Saturday, 26 September 2026
  • Home  
  • జగ్గంపేటలో వరి రైతులకు భరోసా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
- తూర్పు గోదావరి

జగ్గంపేటలో వరి రైతులకు భరోసా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 26: స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు వీటి రామారావు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిశారు. జగ్గంపేట మండలంలో వరదల వల్ల నీట మునిగిన పంట పొలాల పరిస్థితిపై ఇద్దరూ చర్చించారు.అనంతరం జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు వీటి రామారావు, మండల వ్యవసాయ అధికారి ఎస్ నరసింహంతో కలిసి కాట్రావులపల్లి, సీతానగరం, జగ్గంపేట గ్రామాల్లో నీట మునిగిన వరి పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతులకు కీలక సూచనలు చేశారు.నీరు తగ్గిన వెంటనే వరి పొలాల్లో ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని లేదా పొటాషియం స్ప్రే చేస్తే పంటను కొంతవరకు కాపాడుకోవచ్చు. మునిగిన వరి వెంటనే తేరుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని, రైతులు ఆలస్యం చేయకుండా పిచికారీ చేయాలని సూచించారు. పూర్తిగా దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, పంట నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.దీనికోసం రెండు మూడు రోజుల్లో ప్రత్యేక కమిటీలను వేసి, క్షేత్ర స్థాయిలో పూర్తి సర్వే చేసి, తుది జాబితాను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు.ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ*, వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని, అధికారులతో సమన్వయం చేసుకుని నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని, రైతులు అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు.ఇప్పటివరకు మండలంలో 2360 ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగి ఉన్నట్లు అంచనా వేసినట్లు మండల వ్యవసాయ అధికారి తెలిపారు.ఈ కార్యక్రమంలో జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భారత్, ఏఈఓ చంద్రమౌళి, ఏఈఓ బలరాం, గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 26:

స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు వీటి రామారావు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిశారు. జగ్గంపేట మండలంలో వరదల వల్ల నీట మునిగిన పంట పొలాల పరిస్థితిపై ఇద్దరూ చర్చించారు.అనంతరం జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు వీటి రామారావు, మండల వ్యవసాయ అధికారి ఎస్ నరసింహంతో కలిసి కాట్రావులపల్లి, సీతానగరం, జగ్గంపేట గ్రామాల్లో నీట మునిగిన వరి పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు రైతులకు కీలక సూచనలు చేశారు.నీరు తగ్గిన వెంటనే వరి పొలాల్లో ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని లేదా పొటాషియం స్ప్రే చేస్తే పంటను కొంతవరకు కాపాడుకోవచ్చు. మునిగిన వరి వెంటనే తేరుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని, రైతులు ఆలస్యం చేయకుండా పిచికారీ చేయాలని సూచించారు. పూర్తిగా దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, పంట నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.దీనికోసం రెండు మూడు రోజుల్లో ప్రత్యేక కమిటీలను వేసి, క్షేత్ర స్థాయిలో పూర్తి సర్వే చేసి, తుది జాబితాను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు.ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ*, వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని, అధికారులతో సమన్వయం చేసుకుని నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని, రైతులు అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు.ఇప్పటివరకు మండలంలో 2360 ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగి ఉన్నట్లు అంచనా వేసినట్లు మండల వ్యవసాయ అధికారి తెలిపారు.ఈ కార్యక్రమంలో జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భారత్, ఏఈఓ చంద్రమౌళి, ఏఈఓ బలరాం, గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.