Monday, 21 September 2026

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

BRS నేతల ప్రత్యేక పూజలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని బి ఆర్ ఎస్ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి BRS జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి తో పాటు ప్రజాపతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి ఎస్పి మహేష్ బి గీతే పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు విఘ్నేశ్వరుడు అందరికీ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలని సూచించారు

రాజన్న సిరిసిల్ల

కలెక్టరేట్ లో మట్టి వినాయకుడి ప్రతిష్ట

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వినాయక చవితి సందర్భంగా సోమవారం మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో ఆర్డీవో శ్రీధర్ బాబు ఏవో రామ్ రెడ్డి కలెక్టరేట్ పర్యవేక్షకులు రామచంద్రం శ్రీకాంత్ డి డబ్ల్యూ లక్ష్మీ రాజo డివైస్ ఓ రాందాస్ వేములవాడ తాసిల్దార్ జయంత్ విదేశాలకు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు వినాయకుడు ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాల ను తొలగించి ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యం ప్రసాదించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రార్థించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వ్యవసాయం గాడిన పడి పంటలతో రైతుల కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు

రాజన్న సిరిసిల్ల

ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి అర్చక మండపంలో అర్చకులు వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నవరాత్రుల్లో ప్రతిరోజు విశేష అర్చనలు పూజలు నిర్వహించినట్లు తెలిపారు భక్తులు గణేశుడిని భక్తిశ్రద్ధలతో పూజించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు

రాజన్న సిరిసిల్ల

డిమాండ్లు నెరవేర్చాలని వినతి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని ముదిరాజ్ మత్స్యకార సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు వేములవాడలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు 50 ఏళ్లు దాటిన ముదిరాజులు మత్స్యకారులు మృతిదారులకు పింఛన్లు అందించాలని కోరారు విద్య ఉద్యోగాలు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర పోరాటం చేపడుతామని హెచ్చరించారు

రాజన్న సిరిసిల్ల

తాత్కాలిక మరమ్మతులతో ఉపశమనం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి-బొప్పాపూర్ ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో గొల్లపల్లి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ గ్రామ పాలకవర్గ సభ్యులు ఆదివారం డస్ట్ పోయించి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయించారు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు

రాజన్న సిరిసిల్ల

ప్రధాన రహదారులపై నీరు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో పలు రహదారులు జలమయమయ్యాయి పాత బస్టాండ్ నేతన్న చౌక్ వెంకంపేట రోడ్డు సంజీవయ్య నగర్ ఆటోనగర్ ప్రాంతాల్లో నీరు నిలిచింది సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారిపై నీరు చేరడంతో వాహనదారులు పాద చారులు ఇబ్బందులు పడ్డారు డ్రైనేజీ మురుగునీరు రోడ్డుపైకి రావడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు

రాజన్న సిరిసిల్ల

ఎన్నికల వివాదంతో ఇరు వర్గాల ఘర్షణ

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో పద్మశాలి యువజన సంఘం ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది వెంకంపేటలో పాత విభేదాలు మరోసారి బయటపడటంతో యువకులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు ఈ ఘటనలో తండ్రి కొడుకుతోపాటు నలుగురికి గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఇరు వర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు

రాజన్న సిరిసిల్ల

నరేంద్ర మోడీ నాయకత్వంపై విశ్వాసం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సమర్థ లింగాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ హుస్సేన్ ఎస్కే షాదుల్ షేక్ బాషా బిజెపిలో చేరారు జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు మోదీ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని నాయకులు అన్నారు కార్యక్రమంలో పొన్నాల తిరుపతిరెడ్డి ఉడుగుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.