరాల దృష్ట్యా చేపట్టాల్సిన మౌలిక వసతుల అభివృద్ధి, ఘాట్‌ల ఆధునీకరణ, రహదారుల మెరుగుదల, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ఇతర ప్రజా సౌకర్యాలకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి సమర్పించారు. పుష్కరాల నాటికి నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రిని కోరారు. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.