Monday, 21 September 2026

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆవరణలో BRS నాయకుల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించాలని నాయకులు సూచించారు కార్యక్రమంలో మడి కరీంనగర్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ టు లవ్ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి గూడూరి ప్రవీణ్ రామ్మోహన్ ఆకుల జయంత్ తదితరులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

డాక్టర్ సత్యనారాయణ అభినందనలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ఆసుపత్రి NEHS ఉద్యోగుల హెల్త్ స్కీమ్ లో జిల్లా స్థాయిలో ఎంపికైంది. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ జి సత్యనారాయణ స్వామిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు కదిరి శ్రీనివాస్ ఎలగందుల దేవరాజు మైదం శెట్టి మల్లికార్జున్ లింగాల రాజు బాధ గోపి కంభోజ సతీష్ కదిరి రమేష్ గారు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ ను రాష్ట్ర సర్పంచుల పోరం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చక్కటి వెంకటేష్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా కొండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు తనకు అవకాశం కల్పించిన వెంకటేష్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు

రాజన్న సిరిసిల్ల

లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కు విశేష స్పందన లభించిందని ఎస్పి మహేష్ బి గీతే తెలిపారు లోక్ అదాలత్ ద్వారా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలోని 228 కేసులు పరిష్కరించబడ్డాయని చెప్పారు. ఇందులో 56 పెట్టి కేసులు. 623 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. 11456 ట్రాఫిక్ చాలన కేసులు. 75 సైబర్ క్రైమ్ కేసులు ఉన్నాయని. సైబర్ మోసాల్లో బాధితులకు రూ. 2,79,030 పైగా రిఫండ్ అందించేలా కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు

రాజన్న సిరిసిల్ల

ఎల్లారెడ్డిపేటలో బి ఎల్ ఏ ల సమావేశం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బూతు లెవెల్ ఆఫీసర్ సమావేశం నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూడిది రాజేందర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బి ఎల్ ఏ ల వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని గిద్దె చెరువు సమీప పార్కులో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి పూజలు నిర్వహించారు కార్యక్రమంలో BRS జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలగందుల నరసింహులు పాల్గొన్నారు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు

రాజన్న సిరిసిల్ల

కొండ సురేఖకు అధిష్టానం పిలుపు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ క్యాబినెట్ నుంచి భర్త రఫ్ అయిన కొండ సురేఖకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం కార్యకర్తలతో భేటీ అనంతరం సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది క్యాబినెట్ హోదాతో కూడిన పదవి ఇచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతుంది రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి కూడా కొండ సురేఖతో మాట్లాడినట్లు సమాచారం పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తుంది

రాజన్న సిరిసిల్ల

సమావేశానికి సభ్య దేశాల నేతలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 బ్రిక్స్ సమ్మిట్ రెండో రోజు ఓపెన్ శేషన్ ప్రారంభమైంది. అంతకుముందు భారత మండపంలో 11 సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాల నేతలు కలిసి బ్రిక్స్ ఫ్యామిలీ ఫోటోకు ఫోజ్ ఇచ్చారు రెండో రోజు సమావేశానికి మొదటి రోజు హాజరుకాని పలువురు దేశాల నేతలు కూడా హాజరయ్యారు

రాజన్న సిరిసిల్ల

వినాయక చవితి పూజకు శుభముహూర్తం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ ఏడాది సెప్టెంబర్ 14 సోమవారం వినాయక చవితి జరుపుకోనున్నారు అమృత శుభ సిద్ధియోగాలు ఏర్పడటంతో పండుగకు ప్రత్యేకత ఉందని పండితులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విగ్రహ ప్రతిష్ట పూజకు సమయంగా సూచించారు భక్తులు తమ ఆచారం ప్రకారం ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది రోజులు పూజలు నిర్వహించి నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపారు

రాజన్న సిరిసిల్ల

తలనీలాల ద్వారా రూ . 16 కోట్ల 23 లక్షల ఆదాయం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన తలనీలాలు ద్వారా రూ. 16 కోట్ల 23 లక్షల ఆదాయం సమకూరింది. వేలంపాటలో కళావతి ఎంటర్ప్రైజెస్ రూ. 14 కోట్ల ఒక లక్షకు లైసెన్స్ దక్కించుకుంది కళ్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ. రెండు కోట్ల 22 లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో నాయి బ్రాహ్మణులకు 40% వాటా ఇవ్వనున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.