
★ మరిపెడ లో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు
■ మరిపెడ, సెప్టెంబర్ 26:
మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన ఒంటికొమ్ము అప్పారెడ్డి గారి మాతృమూర్తి సుశీల గారు మృతి చెందగా, శనివారం మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు వారి నివాసానికి చేరుకొని సుశీల గారి భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు
◆ అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
◆ అదేవిధంగా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన ముదిరెడ్డి లక్ష్మారెడ్డి గారి మాతృమూర్తి, నరేష్ రెడ్డి గారి నాయనమ్మ కమలమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు, ఈ సందర్భంగా వారి నివాసానికి చేరుకున్న సత్యవతి రాథోడ్ గారు కమలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం లక్ష్మారెడ్డి, నరేష్ రెడ్డిలను పరామర్శించి మనోధైర్యం కల్పించారు
● ఈ కార్యక్రమాల్లో మాజీ ఓడీఎస్ఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, బొడ శ్రీను నాయక్, కొంపల్లి వేణుగోపాల్ రెడ్డి,కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

