Monday, 21 September 2026

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

రోబో టీచర్ ద్వారా వినూత్న బోధన

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 19 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని గీతా నగర్ పాఠశాలలో రోబో టీచర్ తో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు విద్యార్థులకు సాంకేతికత ఆధారంగా బోధన అందిస్తున్న విధానాన్ని తల్లిదండ్రులకు వివరించారు రోబోట్ ద్వారా పాఠాలను ఆసక్తికరంగా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల హెచ్ఎం శారదా తెలిపారు ఈ సమావేశంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు రోబో టీచర్ను ప్రశ్నించగా సమాధానాలు ఇచ్చి సందేహాలను నివృత్తి చేసింది ఇండోస్ ల్యాబ్ అందించిన రోబో టీజీ ప్రభుత్వ పాఠశాలలో తొలి రోబో టీచర్ గా నిలిచింది

రాజన్న సిరిసిల్ల

రాష్ట్రీయ వయో శ్రీ యోజన ద్వారా పరికరాల పంపిణీ

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్లలో రాష్ట్రీయ వయో శ్రీ యోజన ద్వారా 3521 మంది వృద్ధులకు రూ . రెండు కోట్ల 90 లక్షల విలువైన 16,631 సహాయ పరికరాలు మంజూరయ్యాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు కలెక్టరేట్లో పరికరాలను పరిశీలించి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు వీల్ చైర్లు క మేడ్ వీల్ చైర్ మిషన్లు వాకింగ్ స్టిక్ మోకాలు నడుము పట్టీలు తదితర పరికరాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు

రాజన్న సిరిసిల్ల

పేదలకు భూములు పంచిన ఆదర్శ సోదరులు

పున్నమి ప్రతిని ధి సెప్టెంబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు గడ్డం తిరుపతిరెడ్డి రాఘవరెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ధైర్య సాహసాలతో పాల్గొన్నారు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరు జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో తాడును ఉపయోగించి జైలు గోడ దూకి సాహసోపేతంగా తప్పించుకున్నారు అనంతరం తిరిగి పోరాటంలో చేరారు పోరాటం అనంతరం తమ భూముల్లో కొంత భాగాన్ని పేదలకు పంచి ఆదర్శంగా నిలిచారు

రాజన్న సిరిసిల్ల

భూపతి రెడ్డి సేవలు చిరస్మరణీయం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజం నిరంకుశ పాలన. రజకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సింగిరెడ్డి భూపతి రెడ్డి ధైర్యంగా పోరాడారు. తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ చెందిన ఆయన భూస్వాముల క్రమ పత్రాలను కదిలించి పేదలకు విముక్తి కల్పించేందుకు కృషి చేశారు 1948 మార్చ్ 14 మహా మాదాపూర్ ప్రాంతంలో నిజాం సైన్యంతో జరిగిన ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందారు ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఆయనే త్యాగం మరువలేనిది

రాజన్న సిరిసిల్ల

నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా నిజాం గద్ద ను కదిలించిన పోరు యోధుడు బద్దం ఎల్లారెడ్డి గుర్తింపు పొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలి పల్లి లో జన్మించిన ఆయన ఉద్యమ స్ఫూర్తితో ప్రజల కోసం పోరాడారు జైలు జీవితం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం వంటి కార్యక్రమాలు చురుకుగా పాల్గొన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. 1952 ఎన్నికల్లో పీవీ నరసింహారావు పై ఎంపీగా విజయం సాధించారు

రాజన్న సిరిసిల్ల

ఎస్పీకి పోలీసుల గౌరవ వందనం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

పోలీసుల పర్యవేక్షణలో లెక్కింపు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయ ఉండి ఆదాయం లెక్కింపు బుధవారం భీమేశ్వర సదన్ పార్కింగ్ స్థలంలో నిర్వహించారు సీసీ కెమెరాలు ఎస్ పి ఎఫ్ పోలీసుల నిఘా మధ్య లెక్కింపు కొనసాగింది కార్యక్రమంలో పాల్గొన్న వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అధికారులు అనుమతించారు

రాజన్న సిరిసిల్ల

భూముల వివరాలు పక్కాగా నమోదు చేయాలి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వీర్నపల్లి భూముల రిసర్వే ప్రక్రియను రైతులు సహకరించి విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ సూచించారు బుధవారం మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభలు ఆయన మాట్లాడారు భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని రీ సర్వేను నిర్ణిత లక్ష్యంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు కార్యక్రమంలో వీర్నపల్లి గ్రామ సర్పంచ్ మల్లారం జోష్ణ తాసిల్దార్ ఎంపీడీవో సంబంధిత అధికారులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా సమీకృత కార్యాలయంలో పోషణ మాసం కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆదేశించారు అంగన్ వాడి కేంద్రాల్లో పిల్లల ఎత్తు బరువును ప్రతి నెల నమోదు చేయాలని సూచించారు పోషణ మాసం పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పిల్లల తల్లిదండ్రులకు పోషకాహారం ఆరోగ్య సంరక్షణ పై అవగాహన కల్పించాలని తెలిపారు

రాజన్న సిరిసిల్ల

విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో ప్రాథమిక ఉన్నంత పాఠశాల విద్యార్థులకు బుధవారం పాఠశాల ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు గౌరవ గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఉప సర్పంచ్ బొడ్డు రాజు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వజ్ర మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.