Monday, 21 September 2026

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

శ్రావణ సోమవారం భక్తుల సందడి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి సోమవారం భక్తుల రద్దీ నెలకొంది ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరి సాయి వేద పండితులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు కో డే మొక్కులు తలనీలాలు సమర్పించారు ధర్మదర్శనంలో ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు

రాజన్న సిరిసిల్ల

కెసిఆర్ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 6 కెసిఆర్ అసెంబ్లీకి వస్తే సీఎం రేవంత్ రెడ్డి తట్టుకోలేరన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు అదే నిజమైతే కెసిఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు టిఆర్ఎస్ కోరుకున్నట్లే రేవంత్ ప్రభుత్వం బలహీన పడుతుందని భావిస్తే అసెంబ్లీలో ఎదురుకోవచ్చు అన్నారు మరోవైపు కేసీఆర్ సభకు హాజరు కాకపోవడానికి నిరసిస్తూ హైదరాబాదులో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు

రాజన్న సిరిసిల్ల

సిరిసిల్లలో జెండా ఎగిరేస్తామన్న నేతలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 6 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై టిఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు విమర్శలు చేశారు సిరిసిల్లను తదుపరి లక్ష్యంగా చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో జిల్లాకు వస్తామని ప్రకటించారు ఈ నెలలో సిరిసిల్ల గడ్డపై మూడు రంగుల జెండా ఎగరేస్తా ఆ తర్వాత సిద్దిపేట పై దండయాత్ర చేస్తాం టిఆర్ఎస్ నేతలతో కలపడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు

రాజన్న సిరిసిల్ల

నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 6 రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని నాయకులు తెలిపారు గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి సొంతింటి కలను నెరవేరుస్తున్నట్లు చెప్పారు గోపాల్ రావు పల్లె అంకుష్పూర్ గ్రామాల్లో లబ్ధిదారులతో కలిసి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఆగ్రహం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 6 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ టిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు కేటీఆర్ పిలుపుమేరకు నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నికల హామీలు 6 గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దొంతి నేని చందర్ రావు ఆరోపించారు గ్రామపంచాయతీకి నిధులు లేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని అన్నారు

రాజన్న సిరిసిల్ల

గురువుల సేవలకు పద్మశాలి సంఘం గౌరవం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 6 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు నిర్వహించారు పద్మశాలి కుల బంధువులైన డి సంజీవ్ కుమార్ జెడ్పిహెచ్ఎస్ రాచర్ల గొల్లపల్లి మాన్య రవి జెడ్ పి హెచ్ ఎస్ వెంకటాపూర్ ఉపాధ్యాయులను సంఘం అధ్యక్షుడు వనం రమేష్ కమిటీ సభ్యులు సన్మానించారు సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రమేష్ అన్నారు

రాజన్న సిరిసిల్ల

రాచర్ల జూనియర్ కళాశాలలో గురు పూజోత్సవం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి రాచర్ల జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు కళాశాల ప్రిన్సిపాల్ కె చిరంజీవి మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర గొప్పదన్నారు అధ్యాపకులను శాలువలతో సత్కరించారు డైరెక్టర్లు ఏలూరు రాజయ్య టి శ్యాంసుందర్రావు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

లబ్ధిదారులకు రేషన్ కార్డుల అందజేత

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నూతన రేషన్ కార్డుల పంపిణీ చేపట్టారు సర్పంచ్ సామర్ల దేవరాజు ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు కార్డులు అందజేశారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు కార్యక్రమంలో రేషన్ డీలర్ గ్రామస్తులు లబ్ధిదారులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

పిండ ప్రధానం కేసులో బెయిల్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా లో కేటీఆర్ పిలుపుమేరకు ఎల్లారెడ్డిపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం చేసిన నలుగురు BRS నాయకులను పోలీసులు అరెస్టు చేశారు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పరచగా కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు ఎవరు చేశారు రూ. పదివేల పూచి కత్తు సమర్పించాలని ఆదేశించారు

రాజన్న సిరిసిల్ల

చీరల పంపిణీ పై ప్రభుత్వం కసరత్తు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇప్పటికే సగం చీరలు జిల్లాలకు చేరగా మిగిలినవి త్వరలో రానున్నాయి దసరాకు ముందే పంపిణీ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు పారదర్శకత కోసం ప్రతి మహిళకు చీర అందజేతను ఫోటోతో నమోదు చేయనున్నట్లు సమాచారం గతంలో పాలపిట్ట రంగు చీరలు ఇవ్వగా ఈసారి చిలకపచ్చ రంగు చీరలు పంపిణీ చేయనున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.