Monday, 21 September 2026

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

సీఎం వ్యాఖ్యలపై బి ఆర్ ఎస్ ఆగ్రహం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా అసెంబ్లీకి హాజరు కాకపోవడానికి కారణంగా చూపి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా BRS అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు హైకోర్టు జోక్యం చేసుకుని సస్పెన్షన్ ను రద్దు చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి అసభ్య పదజాలం వాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

200 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం స్వాధీనం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడులోని కనకదుర్గ రైస్ మిల్లులో పిడిఎస్ బియ్యం అక్రమంగా నిలువ చేసినట్లు సమాచారం రావడంతో విజిలెన్స్ అధికారులు రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టారు బుచ్చిబాబు ఆధ్వర్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బందితో కలిసి దాడి చేసి కుప్పగా నిలువచేసిన 200 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పంచనామా నిర్వహించి తదుపరి ఆదేశాల వరకు మరో రైస్ మిల్లులో భద్రపరిచినట్లు తెలిపారు అక్రమంగా పిడిఎఫ్ బియ్యం వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్ఓ హెచ్చరించారు

రాజన్న సిరిసిల్ల

హత్యకు సహకరించిన వ్యక్తి అరెస్ట్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగిన హత్య కేసులో పల్లపు సురేష్ కు సహకరించిన కంచర్ల సతీష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు దర్యాప్తులో భాగంగా సతీష్ ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు గతంలో భార్యను హత్య చేసిన పల్లపు సురేష్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసింది

రాజన్న సిరిసిల్ల

మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రీనా బాబా ఇంట్లో బుధవారం మంటలు చెలరేగాయి ఒక్కసారిగా వంటలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు ప్రమాదానికి గల కారణాలు నష్టం వివరాలు తెలియవలసి ఉంది

రాజన్న సిరిసిల్ల

ఫీజు బకాయిల కోసం విద్యార్థులు నిరసన

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో విద్యార్థులు ఆధ్యాపకులు ఆందోళన చేపట్టారు అంబేద్కర్ చౌక్ వద్ద TPDMA- SUPMA ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు బకాయిలు చెల్లించి రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

పున్నమి ప్రతిని ధి సెప్టెంబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డీజే యజమానులతో ఎస్సై ఎన్ రమేష్ సమావేశం నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా డి జే లు యాంప్లి ఫైర్ లు బాక్సులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు గణేష్ మండపాల వద్ద పోలీసుల అనుమతితో చిన్న స్పీకర్లు మాత్రమే రాత్రి 10 గంటల వరకు వినియోగించాలని సూచించారు అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే నిర్వాహకుల పైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు

రాజన్న సిరిసిల్ల

మండపాల నిర్వాహకులకు డిఎస్పి సూచనలు

ప్రతినిధి సెప్టెంబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవడంతోపాటు శాంతిభద్రతలు కాపాడాలని డిఎస్పి నాగేంద్ర చారి సూచించారు రాత్రి 10 గంటల తర్వాత స్పీకర్లు వినియోగించరాదని మండపాలు విద్యుత్ కనెక్షన్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు అత్యవసర సమయంలో డయల్ 112 సమాచారం ఇవ్వాలని సూచించారు

రాజన్న సిరిసిల్ల

కేసుల పరిష్కారానికి లోక అదాలత్ వేదిక

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 12 తారీఖున నిర్వహించనున్న జాతీయ మెగా లోక అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ సివిల్ కుటుంబ ఆస్తి వివాదాలతో పాటు చెక్ బౌన్స్ బ్యాంక్ రికవరీ విద్యుత్ శౌర్యం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పరిష్కరించుకోవచ్చు అన్నారు సమయం డబ్బు ఆదా చేసుకునేందుకు రాజీమార్గం ఉత్తమమని తెలిపారు

రాజన్న సిరిసిల్ల

సీఎంఆర్ అందజేతపై సమీక్ష

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో యాసంగి ఖరీఫ్ 2024-2025 సీజన్ల సీఎంఆర్ పై సమీక్ష నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ పౌరసరపరుల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ అధికారులు రైస్ మిల్లర్లతో వివరాలు తెలుసుకున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు మిల్లర్లు సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు

రాజన్న సిరిసిల్ల

చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 8 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేటలో BRS అధినేత కేసిఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట మండలం BRS నాయకులు పోలీసులను ఆశ్రయించారు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో ఎస్సై రమేష్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు కేసీఆర్ పై చేసినా వాక్యాలను ఖండిస్తూ బాధ్యులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.