Sunday, 6 September 2026
  • Home  
  • ఇరుపాక శివకేశవుల క్షేత్రంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతుల ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముడు ఆలయానికి కంబాల శ్రీనివాసరావు దంపతులచే ఘనంగా శంకుస్థాపన
- తూర్పు గోదావరి

ఇరుపాక శివకేశవుల క్షేత్రంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతుల ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముడు ఆలయానికి కంబాల శ్రీనివాసరావు దంపతులచే ఘనంగా శంకుస్థాపన

రామ మందిర నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం అందజేసిన కంబాల శ్రీనివాసరావు* కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 5 :* జగ్గంపేట మండలం ఇర్రిపాక ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శివ కేశవుల క్షేత్రంలో అయోధ్య బాలరాముడి రామ మందిర నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల మణి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశ్వహిందూ రామసేన అధ్యక్షులు, బిజెపి నాయకులు కంబాల శ్రీనివాసరావు దంపతులు హాజరై పీటలపై కూర్చుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కంబాల శ్రీనివాసరావు దంపతుల చేతుల మీదుగా శంకుస్థాపన ఘనంగా జరిగింది. అనంతరం కంబాల దంపతులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలు అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు, రామ మందిర నిర్మాణానికి తన వంతు సహాయంగా రూ.5 లక్షల చెక్కును కంబాల శ్రీనివాసరావు జ్యోతుల నెహ్రూ దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మ ప్రచారం కోసం నిరంతరం కష్టపడుతున్న వ్యక్తి కంబాల శ్రీనివాసరావు. శివ కేశవుల క్షేత్రానికి ఇప్పటివరకు ఎప్పుడూ విరాళాలు వసూలు చేయలేదు. మొట్టమొదటిసారి రామ మందిర నిర్మాణం కోసం కంబాల శ్రీనివాసరావు రూ.5 లక్షలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది.ఇలాంటి దాతల సహకారంతో ఈ క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుంది అని అన్నారు .కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూప్రతి ఒక్కరిలో దేశభక్తి, దైవభక్తి ఉండాలి. హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ ప్రచారం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.మహిళలకు పట్టుచీరలు, బంగారు రూపులను అందిస్తున్నాము. అందులో భాగంగా ఇర్రిపాక శివ కేశవుల క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నాము. – జ్యోతుల నెహ్రూ తెలియజేయడంతో 200 మందికి పట్టుచీరలు పంపిణీ చేయాలని వచ్చాము. పట్టుచీరలతో పాటు బంగారు రూపులు కూడా ఇవ్వడం జరిగింది. – జ్యోతుల నెహ్రూ దంపతుల ఆధ్వర్యంలో ఈ శివ కేశవుల క్షేత్రం ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందుతుంది. ఈ రామ మందిర నిర్మాణానికి తన వంతు సహాయం ఇంకా అందిస్తూనే ఉంటాను అని కంబాల అన్నారు .ఈ కార్యక్రమంలో జ్యోతుల లక్ష్మీదేవి, ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, కుంచే రాజా, పాలచర్ల నాగేంద్ర చౌదరి, జంపన రవి వర్మ,తులా రాము, మానేపల్లి బంగార్రాజు, పెద్దాడ వెంకన్న దొర,గ్రామ పెద్దలు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

రామ మందిర నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం అందజేసిన కంబాల శ్రీనివాసరావు*
కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 5 :*

జగ్గంపేట మండలం ఇర్రిపాక ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శివ కేశవుల క్షేత్రంలో అయోధ్య బాలరాముడి రామ మందిర నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల మణి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశ్వహిందూ రామసేన అధ్యక్షులు, బిజెపి నాయకులు కంబాల శ్రీనివాసరావు దంపతులు హాజరై
పీటలపై కూర్చుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కంబాల శ్రీనివాసరావు దంపతుల చేతుల మీదుగా శంకుస్థాపన ఘనంగా జరిగింది. అనంతరం కంబాల దంపతులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలు అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు, రామ మందిర నిర్మాణానికి తన వంతు సహాయంగా రూ.5 లక్షల చెక్కును కంబాల శ్రీనివాసరావు జ్యోతుల నెహ్రూ దంపతులకు అందజేశారు.
ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ
హిందూ ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మ ప్రచారం కోసం నిరంతరం కష్టపడుతున్న వ్యక్తి కంబాల శ్రీనివాసరావు. శివ కేశవుల క్షేత్రానికి ఇప్పటివరకు ఎప్పుడూ విరాళాలు వసూలు చేయలేదు. మొట్టమొదటిసారి రామ మందిర నిర్మాణం కోసం కంబాల శ్రీనివాసరావు రూ.5 లక్షలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది.ఇలాంటి దాతల సహకారంతో ఈ క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుంది అని అన్నారు .కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూప్రతి ఒక్కరిలో దేశభక్తి, దైవభక్తి ఉండాలి. హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ ప్రచారం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.మహిళలకు పట్టుచీరలు, బంగారు రూపులను అందిస్తున్నాము. అందులో భాగంగా ఇర్రిపాక శివ కేశవుల క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నాము.
– జ్యోతుల నెహ్రూ తెలియజేయడంతో 200 మందికి పట్టుచీరలు పంపిణీ చేయాలని వచ్చాము. పట్టుచీరలతో పాటు బంగారు రూపులు కూడా ఇవ్వడం జరిగింది.
– జ్యోతుల నెహ్రూ దంపతుల ఆధ్వర్యంలో ఈ శివ కేశవుల క్షేత్రం ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందుతుంది. ఈ రామ మందిర నిర్మాణానికి తన వంతు సహాయం ఇంకా అందిస్తూనే ఉంటాను అని కంబాల అన్నారు .ఈ కార్యక్రమంలో జ్యోతుల లక్ష్మీదేవి, ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, కుంచే రాజా, పాలచర్ల నాగేంద్ర చౌదరి, జంపన రవి వర్మ,తులా రాము, మానేపల్లి బంగార్రాజు, పెద్దాడ వెంకన్న దొర,గ్రామ పెద్దలు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.