Tuesday, 29 September 2026
  • Home  
  • తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ
- వరంగల్

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక వంటి వాడని గౌడ జన హక్కుల పోరాటసమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు. హనుమకొండ లోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111 వ జయంతి కార్యక్రమం ఆదివారం జరిగింది.ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్బంగా మోకుదెబ్బ రమేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన బాపూజీ ప్రతి అడుగులో ఒక త్యాగం ఉందన్నారు.తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడన్నారు.ప్రజల హక్కుల కోసం ఎత్తిన ప్రతి గొంతులో ఒక స్ఫూర్తి ఉందన్నారు.ఆ స్ఫూర్తికి నిలువెత్తు రూపమె కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు.అధికారం చేతిలో ఉన్నా ప్రజల కోసం పోరాడన్నారు.అధికారం దూరమైనా ఆశయాన్ని మాత్రం వీడలేదన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ ఆకాంక్షను గుండెల్లో మోస్తూ చివరి వరకు పోరాట పథంలోనే నడిచారన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తన ఇంటిని ఉద్యమం కోసం ఇచ్చిన దాత బాపూజీ ప్రేమ మన గుండెల్లో ఎప్పటికీ ఉంటుందన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడమే కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్బంగా మనమిచ్చే నిజ మైన నివాళి అని రమేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ నాయకులు బండారి జనార్దన్ గౌడ్,గడ్డం కేశవ మూర్తి, తిరునహరి శేషు,నరేందర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక వంటి వాడని గౌడ జన హక్కుల పోరాటసమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు. హనుమకొండ లోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111 వ జయంతి కార్యక్రమం ఆదివారం జరిగింది.ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్బంగా మోకుదెబ్బ రమేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన బాపూజీ ప్రతి అడుగులో ఒక త్యాగం ఉందన్నారు.తెలంగాణ కోసం
తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడన్నారు.ప్రజల హక్కుల కోసం ఎత్తిన ప్రతి గొంతులో ఒక స్ఫూర్తి ఉందన్నారు.ఆ స్ఫూర్తికి నిలువెత్తు రూపమె కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు.అధికారం చేతిలో ఉన్నా
ప్రజల కోసం పోరాడన్నారు.అధికారం దూరమైనా ఆశయాన్ని మాత్రం వీడలేదన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ ఆకాంక్షను గుండెల్లో మోస్తూ చివరి వరకు పోరాట పథంలోనే నడిచారన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తన ఇంటిని ఉద్యమం కోసం ఇచ్చిన దాత బాపూజీ ప్రేమ మన గుండెల్లో ఎప్పటికీ ఉంటుందన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడమే కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్బంగా మనమిచ్చే నిజ
మైన నివాళి అని రమేష్ గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌడ నాయకులు బండారి జనార్దన్ గౌడ్,గడ్డం కేశవ మూర్తి, తిరునహరి శేషు,నరేందర్,
వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.