జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 3,
జగ్గంపేట, మండలం జటాద్రి కొండ సర్వేనెంబర్ 24 లో గత నలభై సంవత్సరాల నుంచి భూమిలేని నిరుపేద రైతులు మామిడి,జీడి మామిడి వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ చెట్లను రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా టిడ్కో కంపెనీ వారికి సోలార్ సిస్టం పెట్టుకోవడానికి పేద రైతులు పండించిన పంటను జెసిబి లతో నరికి వేయడం సరైన పద్ధతి కాదని గురువారం నాడు పేద రైతులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు జగ్గంపేట ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేయడం జరిగింది . ఈ సందర్భంగా కర్ణాకుల మాట్లాడుతూ బడా కంపెనీలకు కూటమి ప్రభుత్వ నాయకులు, రెవెన్యూ అధికారులు తొత్తులుగా మారి పేదల పొట్ట కొడుతూన్నారని,వారి బ్రతుకులను రోడ్డున పడేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి విషయాల్లో రెవిన్యూ అధికారులు కాకుండా పోలీస్ అధికారులు రావడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రైతులపై పోలీసు వారు చేసిన పనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.తక్షణమే పేదల భూముల్లో పనులను ఆపాలని, ప్రోక్లైన్లను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు పట్ల, కూలీల పట్ల, పేద ప్రజల పట్ల మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం అన్నివేళలా వారికి అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర, కొత్తూరు గ్రామ నాయకులు నకిరెడ్డి నాగేశ్వరరావు, పెద్దకాపు, రైతులు నూకరాజు, శ్రీనివాసరావు, నాని బాబు, నాగేంద్ర, గంగరాజు,ధర్మరాజు పాల్గొన్నారు.


