Monday, 28 September 2026
  • Home  
  • కార్యకర్తలే టీడీపీకి వెన్నెముక… – పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.. ఎమ్మెల్సీ పేరాబత్తుల,జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, అబ్జర్వర్ గన్ని.. -అట్టహాసంగా పిల్లి ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కార్యకర్తలే టీడీపీకి వెన్నెముక… – పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.. ఎమ్మెల్సీ పేరాబత్తుల,జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, అబ్జర్వర్ గన్ని.. -అట్టహాసంగా పిల్లి ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ

కాకినాడ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 28(పున్నమి న్యూస్):తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ రూరల్ నియోజకవర్గ అబ్జర్వర్ గన్ని కృష్ణ,కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు.పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని సూచించారు. వాకలపూడి మహాలక్ష్మి నగర్‌లోని పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి నివాసం వద్ద సోమవారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ఆత్మీయ అభినందన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా, నియోజక వర్గం,కాకినాడ రూరల్, కరప మండలాలకు చెందిన పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు,కమిటీ సభ్యులను సన్మానించారు.పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు మై టీడీపీ యాప్‌ను ప్రతి కార్యకర్త వినియోగించాలని నాయకులు సూచించారు.పార్టీ కార్యక్రమాలు, ప్రజలతో నిర్వహించే కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారం తదితర వివరాలను యాప్‌లో నమోదు చేయడం ద్వారా పార్టీ కార్యకలాపాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లవచ్చని వివరించారు. ప్రతి కార్యకర్త యాప్ వినియోగంపై అవగాహన పెంచుకుని,పార్టీ సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కోరారు.పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని,ప్రతి కార్యకర్త కష్టించి పనిచేస్తేనే పార్టీ కార్యక్రమాలు విజయవంతమవుతాయని నాయకులు పేర్కొన్నారు.గ్రామ, మండల స్థాయిలో ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచించారు.పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై నాయకులు దిశానిర్దేశం చేశారు.బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించాలని,అనుబంధ విభాగాలు చురుగ్గా పనిచేస్తూ యువత,మహిళలు,బీసీలు, వివిధ వర్గాలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు.పార్టీ అధిష్ఠానం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ టీడీపీ అధ్యక్షుడు కాళ్ల శ్రీనివాస్, కరప మండల అధ్యక్షుడు మద్దూరి వీవీఎస్ స్వామి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పిల్లి రాధాకృష్ణ, ప్రధానకార్యదర్శి ఎలాగ లోవరాజు,బీసీ సెల్ అధ్యక్షుడు కొమిరిశెట్టి నరసింగరావు, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు సుధీర్‌తో పాటు కాకినాడ రూరల్,కరప మండలాల అనుబంధ సంఘాల అధ్యక్షులు,కార్యదర్శులు,కమిటీ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా,వివిధ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్స్,క్లస్టర్ లు, యూనిట్,బూత్ పార్టీ నాయకులు,గ్రామ కమిటీ అధ్యక్షులు,కార్యదర్శులు ,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశం విజయవంతం చేశారు.

కాకినాడ జిల్లా
ప్రతినిధి,సెప్టెంబర్ 28(పున్నమి న్యూస్):తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ రూరల్ నియోజకవర్గ అబ్జర్వర్ గన్ని కృష్ణ,కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు.పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని సూచించారు.
వాకలపూడి మహాలక్ష్మి నగర్‌లోని పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి నివాసం వద్ద సోమవారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ఆత్మీయ అభినందన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా, నియోజక వర్గం,కాకినాడ రూరల్, కరప మండలాలకు చెందిన పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు,కమిటీ సభ్యులను సన్మానించారు.పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు మై టీడీపీ యాప్‌ను ప్రతి కార్యకర్త వినియోగించాలని నాయకులు సూచించారు.పార్టీ కార్యక్రమాలు, ప్రజలతో నిర్వహించే కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారం తదితర వివరాలను యాప్‌లో నమోదు చేయడం ద్వారా పార్టీ కార్యకలాపాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లవచ్చని వివరించారు. ప్రతి కార్యకర్త యాప్ వినియోగంపై అవగాహన పెంచుకుని,పార్టీ సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కోరారు.పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని,ప్రతి కార్యకర్త కష్టించి పనిచేస్తేనే పార్టీ కార్యక్రమాలు విజయవంతమవుతాయని నాయకులు పేర్కొన్నారు.గ్రామ, మండల స్థాయిలో ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచించారు.పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై నాయకులు దిశానిర్దేశం చేశారు.బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించాలని,అనుబంధ విభాగాలు చురుగ్గా పనిచేస్తూ యువత,మహిళలు,బీసీలు, వివిధ వర్గాలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు.పార్టీ అధిష్ఠానం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ
కార్యక్రమంలో కాకినాడ రూరల్ టీడీపీ అధ్యక్షుడు కాళ్ల శ్రీనివాస్, కరప మండల అధ్యక్షుడు మద్దూరి వీవీఎస్ స్వామి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పిల్లి రాధాకృష్ణ, ప్రధానకార్యదర్శి ఎలాగ లోవరాజు,బీసీ సెల్ అధ్యక్షుడు కొమిరిశెట్టి నరసింగరావు, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు సుధీర్‌తో పాటు కాకినాడ రూరల్,కరప మండలాల అనుబంధ సంఘాల అధ్యక్షులు,కార్యదర్శులు,కమిటీ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా,వివిధ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్స్,క్లస్టర్ లు, యూనిట్,బూత్ పార్టీ నాయకులు,గ్రామ కమిటీ అధ్యక్షులు,కార్యదర్శులు ,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశం విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.