Friday, 4 September 2026
  • Home  
  • పేద రైతుల భూముల్లో చేస్తున్న వర్కును వెంటనే ఆపాలి పాటoశెట్టి సూర్యచంద్ర
- తూర్పు గోదావరి

పేద రైతుల భూముల్లో చేస్తున్న వర్కును వెంటనే ఆపాలి పాటoశెట్టి సూర్యచంద్ర

జగ్గంపేట, జై కొత్తూరు, పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4, పేద రైతుల 40 ఏళ్ల కష్టాన్ని ప్రోక్లైనర్లతో నాశనం చేస్తారా?జటాద్రికొండ రైతుల జీడిమామిడి చెట్లను తొలగించడం వెంటనే ఆపాలి 40 సంవత్సరాలుగా నిరుపేద రైతులు పెంచుకున్న ఆశలను,ఆ కుటుంబాల జీవనాధారాన్ని ప్రోక్లైన్‌తో తొక్కేస్తున్న బాధాకరమైన దుస్థితి. జగ్గంపేట మండలం జే.కొత్తూరు సమీపంలోని జటాద్రికొండపై భూమిలేని నిరుపేద కుటుంబాలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను పారిశ్రామికవేత్తకు ఇవ్వడానికి నిరుపేద రైతుల పొట్ట కొట్టడం దుర్మార్గమని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు ఒకప్పుడు రాళ్లు,తుప్పలు,డొంకలతో ఉన్న ఈ ప్రాంతాన్ని తమ రక్తం,చెమటతో సాగుకు అనుకూలంగా మార్చుకున్నారని కావిడలతో నీళ్లు మోసి మొక్కలకు నీళ్లు పోశారని.ఎండకు ఎండి వానకు తడిసి40 సంవత్సరాలు కష్టపడి జీడిమామిడి చెట్లను పిల్లలలా పెంచుకున్నారన్నారు.ఇప్పుడు ఆ చెట్లు ఫలసాయాన్నిస్తున్న సమయంలో “ఈ భూమి మీది కాదు, ప్రభుత్వం భూమి” అని చెప్పి పేద రైతులను బయటకు పంపించి, చెట్లను ప్రోక్లైన్లతో తొలగించడం ఎంతవరకు న్యాయమని ప్రభుత్వాన్ని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రశ్నించారు?* ప్రభుత్వ భూమి అయితే పేద రైతు 40 ఏళ్ల కష్టం కూడా ప్రభుత్వానిదేనా?*ఆ చెట్లను పెంచింది ప్రభుత్వం కాదు.* *ఆ చెట్లకు నీళ్లు పోసింది ప్రభుత్వం కాదు* *ఎరువులు వేసింది ప్రభుత్వం కాదు40 సంవత్సరాలు వాటిని కాపాడింది ప్రభుత్వం కాదు* *తమ కుటుంబాలను పస్తులతో పెట్టుకుని ఆ తోటలను పెంచింది నిరుపేద రైతులుఈరోజు రైతన్నల కష్టాన్ని ప్రోక్లైన్లతో నేలమట్టం చేసే అధికారం ఎవరికుంది?అభివృద్ధి అంటే పేదవాడి పొట్ట కొట్టి పారిశ్రామికవేత్తకు లాభం చేకూర్చడమా?*వన సంరక్షణ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం చెట్లు పెంచుతోంది.మరి ఇక్కడ 40 సంవత్సరాలుగా పేద రైతులు పెంచుకున్న ఫలసాయాన్నిచ్చే చెట్లను ఎందుకు తొలగిస్తున్నారు అధికారులు, ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి?ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారికి విజ్ఞప్తి*ఇది రాజకీయ సమస్యగా చూడవద్దు మన రైతుల కన్నీటి ఆవేదనను వారి రక్తాన్ని చెమట రూపంగా మార్చి 40 సంవత్సరాలు పెంచిన చెట్లను మీ కళ్ళతో చూడాలని అధికారులతో మాట్లాడి వెంటనే చెట్ల తొలగింపును ఆపించి బాధిత నిరుపేద రైతులకు శాశ్వత భూమి హక్కు పత్రాలను ఇప్పించి ఆదుకోవాలని బాధిత రైతుల పక్షాన కోరుచున్నాము*

జగ్గంపేట, జై కొత్తూరు, పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4,

పేద రైతుల 40 ఏళ్ల కష్టాన్ని ప్రోక్లైనర్లతో నాశనం చేస్తారా?జటాద్రికొండ రైతుల జీడిమామిడి చెట్లను తొలగించడం వెంటనే ఆపాలి 40 సంవత్సరాలుగా నిరుపేద రైతులు పెంచుకున్న ఆశలను,ఆ కుటుంబాల జీవనాధారాన్ని ప్రోక్లైన్‌తో తొక్కేస్తున్న బాధాకరమైన దుస్థితి. జగ్గంపేట మండలం జే.కొత్తూరు సమీపంలోని జటాద్రికొండపై భూమిలేని నిరుపేద కుటుంబాలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను పారిశ్రామికవేత్తకు ఇవ్వడానికి నిరుపేద రైతుల పొట్ట కొట్టడం దుర్మార్గమని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు ఒకప్పుడు రాళ్లు,తుప్పలు,డొంకలతో ఉన్న ఈ ప్రాంతాన్ని తమ రక్తం,చెమటతో సాగుకు అనుకూలంగా మార్చుకున్నారని కావిడలతో నీళ్లు మోసి మొక్కలకు నీళ్లు పోశారని.ఎండకు ఎండి వానకు తడిసి40 సంవత్సరాలు కష్టపడి జీడిమామిడి చెట్లను పిల్లలలా పెంచుకున్నారన్నారు.ఇప్పుడు ఆ చెట్లు ఫలసాయాన్నిస్తున్న సమయంలో “ఈ భూమి మీది కాదు, ప్రభుత్వం భూమి” అని చెప్పి పేద రైతులను బయటకు పంపించి, చెట్లను ప్రోక్లైన్లతో తొలగించడం ఎంతవరకు న్యాయమని ప్రభుత్వాన్ని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రశ్నించారు?*
ప్రభుత్వ భూమి అయితే పేద రైతు 40 ఏళ్ల కష్టం కూడా ప్రభుత్వానిదేనా?*ఆ చెట్లను పెంచింది ప్రభుత్వం కాదు.*
*ఆ చెట్లకు నీళ్లు పోసింది ప్రభుత్వం కాదు*
*ఎరువులు వేసింది ప్రభుత్వం కాదు40 సంవత్సరాలు వాటిని కాపాడింది ప్రభుత్వం కాదు*
*తమ కుటుంబాలను పస్తులతో పెట్టుకుని ఆ తోటలను పెంచింది నిరుపేద రైతులుఈరోజు రైతన్నల కష్టాన్ని ప్రోక్లైన్లతో నేలమట్టం చేసే అధికారం ఎవరికుంది?అభివృద్ధి అంటే పేదవాడి పొట్ట కొట్టి పారిశ్రామికవేత్తకు లాభం చేకూర్చడమా?*వన సంరక్షణ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం చెట్లు పెంచుతోంది.మరి ఇక్కడ 40 సంవత్సరాలుగా పేద రైతులు పెంచుకున్న ఫలసాయాన్నిచ్చే చెట్లను ఎందుకు తొలగిస్తున్నారు అధికారులు, ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి?ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారికి విజ్ఞప్తి*ఇది రాజకీయ సమస్యగా చూడవద్దు మన రైతుల కన్నీటి ఆవేదనను వారి రక్తాన్ని చెమట రూపంగా మార్చి 40 సంవత్సరాలు పెంచిన చెట్లను మీ కళ్ళతో చూడాలని అధికారులతో మాట్లాడి వెంటనే చెట్ల తొలగింపును ఆపించి బాధిత నిరుపేద రైతులకు శాశ్వత భూమి హక్కు పత్రాలను ఇప్పించి ఆదుకోవాలని బాధిత రైతుల పక్షాన కోరుచున్నాము*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.