Wednesday, 23 September 2026
  • Home  
  • రాష్ట్రంలోనే అత్యంత మహిమాన్విత ఆలయం పులివెందుల శ్రీ రంగనాథ ఆలయం
- కడప

రాష్ట్రంలోనే అత్యంత మహిమాన్విత ఆలయం పులివెందుల శ్రీ రంగనాథ ఆలయం

రాష్ట్రంలోనే అత్యంత మహిమాన్విత ఆలయం పులివెందుల శ్రీ రంగనాథ ఆలయం పున్నమి ప్రతినిధి పులివెందుల, సెప్టెంబర్ 19: పులివెందుల శ్రీ రంగనాథ స్వామి ఆలయం రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనూ అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక క్షేత్రమని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, అభ్యుదయ ఫౌండేషన్ సీఈఓ కే. నందకిషోర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన పులివెందుల శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని ప్రత్యేకంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నందకిషోర్ రెడ్డి మాట్లాడుతూ తమిళనాడులోని కావేరి నది తీరంలో ఉన్న శ్రీరంగం, శ్రీరంగపట్నం, శివసముద్రం వంటి ప్రముఖ క్షేత్రాల తరహాలో పులివెందుల శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి కూడా విశిష్టత ఉందన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లలేని భక్తులు పులివెందుల శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎంతో సంతృప్తి పొందవచ్చని తెలిపారు. శయన స్థితిలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయాలను భక్తులు క్రమం తప్పకుండా దర్శించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. పులివెందుల ఆలయంలో ప్రతి శుక్రవారం శ్రీ రంగనాథ స్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లకు ఆరు వారాల పాటు తులసి మాలలు సమర్పించడం భక్తుల విశ్వాసాల ప్రకారం శుభప్రదమని వివరించారు. ఆలయంలో విష్ణు పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, హోమాలు, జపతపాలు, భజనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని సూచించారు. ఆలయ ప్రాధాన్యతను కాపాడుతూ మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పులివెందుల శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని గతంలో రామానుజాచార్యులు, వారి శిష్యులు, భట్టాచార్యులు, అన్నమయ్య, శ్రీకృష్ణదేవరాయలు వంటి ప్రముఖులు దర్శించారని నందకిషోర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఆలయ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించానని, ఆలయానికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకున్నానని నందకిషోర్ రెడ్డి చెప్పారు. ఆలయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నిరంతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీ రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు అంతకుముందు శ్రీ రంగనాథ స్వామికి నందకిషోర్ రెడ్డితో పాటు సుమన్ టీవీ భక్తి ఛానల్ సీఈఓ గీతాంజలి, భక్తి ఛానల్ డైరెక్టర్ కార్తీక్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలను పరిశీలించి పలు కార్యక్రమాలు, పూజా విధానాలపై చర్చించారు. అనంతరం తూర్పు వీరాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రంగనాథ స్వామి, తూర్పు వీరాంజనేయ స్వామి ఆలయాల చరిత్ర, పురాణ కథనాలను ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ అల్లం రంగనాయకులు రాయల్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కె.వి. రమణ, పూజారులు శశిధర్ శర్మ, నరసింహ శర్మ, కృష్ణ రాజేష్ శర్మ, డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రామిశెట్టి శివశంకర్, శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అధినేత ఆరవేటి నారాయణరెడ్డి, మానవత సంస్థ ప్రతినిధులు రిటైర్డ్ కొండారెడ్డి, దినేష్ గుప్తా, మల్లికార్జున, టీడీపీ నాయకుడు జ్ఞానేశ్వర్ నాయుడు, పలువురు హిందూ జేఏసీ నాయకులు, హిందూ ప్రతినిధులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోనే అత్యంత మహిమాన్విత ఆలయం పులివెందుల శ్రీ రంగనాథ ఆలయం

పున్నమి ప్రతినిధి
పులివెందుల, సెప్టెంబర్ 19: పులివెందుల శ్రీ రంగనాథ స్వామి ఆలయం రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనూ అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక క్షేత్రమని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, అభ్యుదయ ఫౌండేషన్ సీఈఓ కే. నందకిషోర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన పులివెందుల శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని ప్రత్యేకంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నందకిషోర్ రెడ్డి మాట్లాడుతూ తమిళనాడులోని కావేరి నది తీరంలో ఉన్న శ్రీరంగం, శ్రీరంగపట్నం, శివసముద్రం వంటి ప్రముఖ క్షేత్రాల తరహాలో పులివెందుల శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి కూడా విశిష్టత ఉందన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లలేని భక్తులు పులివెందుల శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎంతో సంతృప్తి పొందవచ్చని తెలిపారు.

శయన స్థితిలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయాలను భక్తులు క్రమం తప్పకుండా దర్శించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. పులివెందుల ఆలయంలో ప్రతి శుక్రవారం శ్రీ రంగనాథ స్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లకు ఆరు వారాల పాటు తులసి మాలలు సమర్పించడం భక్తుల విశ్వాసాల ప్రకారం శుభప్రదమని వివరించారు.

ఆలయంలో విష్ణు పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, హోమాలు, జపతపాలు, భజనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని సూచించారు. ఆలయ ప్రాధాన్యతను కాపాడుతూ మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

పులివెందుల శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని గతంలో రామానుజాచార్యులు, వారి శిష్యులు, భట్టాచార్యులు, అన్నమయ్య, శ్రీకృష్ణదేవరాయలు వంటి ప్రముఖులు దర్శించారని నందకిషోర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఆలయ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.

ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించానని, ఆలయానికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకున్నానని నందకిషోర్ రెడ్డి చెప్పారు. ఆలయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నిరంతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

శ్రీ రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు

అంతకుముందు శ్రీ రంగనాథ స్వామికి నందకిషోర్ రెడ్డితో పాటు సుమన్ టీవీ భక్తి ఛానల్ సీఈఓ గీతాంజలి, భక్తి ఛానల్ డైరెక్టర్ కార్తీక్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలను పరిశీలించి పలు కార్యక్రమాలు, పూజా విధానాలపై చర్చించారు.

అనంతరం తూర్పు వీరాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రంగనాథ స్వామి, తూర్పు వీరాంజనేయ స్వామి ఆలయాల చరిత్ర, పురాణ కథనాలను ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ అల్లం రంగనాయకులు రాయల్ వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కె.వి. రమణ, పూజారులు శశిధర్ శర్మ, నరసింహ శర్మ, కృష్ణ రాజేష్ శర్మ, డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రామిశెట్టి శివశంకర్, శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అధినేత ఆరవేటి నారాయణరెడ్డి, మానవత సంస్థ ప్రతినిధులు రిటైర్డ్ కొండారెడ్డి, దినేష్ గుప్తా, మల్లికార్జున, టీడీపీ నాయకుడు జ్ఞానేశ్వర్ నాయుడు, పలువురు హిందూ జేఏసీ నాయకులు, హిందూ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.