నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 17 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్ : ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన నిర్మల్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు గాజుల రవికుమార్ గారిని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ గారు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ పరామర్శ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జనరల్ సెక్రటరీ సీ.హెచ్.వినోద్ కుమార్, ట్రెజరర్ అబ్దుల్ సాధిక్, తదితరులు పాల్గొన్నారు.

