కాకినాడ , కిర్లంపూడి,పున్నమి ప్రతినిధి , సెప్టెంబర్ 26:
కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో పలు కుటుంబాలను కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ పరామర్శించారు.గ్రామంలో ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న గంధం ఫకీర్, అదేవిధంగా గుండె సర్జరీ చేయించుకున్న గంధం విష్ణు భార్యను కలిసి ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగాకోలుకోవాలనిఆకాంక్షించారు.ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలికి గాయమైన తుంగపల్లి శివను, లారీ ప్రమాదంలో కాళ్లకు తీవ్ర గాయాలై చికిత్స తీసుకుని ఇంటి వద్ద కోలుకుంటున్న టీడీపీ సీనియర్ కార్యకర్త ఎలుగుబంటి శ్రీనును పరామర్శించి ధైర్యం చెప్పారు. వైద్యానికి ఏ సహాయం కావాలన్నా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అనంతరం ఇటీవల భార్యను కోల్పోయిన అంకం గోవింద్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తామరాడ మాజీ సర్పంచ్, జగ్గంపేట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు అనుకూల శ్రీకాంత్, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి నీలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.


