Wednesday, 5 August 2026
  • Home  
  • దామినేడు సభను విజయవంతం చేయాలి-పనబాక లక్ష్మి, దామచర్ల సత్య
- తిరుపతి

దామినేడు సభను విజయవంతం చేయాలి-పనబాక లక్ష్మి, దామచర్ల సత్య

శ్రీకాళహస్తి, జూన్ 10, (పున్నమి న్యూస్) :తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద నిర్వహించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్ల సుపరిపాలన బహిరంగ సభను ఘనవిజయవంతం చేయాలని రాయలసీమ జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు, ‘SER’ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు సమన్వయంతో కృషి చేసి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ‘SER’ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలు, కార్యాచరణపై బూత్ స్థాయి నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జీలతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమం అమలులో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పార్టీ కార్యాలయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.