Sunday, 27 September 2026
  • Home  
  • ఉదయగిరి : ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సమాన విద్యావకాశాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి : ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సమాన విద్యావకాశాలు

ఉదయగిరి: ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు ఇతర విద్యార్థులతో సమానంగా విద్యావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎంఈఓ శ్రీనివాసులు తెలిపారు. 6 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల ప్రత్యేక అవసరాల విద్యార్థుల వివరాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా SHVR యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, రవాణా చార్జీలు, అవసరమైన విద్యా కిట్లు అందజేస్తామని పేర్కొన్నారు. అలాగే మార్కులు, హాజరు విషయంలో నిబంధనల మేరకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థి విద్యకు దూరం కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అర్హులైన విద్యార్థుల వివరాలను సకాలంలో నమోదు చేసి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.