Friday, 12 June 2026
  • Home  
  • బిక్కవోలు మేజర్ డ్రెయిన్‌లో డ్రోన్ల ద్వారా కెమికల్ స్ప్రేయింగ్‌కు శ్రీకారం
- తూర్పు గోదావరి

బిక్కవోలు మేజర్ డ్రెయిన్‌లో డ్రోన్ల ద్వారా కెమికల్ స్ప్రేయింగ్‌కు శ్రీకారం

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు  పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా  గుర్రపు డెక్క, తూడును నియంత్రించి సాగునీటి ప్రవాహాన్ని మెరుగుపరచడమే లక్ష్యం బిక్కవోలు, జూన్ 12 ( పున్నమి న్యూస్ ): బిక్కవోలు మండలంలోని బిక్కవోలు మేజర్ డ్రెయిన్ బండి రేవు వద్ద గుర్రపు డెక్క, తూడును నియంత్రించి సాగునీటి ప్రవాహాన్ని సక్రమంగా నిర్వహించేందుకు డ్రోన్ల ద్వారా కెమికల్ స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని పరిశీలించారు. కాలువల్లో పెరిగే జలకలుపు, తూడును నియంత్రించడం ద్వారా సాగునీటి సరఫరా నిరాటంకంగా జరిగి రైతులకు మెరుగైన ప్రయోజనం చేకూరుతుందని వారు పేర్కొన్నారు. డ్రోన్ సాంకేతికత వినియోగంతో తక్కువ సమయంలో విస్తృత ప్రాంతంలో కెమికల్ స్ప్రేయింగ్ చేపట్టడం సాధ్యమవుతుందని, దీంతో కాలువల నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, బిక్కవోలు మండల, గ్రామ స్థాయి కూటమి నాయకులు, కార్యకర్తలు, డీసీలు, నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు 

పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా 

గుర్రపు డెక్క, తూడును నియంత్రించి సాగునీటి ప్రవాహాన్ని మెరుగుపరచడమే లక్ష్యం

బిక్కవోలు, జూన్ 12 ( పున్నమి న్యూస్ ): బిక్కవోలు మండలంలోని బిక్కవోలు మేజర్ డ్రెయిన్ బండి రేవు వద్ద గుర్రపు డెక్క, తూడును నియంత్రించి సాగునీటి ప్రవాహాన్ని సక్రమంగా నిర్వహించేందుకు డ్రోన్ల ద్వారా కెమికల్ స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని పరిశీలించారు. కాలువల్లో పెరిగే జలకలుపు, తూడును నియంత్రించడం ద్వారా సాగునీటి సరఫరా నిరాటంకంగా జరిగి రైతులకు మెరుగైన ప్రయోజనం చేకూరుతుందని వారు పేర్కొన్నారు.

డ్రోన్ సాంకేతికత వినియోగంతో తక్కువ సమయంలో విస్తృత ప్రాంతంలో కెమికల్ స్ప్రేయింగ్ చేపట్టడం సాధ్యమవుతుందని, దీంతో కాలువల నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, బిక్కవోలు మండల, గ్రామ స్థాయి కూటమి నాయకులు, కార్యకర్తలు, డీసీలు, నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.