Thursday, 1 October 2026

Tag: జగ్గంపేట

తూర్పు గోదావరి

ఇరుపాక శివకేశవుల క్షేత్ర అభివృద్ధికి మహాప్రాణాలిక – తొలి సమావేశం లోనే సంచలన నిర్ణయాలు ప్రకటించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 2:* జగ్గంపేట మండలం ఇర్రిపాక ఏలేరు నది తీరాన కొలువుదీరిన శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్ల శివకేశవుల క్షేత్ర అభివృద్ధి కమిటీ తొలి సమావేశం ఘనంగా జరిగింది.అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల మణమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నూతన కమిటీ సభ్యుల పరిచయ కార్యక్రమం నిర్వహించి, అనంతరం స్వామివార్ల దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా చైర్మన్ జ్యోతుల మణమ్మ మాట్లాడుతూ శివకేశవుల క్షేత్రానికి చైర్మన్ గా నియమించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, కమిటీ సభ్యులందరి సహకారంతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు.అనంతరం జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఇర్రిపాక శివకేశవుల క్షేత్రాన్ని దక్షిణ భారతదేశంలోనే ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో 45 మంది సభ్యులతో అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కమిటీ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.అందులో భాగంగా ఈ నెల 4వ తేదీన ఎమ్మెల్యే నెహ్రూ , చైర్మన్ జ్యోతుల మణమ్మ ఆధ్వర్యంలో అష్టలక్ష్మీ సమేత లక్ష్మీ నారాయణుడు ఆలయ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తామని, 5వ తేదీన విశ్వహిందూ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు చేతుల మీదుగా అయోధ్య రామమందిరాన్ని పోలిన నూతన రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నామని ప్రకటించారు. అదేవిధంగా కోటి రాతి శివలింగాలతో కోటిలింగేశ్వర క్షేత్రాన్ని ఇక్కడే ప్రతిష్టించేందుకు మహత్తర ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, ఇది కార్యరూపం దాల్చితే ఈ కమిటీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ సమగ్ర అభివృద్ధి, ఏలేరు నది తీర సుందరీకరణ, ధూప దీప నైవేద్యాలకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ సేవలు

*పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా డొక్కా సీతమ్మ కాంటీన్ సేవలుపవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని అన్నదాన కార్యక్రమం-తుమ్మలపల్లి రమేష్* కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 01: పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జగ్గంపేట టౌన్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ కాంటీన్ సేవా కార్యక్రమం ఈ వారం కూడా కొనసాగింది.జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా ప్రతి మంగళవారం సుమారు 500 మంది పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చును తుమ్మలపల్లి రమేష్ తన సొంత నిధులతో సమకూరుస్తున్నారు.ఈ వారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో తుమ్మలపల్లి రమేష్ స్వయంగా పాల్గొని పేదలకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు కడుపునిండా అన్నం పెట్టడం తనకు ఎంతో సంతృప్తినిచ్చే విషయమని అన్నారు.డొక్కా సీతమ్మ గారి సేవా స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాం. పేదలు ఆకలితో ఉండకూడదన్నదే మా సంకల్పం. రెండేళ్లుగా ప్రతి మంగళవారం కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా నిరంతరాయంగా కొనసాగిస్తాం” అని తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వారం వందలాది మంది పేదలకు ఉచితంగా భోజనం అందుతుండటంతో స్థానికులు, లబ్ధిదారులు తుమ్మలపల్లి రమేష్ సేవలను అభినందించారు.ఈ కార్యక్రమం లో సూరంపాలెం బాలు, మాదారపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరావు,గాది నాగరాజు, డ్రిల్ మాస్టారు, కాయల మణికంఠ, గోకేడ ప్రసాద్,గుంటముక్కల చిన్న, ఓంకార్, స్వామి pspk,కొలమూరు బుజ్జి, వీర మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

తూర్పు గోదావరి

ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

*కాండ్రేగులలో పండగలా పింఛన్ల పంపిణీ – లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ* కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,: సెప్టెంబర్ ఒకటి1: జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జగ్గంపేట శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి లబ్ధిదారుడిని ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే పేదలకు నిజమైన భరోసా దక్కిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ కోసం లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడితే, కూటమి ప్రభుత్వం వచ్చాక 1వ తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నిర్ణయంతో రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా పింఛన్లు పెంచి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వృద్ధులు, వితంతువులకు నెలకు 4000 రూపాయలు, దివ్యాంగులకు నెలకు 6000 రూపాయలు, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి నెలకు 15,000 రూపాయలు, కిడ్నీ, లివర్, తలసేమియా తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల చొప్పున దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు అందిస్తున్నామని, ఇది చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఈ పింఛన్ కేవలం డబ్బు కాదు, ఆత్మగౌరవం అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ రామిశెట్టి చందర్రావు, య ల్లపు దొరబాబు, ఎంపీడీవో చంద్రశేఖర్, డిప్యూటీ ఎండిఓ శ్రీనివాస్ రెడ్డి, కాండ్రేగుల సెక్రటరీ పాలాటి నూకరాజు, బుర్రి భీమరాజు, రామిశెట్టి పాపారావు, బోదిరెడ్డి నాగార్జున, రామిశెట్టి విష్ణు చక్రబాబు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ఇంటింటికి తెలుగుదేశం, కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు

జగ్గంపేట, మామిడాడ, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 30 కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో చేసిన పనులను ప్రజలకు వివరిస్తూ ఎన్టీఆర్ భరోసా 4000 6000 10000 పెన్షన్లు ప్రతి ఇంట్లో స్కూల్ కి వెళ్తున్న పిల్లలకు తల్లికి వందనం దీపం 2 పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేనేత కార్మికులకు ఉచిత కరెంటు ఆటో డ్రైవర్లకు 15 వేల రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు 269 అన్న క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజన పథకం అలాగే మరెన్నో పథకాలను కోటమీ ప్రభుత్వ వచ్చిన రెండు సంవత్సరాల్లో చేయడం జరిగిందని మామిడాడ 137 బూత్ ఇంచార్జ్ దాడి వెంకటేశులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దాడి వెంకటేశులు, సత్తిబాబు, రాంబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు

తూర్పు గోదావరి

ప్రజాదర్బార్ తో – ప్రజల సమస్యలు పరిష్కారం : ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 29 : ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసేందుకు మంగళగిరి వెళ్లడంతో శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగ్గంపేట రావులమ్మ నగర్ లోని క్యాంప్ ఆఫీసులో శనివారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు పెన్షన్లు, హౌసింగ్ లోన్లు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు.గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన అయితా బత్తుల అనిల్ కుమార్ కాలేజీ అడ్మిషన్ కోసం రావడంతో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. గండేపల్లి మండలం నీలాద్రి రావు పేట గ్రామానికి చెందిన నక్క బాలకృష్ణ కుమార్తె నక్క పూర్ణ అనుదీప్తికి గుండెకు రంధ్రం కావడంతో ఓపెన్ హార్ట్ సర్జరీకి ఎల్ఓసి 3,92,000 అందించేందుకు, గోకవరం మండలం మల్లవరం గ్రామానికి చెందిన మండపాక రాజులమ్మకు బ్రెయిన్ ట్యూమర్ రావడంతో 3,72,000 ఎల్ ఓ సి అందించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పంపించడం జరిగింది.కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మిగిలిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, పాఠం శెట్టి కొండరాజులు, జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సింగలూరి రామ్ దీపు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

సీఎం చంద్రబాబు ను కలిసిన దివ్యాంగుల జిల్లా అధ్యక్షులు మండపాక అప్పన్న దొర

*సీఎం చంద్రబాబును కలిసిన కాకినాడ జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు మండపాక అప్పన్న దొర* మంగళగిరి/జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,ఆగస్టు 29: నవ్యాంధ్ర నిర్మాణ రథసారథి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ని మంగళగిరి లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు, మెట్ట ప్రాంత భగీరథుడు జ్యోతుల నెహ్రూ తో కలిసి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) విభాగం అధ్యక్షుడు మండపాక అప్పన్న దొర మర్యాద పూర్వకంగా కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మండపాక అప్పన్న దొర మాట్లాడుతూ… ముఖ్యమంత్రి దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ప్రజా నాయకుడని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విభిన్న ప్రతిభావంతుల జీవన ప్రమాణాలను పెంచేందుకు వైకల్య శాతాన్ని బట్టి పెన్షన్లను రూ. 6,000, రూ. 10,000 మరియు రూ. 15,000 వరకు పెంచి దివ్యాంగుల కుటుంబాల్లో వెలుగులు నింపారని తెలిపారు. అలీమ్కో సంస్థ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, చార్జింగ్ (బ్యాటరీ) ట్రై సైకిళ్లు, రెట్రోఫిట్టెడ్ స్కూటీలు, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు (హియరింగ్ ఎయిడ్స్), కృత్రిమ అవయవాలను అందజేస్తూ వారికి ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించే దిశగా బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతుం డటం హర్షణీయమన్నారు. దివ్యాంగులను సమాజంలో ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరిగేలా అడుగడుగునా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కి, కూటమిప్రభుత్వా నికి, ఎమ్మెల్యే రాష్ట్రంలోని దివ్యాంగులంతా ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని, జగ్గంపేట నియోజకవర్గం లో దివ్యాంగులకు ఎప్పుడూ అండగా నిలబడుతూ ఉన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అప్పన్న దొర ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

తూర్పు గోదావరి

సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, జ్యోతుల నెహ్రూ దంపతుల ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా కంబాల శ్రీనివాసరావు

*ఎమ్మెల్యేజ్యోతుల నెహ్రూ మణి దంపతుల ఆధ్వర్యంలో ఇర్రిపాకలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు*.. *ముఖ్య అతిధులుగా పాల్గొన్న కంబాల శ్రీనివాసరావు దంపతులు* *200 మంది మహిళలకు బంగారు రూపులు, పట్టుచీరలు పంపిణీ చేసిన కంబాల దంపతులు* కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 28: శ్రావణ శుక్రవారం, పౌర్ణమి సందర్భంగా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలోని శివ కేశవుల క్షేత్రంలో ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు, టిడిపి పొలిటి బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతుల ఆధ్వర్యంలో ఇర్రిపాక మహిళలచే సామూహిక వరలక్ష్మీ వ్రతాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు పద్మావతి దేవి గంగారత్నం దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలిత కంబాల శ్రీనివాసరావు దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి, వేదమంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనాలు అందించారు. శివ కేశవులను దర్శించుకుని అనంతరం వరలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జ్యోతుల నెహ్రూ, కంబాల దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా విరాజిల్లుతున్న ఇర్రిపాక శివ కేశవుల ఆలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆహ్వాన మేరకు ఇర్రిపాక గ్రామంలో నిర్వహిస్తున్న సామూహిక వరలక్ష్మి వ్రతాలకు కుటుంబ సమేతంగా హాజరు కావడం జరిగిందన్నారు. శ్రావణ శుక్రవారం రోజు వ్రతాలు నిర్వహిస్తున్న మహిళలకు తన వంతుగా బంగారు రూపులు, పట్టుచీరలు ఉచితంగా అందించాలని సంకల్పించడం జరిగిందన్నారు. హిందూధర్మ పరిరక్షణ, మహిళా మూర్తుల్లో హైందవ చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో శ్రావణమాసంలో మహిళలకు పట్టు చీరలు బంగారు రూపులు, ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు, చాలా గొప్పవని, వాటిని ప్రతి ఒక్కరు ఆచరించాలన్నారు. మన దేశం విశ్వగురువు అన్నారు. జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం మూడు నియోజకవర్గాల్లో నూతన, శిథిలావస్థ, ఆలయాల అభివృద్ధికి, విద్యా, వైద్య, ఆర్థిక పరంగా కోట్ల రూపాయలు, సొంత నిధులు ఖర్చు చేసి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కంబాల శ్రీనివాసరావు సేవలు మరువలేనివని, హిందూ ధర్మ పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇర్రి పాక శివ కేశవుల పుణ్యక్షేత్రం నిరంతరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాలని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్షేత్రంలో సెప్టెంబర్ 4వ తేదీన అష్టలక్ష్మి గుడికి నా చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని 5వ తేదీ రామాలయం శంకుస్థాపనకు కంబాల శ్రీనివాసరావు చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహిస్తామని తెలియజేశారు. అనంతరం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించిన, 200 మంది మహిళలకు వరలక్ష్మి బంగారు రూపు, పట్టుచీర, పసుపు కుంకుమలను, జ్యోతుల నెహ్రూ మణి, కంబాల శ్రీనివాసరావుపద్మావతి దేవి గంగారత్నం దంపతులు పంపిణీ చేసారు…

తూర్పు గోదావరి

రక్షాబంధన్ శుభాకాంక్షలు

జగ్గంపేట, మామిడాడ, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 28 జగ్గంపేట రక్షాబంధన్ అంటే అన్న చెల్లెలు అక్క తమ్ముళ్లు అనుబంధమే ఈ రక్షాబంధన్ రాఖీ పండుగ ఎక్కడ నుంచి వచ్చి అక్క చెల్లెల్లు అన్నదమ్ములకు రాఖీ కట్టి హారతి ఇచ్చి వారి నుంచి దీవెనలు పొందుతారు అలాగే వారిచ్చే బహుమతి తీసుకుని వారిని నిండు నూరేళ్లు అనుకున్న పనులన్నీ ఆ దేవుడు చల్లగా నెరవేర్చాలని దీవెనలు ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల సంతోషంగా ఉంటారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు

తూర్పు గోదావరి

నాయుడు ఫ్రూట్స్ హోల్సేల్ షాప్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

*నాయుడు ఫ్రూట్స్ హోల్ సేల్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ* కాకినాడ, జగ్గంపేట పున్నమి ప్రతినిధి,ఆగస్టు 27 : జగ్గంపేట ఏలేశ్వరం రోడ్ లోని వేబిడ్జ్ ఎదురుగా శ్రీ సాయి బాలాజీ షాపింగ్ కాంప్లెక్స్ నందు లావేటి నాయుడు, సత్తిబాబు బ్రదర్స్ ఏర్పాటు చేసిన నాయుడు ఫ్రూట్స్ హోల్ సేల్ షాప్ గురువారం జగ్గంపేట ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు, టిడిపి పోలీట్ సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించి అన్నవరం సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని బహుకరించి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని దీవెనలు అందించారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను, వచ్చిన అతిథులను ఘనంగా సత్కరించిన లావేటి నాయుడు బ్రదర్స్ మా వద్ద అన్ని రకాల ఫ్రూట్స్ హోల్ సేల్ అండ్ రిటైల్ గా లభిస్తాయని లావేటి నాయుడు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, జగ్గంపేట ఎస్సై టీ రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

స్వర్గీయ చెక్కపల్లి సత్యనారాయణ 70వ జయంతి సందర్భంగా అన్న క్యాంటీన్లో అన్నదానం

*స్వర్గీయ చక్కపల్లి సత్యనారాయణ 70వ జయంతి సందర్భంగా అన్న క్యాంటీన్ లో అన్నదానం* అన్నా క్యాంటీన్ లో భోజన నాణ్యత పై ప్రజలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కోడలు లక్ష్మీదేవి* *కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 27:* స్థానిక గోకవరం రోడ్ లోని ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మామగారు చక్కపల్లి సత్యనారాయణ 70వ జయంతి పురస్కరించుకుని వారి కుమార్తె జ్యోతుల లక్ష్మీదేవి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై అన్నా క్యాంటీన్ లో భోజనాలు చేస్తున్న ప్రజలను పలకరిస్తూ భోజన నాణ్యత, రుచి ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.అనంతరం అన్నదాత లక్ష్మీదేవి మాట్లాడుతూ, మా నాన్న సత్యనారాయణ 70వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆయన జయంతి, వర్ధంతి సందర్భాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటామని అన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పునరుద్ధరించడం వల్ల పేదల కడుపులు నిండుతున్నాయని అన్నారు. ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యుల పెళ్లిరోజు, పుట్టినరోజుతో పాటు పెద్దల పేర్లపై అన్నదానం నిర్వహించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉండగా జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఐదు సంవత్సరాల పాటు ఉచిత అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, వేములకొండ జోగారావు, వైభోగుల కొండబాబు యాదవ్, గల్లా రాము, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.