తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీలో ఇష్టారాజ్యంగా పోస్టింగులు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెక్రటరీ కార్యాలయం నుంచి ఒకే ఉత్తర్వుతో టీచర్లకు పోస్టింగ్లు ఇచ్చినట్లు సమాచారం. జిల్లాల్లో ఇప్పటికే హెచ్ఎంలు, టీచర్లు ఉండగానే మరిన్ని పోస్టింగులు ఇవ్వడం వివాదాస్పదమైంది. సీనియారిటీ, ఖాళీలు, అర్హతలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో అసలు అర్హులైన వారికి అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టత ఇవ్వాలని ఉద్యోగులు, ప్రజలు కోరుతున్నారు

ఖాళీ లేకున్నా పోస్టింగ్!