Monday, 21 September 2026

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

మట్టి గణపతులతో పర్యావరణ పరిరక్షణ

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి జెడ్ పి హెచ్ ఎస్ లో శుక్రవారం మట్టి గణపతుల తయారీ కార్యక్రమం నిర్వహించారు ఉపాధ్యాయుల సూచనలతో విద్యార్థులు మట్టితో వివిధ ఆకారాల్లో గణపతి విగ్రహాలను తయారు చేసి అలంకరించారు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో చెరువులు కలుషితమవుతుందని మట్టి విగ్రహాలతో పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

అభ్యర్థులకు పోలీసుల అవగాహన కార్యక్రమం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు శిక్షణకు పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థులు శనివారం ఉదయం 8:30 గంటలకు సిరిసిల్లలోని లహరి బ్యాంక్ టు హాల్ కు హాజరుకావాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే ప్రకటనలో తెలిపారు

రాజన్న సిరిసిల్ల

నేత కళాకారుడి అద్భుత ప్రతిభ

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లకు చెందిన ప్రాముఖ్య చేనేత కళాకారుడు వెల్ది హరి ప్రసాద్ మరో అద్భుత కళాఖండాన్ని రూపొందించారు రత్నకుమారి కోటేశ్వరరావు ఆర్డర్ మేరకు 45 రోజుల పాటు శ్రమించి పట్టుచీరపై వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్రను వేశారు చీరలో 102 మంది ఋషుల పేర్లు 102 గోత్రనామాలు 25 చారిత్రక చిత్రాలను పొందుపరిచారు పట్టు దారం రెండు గ్రాముల బంగారు జరిలో ఏడు మీటర్ల చీరను రూపొందించి తన ప్రతిభను మరోసారి చాటారు

రాజన్న సిరిసిల్ల

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం లోని మిడ్ మానేరు ముంపు గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఐటి ఇతర పరిశ్రమల ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు శాసనసభలో పరిశ్రమలు ఐటీ రంగాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు సుమారు 12 ముంపు గ్రామాల్లో ఉపాధి లేక యువత ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని పరిశ్రమల ఏర్పాటుతో వలసలకు అడ్డుకట్టు వేయవచ్చు అన్నారు సిరిసిల్లలో మాదిరిగా మగ్గాల శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంచి శ్రీధర్ బాబుని కోరారు

రాజన్న సిరిసిల్ల

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం లోని మిడ్ మానేరు ముంపు గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఐటి ఇతర పరిశ్రమల ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు శాసనసభలో పరిశ్రమలు ఐటీ రంగాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు సుమారు 12 ముంపు గ్రామాల్లో ఉపాధి లేక యువత ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని పరిశ్రమల ఏర్పాటుతో వలసలకు అడ్డుకట్టు వేయవచ్చు అన్నారు సిరిసిల్లలో మాదిరిగా మగ్గాల శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంచి శ్రీధర్ బాబుని కోరారు

రాజన్న సిరిసిల్ల

కూలి పెంపునకు కార్మికుల డిమాండ్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో కాటన్ చీరల కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది కూలి పెంపున కు ముందుకు రాని యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బివై నగర్ లోని చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు సి ఐ టి యు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడారు ఒప్పంద గడువు ముగిసి రెండేళ్లు దాటినా కూలి పెంచలేదని ఆరోపించారు

రాజన్న సిరిసిల్ల

రెడ్డి సంఘానికి నూతన పాలకవర్గం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామ రెడ్డి సంఘం నూతన పాలకవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా సత్తు వెంకట్ రెడ్డి రెండోసారి ఉపాధ్యక్షుడిగా కడారి అశోక్ రెడ్డి క్యాషియర్ గా పురాని సంతోష రెడ్డి కోశాధికారిగా ముంతంగి ప్రతాపరెడ్డి ఎన్నికయ్యారు సంఘ అభివృద్ధితో పాటు సభ్యులు ఐక్యతకు కృషి చేస్తానని అధ్యక్షుడు వెంకట్ రెడ్డి తెలిపారు కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

నూతన కమిటీకి శుభాకాంక్షలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని ఐదో వార్డ్ సుభాష్ నగర్ కాంగ్రెస్ కమిటీని నియమించారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజ్ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులను ఎంపిక చేసి నియామక పత్రాన్ని వార్డ్ అధ్యక్షుడు మల్యాల నాగరాజు కు అందజేశారు నూతన కమిటీ సభ్యులకు నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు

రాజన్న సిరిసిల్ల

అనుమతుల పేరుతో ఇబ్బందులు వద్దు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 ప్రజలు సిరిసిల్ల జిల్లా వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాట్లపై ప పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి అన్నారు అనుమతుల పేరుతో నిర్వాహకులను భయభ్రాంతులకు గురి చేయవద్దని కోరారు హిందువులు స్వేచ్ఛగా పండుగ జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మండపాల నిర్వహణ విగ్రహాల ప్రతిష్ట విషయంలో అనవసర ఇబ్బందులు కలిగించరాదన్నారు

రాజన్న సిరిసిల్ల

వీర వనిత సేవలు స్ఫూర్తిదాయకం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజాకార్ల దోపిడి దౌర్జన్యాలను ఎదిరించి హక్కుల కోసం పోరాడిన వీరవనిత ఐలమ్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.