Saturday, 26 September 2026
  • Home  
  • సామాజిక సేవతో కూడిన పుట్టినరోజు వేడుకలు ఆదర్శనీయం: మంథని సీఐ బుద్దే స్వామి
- పెద్దపల్లి

సామాజిక సేవతో కూడిన పుట్టినరోజు వేడుకలు ఆదర్శనీయం: మంథని సీఐ బుద్దే స్వామి

మంథని, సెప్టెంబర్ 26 పుట్టినరోజు వేడుకలను కేక్‌ కటింగ్‌లు, ఆర్భాటాలకు పరిమితం చేయకుండా నిరుపేదలకు అండగా నిలిచేలా నిర్వహించడం అభినందనీయమని మంథని సీఐ బుద్దే స్వామి అన్నారు. మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన తాటి విజయ్ కుమార స్వామి–నిహారిక దంపతులు తమ కుమారుడు తాటి సాయివర్ధన్ (టిల్లు) పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.తాటి సాయివర్ధన్ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన ఐదు నిరుపేద కుటుంబాలకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను మంథని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో పంపిణీ చేశారు. మంథని సీఐ బుద్దే స్వామి, ఎస్‌ఐ సందీప్ కుమార్ తమ చేతుల మీదుగా లబ్ధిదారులకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా సీఐ బుద్దే స్వామి, ఎస్‌ఐ సందీప్ కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో కష్టాల్లో ఉన్న నిరుపేదలను ఆదుకోవడం గొప్ప విషయమన్నారు. పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా సమాజానికి మంచి సందేశం అందుతుందని పేర్కొన్నారు. సాయివర్ధన్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం సాయివర్ధన్ తండ్రి తాటి విజయ్ కుమార స్వామి మాట్లాడుతూ.. తమ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు సహాయం చేయడం ద్వారా లభించే తృప్తి ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ప్రతి ఒక్కరూ తమకు తోచినంత మేర పేదలకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.*సామాజిక సేవలో ముందుండే విజయ్ కుమార స్వామి*తాటి విజయ్ కుమార స్వామి మంథని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహిస్తూ తన వంతుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యువతకు, సమాజానికి ఉపయోగపడే సందేశాలను అందించే విధంగా వివిధ రకాల సామాజిక అవగాహన రీల్స్ రూపొందిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. సామాజిక ప్రయోజనంతో కూడిన ఆయన రీల్స్‌కు పలువురు అభిమానులు, యువత నుంచి అభినందనలు లభిస్తున్నాయి. ఇదే స్ఫూర్తితో తన కుమారుడి పుట్టినరోజును కూడా సేవా కార్యక్రమంగా నిర్వహించడం పలువురి ప్రశంసలు అందుకుంది.ఈ కార్యక్రమంలో యువకులు, పోలీసు సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొని సాయివర్ధన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన తాటి విజయ్ కుమార స్వామి–నిహారిక దంపతులను అభినందించారు.

మంథని, సెప్టెంబర్ 26

పుట్టినరోజు వేడుకలను కేక్‌ కటింగ్‌లు, ఆర్భాటాలకు పరిమితం చేయకుండా నిరుపేదలకు అండగా నిలిచేలా నిర్వహించడం అభినందనీయమని మంథని సీఐ బుద్దే స్వామి అన్నారు. మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన తాటి విజయ్ కుమార స్వామి–నిహారిక దంపతులు తమ కుమారుడు తాటి సాయివర్ధన్ (టిల్లు) పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.తాటి సాయివర్ధన్ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన ఐదు నిరుపేద కుటుంబాలకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను మంథని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో పంపిణీ చేశారు. మంథని సీఐ బుద్దే స్వామి, ఎస్‌ఐ సందీప్ కుమార్ తమ చేతుల మీదుగా లబ్ధిదారులకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా సీఐ బుద్దే స్వామి, ఎస్‌ఐ సందీప్ కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో కష్టాల్లో ఉన్న నిరుపేదలను ఆదుకోవడం గొప్ప విషయమన్నారు. పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా సమాజానికి మంచి సందేశం అందుతుందని పేర్కొన్నారు. సాయివర్ధన్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం సాయివర్ధన్ తండ్రి తాటి విజయ్ కుమార స్వామి మాట్లాడుతూ.. తమ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు సహాయం చేయడం ద్వారా లభించే తృప్తి ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ప్రతి ఒక్కరూ తమకు తోచినంత మేర పేదలకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.*సామాజిక సేవలో ముందుండే విజయ్ కుమార స్వామి*తాటి విజయ్ కుమార స్వామి మంథని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహిస్తూ తన వంతుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యువతకు, సమాజానికి ఉపయోగపడే సందేశాలను అందించే విధంగా వివిధ రకాల సామాజిక అవగాహన రీల్స్ రూపొందిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. సామాజిక ప్రయోజనంతో కూడిన ఆయన రీల్స్‌కు పలువురు అభిమానులు, యువత నుంచి అభినందనలు లభిస్తున్నాయి. ఇదే స్ఫూర్తితో తన కుమారుడి పుట్టినరోజును కూడా సేవా కార్యక్రమంగా నిర్వహించడం పలువురి ప్రశంసలు అందుకుంది.ఈ కార్యక్రమంలో యువకులు, పోలీసు సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొని సాయివర్ధన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన తాటి విజయ్ కుమార స్వామి–నిహారిక దంపతులను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.