ఏర్పేడు ఆగస్టు 06 పున్నమిప్రతినిధి
ఏర్పేడు వ్యాసాశ్రమం వివాదంపై కలెక్టర్ వెంకటేశ్వర్, SP సుబ్బారాయుడు ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఇరువర్గాలతో చర్చలు జరిగాయి. సమావేశానికి పలువురు పీఠాధిపతులు, ఆశ్రమ పూర్వ విద్యార్థులు, భక్తులు హాజరయ్యారు. ఆశ్రమాన్ని భక్తులకు దూరం చేస్తున్నారని, ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని పూర్వ విద్యార్థులు ఆరోపించారు. ప్రస్తుత పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి ఆశ్రమంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని స్పష్టం చేశారు.

