Thursday, 3 September 2026
  • Home  
  • ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
- తూర్పు గోదావరి

ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

*కాండ్రేగులలో పండగలా పింఛన్ల పంపిణీ – లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ* కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,: సెప్టెంబర్ ఒకటి1: జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జగ్గంపేట శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి లబ్ధిదారుడిని ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే పేదలకు నిజమైన భరోసా దక్కిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ కోసం లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడితే, కూటమి ప్రభుత్వం వచ్చాక 1వ తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నిర్ణయంతో రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా పింఛన్లు పెంచి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వృద్ధులు, వితంతువులకు నెలకు 4000 రూపాయలు, దివ్యాంగులకు నెలకు 6000 రూపాయలు, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి నెలకు 15,000 రూపాయలు, కిడ్నీ, లివర్, తలసేమియా తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల చొప్పున దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు అందిస్తున్నామని, ఇది చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఈ పింఛన్ కేవలం డబ్బు కాదు, ఆత్మగౌరవం అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ రామిశెట్టి చందర్రావు, య ల్లపు దొరబాబు, ఎంపీడీవో చంద్రశేఖర్, డిప్యూటీ ఎండిఓ శ్రీనివాస్ రెడ్డి, కాండ్రేగుల సెక్రటరీ పాలాటి నూకరాజు, బుర్రి భీమరాజు, రామిశెట్టి పాపారావు, బోదిరెడ్డి నాగార్జున, రామిశెట్టి విష్ణు చక్రబాబు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

*కాండ్రేగులలో పండగలా పింఛన్ల పంపిణీ – లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ*

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,: సెప్టెంబర్ ఒకటి1: జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జగ్గంపేట శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి లబ్ధిదారుడిని ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే పేదలకు నిజమైన భరోసా దక్కిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ కోసం లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడితే, కూటమి ప్రభుత్వం వచ్చాక 1వ తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నిర్ణయంతో రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా పింఛన్లు పెంచి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వృద్ధులు, వితంతువులకు నెలకు 4000 రూపాయలు, దివ్యాంగులకు నెలకు 6000 రూపాయలు, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి నెలకు 15,000 రూపాయలు, కిడ్నీ, లివర్, తలసేమియా తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల చొప్పున దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు అందిస్తున్నామని, ఇది చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఈ పింఛన్ కేవలం డబ్బు కాదు, ఆత్మగౌరవం అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ రామిశెట్టి చందర్రావు, య ల్లపు దొరబాబు, ఎంపీడీవో చంద్రశేఖర్, డిప్యూటీ ఎండిఓ శ్రీనివాస్ రెడ్డి, కాండ్రేగుల సెక్రటరీ పాలాటి నూకరాజు, బుర్రి భీమరాజు, రామిశెట్టి పాపారావు, బోదిరెడ్డి నాగార్జున, రామిశెట్టి విష్ణు చక్రబాబు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.