ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాం పాలన నుంచి విముక్తి కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను, స్వాతంత్ర్య సమరయోధుల ధైర్యసాహసాలను స్మరించుకోవాలని అన్నారు. వీరుల త్యాగం మరువలేనిదని, వారి పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం ప్రజల జీవితాల్లో ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అభివృద్ధి చెందిన ఐక్య తెలంగాణ నిర్మాణానికి తమ వంతు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రుద్ర ప్రదీప్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మంద సరస్వతి, ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు వెంకటనారాయణ, ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవరావు, మేకల నాగేందర్, గుత్త వెంకటేశ్వర్లు, అంజయ్య, శ్రీరామనేని మణి, భూక్యా శ్యామ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రేఖ సత్యనారాయణ, అనంత ఉపేందర్, నక్క రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


